మ్యూజిక్ డైరెక్టర్స్ సినిమాలకు పాటలను ఎలా బాణి కడతారో మనకు తెలియదు. మనం ఎప్పుడు చూడలేదు. ఆ సంగీతం మీద మంచి పట్టు ఉన్న కొద్ది మందికి మాత్రమే ఆ పరిజ్ఞానం ఉంటుంది, వారికే తెలుస్తుంది. అందులో మళ్లీ అందరిదీ ఒకే తీరు ఉండదు. ఒక్కో పద్ధతిలో, ఒక్కో శైలిలో కంపోజ్ అండ్ రికార్డింగ్ చేస్తారు. మ్యూజిషన్స్ అందరిలోకి ఇళయరాజాది ఒక ప్రత్యేకమైన సంగీత ప్రపంచం. ఆయన ఒక పాటని ఆ రోజుల్లో ఎలా కంపోజ్ చేసేవాల్లో ఇక్కడ తెలుసుకుందాం.
పాట రికార్డ్ చెయ్యాలనుకుంటే..
ఒక పాట రికార్డు చెయ్యాలి అనుకుంటే ముందుగా దానికి తగ్గ నోట్స్ ప్రిపేర్ చేసుకుని. అది రాసుకున్న తరువాత ఆ బాణికి తగిన కావాల్సిన మ్యూజిషన్స్ అందరినీ ఒకే చోట ఉండేలా చూసుకునేవారు. చిత్ర దర్శకుడు కథ చెప్పి సందర్భం వివరించిన పాటకి 60 నుంచి 80 మంది ఒకే సమయంలో ఒకే చోట ఒక పాట కోసం సాధన చేసేవాళ్ళు. సంగీతం అంతా సరే అనుకున్న తరువాత అప్పుడు పాట రచయితని పిలిపించుకుని పాట రాయించుకునేవారు.
ఒక పాట కోసం లెక్కలేనన్ని టేక్స్!
మ్యూజిక్ విభాగంలో అన్నీ సరిపోయాయి అనుకున్నప్పుడు దానికి తగిన గాయకుల పేరుని ఒక పేపర్‌పైన రాసేవారు. అక్కడ ఉన్న మేనేజర్స్ వారికి ఫోన్ చేసి పిలిపించేవారు. సాంగ్ బాగా వచ్చేంతవరకు దాదాపు నాలుగు నుంచి పదిహేను టేక్స్ కూడా తీసుకునేవారు. పాట ఓకే అని ఇళయరాజా అనుకున్న తరువాత ఆ పాటకి షూటింగ్ చేసేవారు. అలా అందరూ ఒకే పనిని ఒకే ఏకాగ్రతతో ఒకే సమయంలో ఒకే దగ్గర చేయడం వలన పాటలన్నీ కూడా ఇప్పటికీ ఆదరణ పొందుతున్నాయి. ఇన్ని సంవత్సరాలుగా ఆ పాటలన్నీ అంతా బాగా అలరిస్తున్నాయి అంటే కారణం నా జీవితం అని ఇళయరాజా అన్నారు. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలే పాటలుగా వచ్చాయని, అవే ఇప్పుడు మీరు సందర్బాన్ని బట్టి ఉపయోగించుకుంటున్నారని అన్నారు.
ఇలా ఉంటే.. పాటలో ఎలా ఫీల్ వస్తుంది!
ఇప్పుడు అంతా మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడో ట్యూన్ చేస్తాడు, రైటర్ ఇంకో చోట ఉంటాడు. సింగర్స్ ఒక్కోసారి ఒక్కరు వచ్చి పాడుతారు. వీళ్ళేం చేస్తారో వాళ్లకి తెలియదు, వాళ్ళేం చేస్తారనేది వీళ్లకు తెలియదు. కాబట్టి అందరి మైండ్‌సెట్ ఒకే లాగా పనిచేయదు. ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. అప్పుడు ఒక పాటలో ఫీల్ ఎలా వస్తుంది? రాదు, అని ఇళయరాజా సద్విమర్శలు చేశారు. ఇళయరాజాకు సంబంధించిన విజయవాడలో మ్యూజిక్ లైవ్ ప్రోగ్రాం జరగబోయే ముందు రోజు మీడియాతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు. వీటి గురించి నెటిజన్స్ ఒక్కొక్కరు ఒకలాగా స్పందిస్తున్నారు.
అదీ.. ఆయన అంకిత భావం!
ఆనాడు ఇళయరాజా అందించిన సంగీతం, ఆ పాటలు ఇప్పటి కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. కేవలం ఆ పాటలు, సంగీతంతోనే హిట్ అయిన సినిమా బోలెడు. అందుకే ఆయనని మ్యూజిక్ మ్యాస్ట్రో అని పిలుస్తారు. ఇప్పటికీ ఇళయరాజాను సంగీత దర్శకుడిగా ఎంతో మంది కోరుకుని వారితో సినిమాలకు వర్క్ చేయించుకుంటున్నారు. ఇన్ని యేండ్లు అయినా ఆయన పనిలో ఎక్కడ కూడా వ్యత్యాసం కనిపించదు. అంతటి అంకిత భావంతో ఇళయరాజా పని చేస్తారు.
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.