బ్రిటిష్ బ్రాండ్ కారుతో కనిపించిన ‘రిషబ్ పంత్’.. దీని రేటెంతో తెలిస్తే షాకవుతారు!

Rishabh Pant With Land Rover Defender 110: ఇప్పటి వరకు సినీతారలు కొనుగోలు చేసిన ఖరీదైన కార్లను గురించి, వారు ఉపయోగించే కార్లను గురించి తెలుసుకున్నాం. అంతే కాకుండా వారు ఖరీదైన కార్లలో కనిపించిన సందర్భాలను గురించి, ఆ కార్లను గురించి కూడా తెలుసుకున్నాం. ఇటీవల యంగ్ క్రికెటర్ ‘రిషబ్ పంత్’ ఓ కొత్త కారులో కనిపించారు. ఇంతకీ ఆ కారు ఏది? దాని ధర ఎంత అనే మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110

క్రికెటర్ రిషబ్ పంత్ ఇటీవల ‘ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110’ కారులో ముంబై విమానాశ్రయంలో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో వైట్ కలర్ ల్యాండ్ రోవర్ కారులో వద్ద రిషబ్ ఉండటం చూడవచ్చు. ఆ తరువాత విమానాశ్రయం లోపలికి వెళ్లే సమయంలో అభిమానికి ఆటోగ్రాఫ్ ఇవ్వడం వంటివి చూడవచ్చు.

ఇక్కడ కనిపించే కారు ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన డిఫెండర్ 110. దీని ప్రారంభ ధర రూ. 97 లక్షల నుంచి రూ. 2.35 కోట్ల (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉంటుంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే ఫోటోలలో కనిపించే కారు ఏ ఇంజిన్ మోడల్ అనేది స్పష్టంగా వెల్లడికాలేదు.

సెలబ్రిటీలకు ఇష్టమైన కారు

భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా గ్లోబల్ మార్కెట్లో కూడా అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్లలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 చెప్పుకోదగ్గ మోడల్. ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దీనికి రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇది అద్భుతమైన సామర్థ్యం కలిగి ఉంటుంది. కాబట్టి ఎక్కువమంది సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.

మంచి డిజైన్ కలిగిం ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 కారు 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు 12.3 ఫుల్లీ డిజిటర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా ఇందులో ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్స్ అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ చార్జర్, కనెక్టెడ్ కార్ ఫీచర్స్, ప్రీమియం స్పీకర్ సిస్టం, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్షన్, 360 డిగ్రీ కెమెరా మరియు హీటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి అధునాతన ఫీచర్స్ పొందుతుంది.

ఇక సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 SUV బ్లైండ్ స్పాట్ అసిస్ట్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, లెదర్ అపోల్స్ట్రే మొదలైనవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

వేరియంట్లు

ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90, 110 మరియు 130 అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. డిఫెండర్ 90 అనేది మూడు డోర్స్ కలిగిన మోడల్. డిఫెండర్ 110 మరియు 130 మోడల్స్ రెండూ 5 డోర్స్ మోడల్స్. ఇవి రెండూ డిఫెండర్ 90 కంటే పరిమాణంలో కొంత పెద్దవిగా ఉంటాయి. ఈ మూడు వేరియంట్లు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందించేలా రూపొందించబడి ఉంటాయి.

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ అనేది మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. అవి 2.0 లీటర్ పెట్రోల్, 3.0 లీటర్ పెట్రోల్ మరియు 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్లు. కంపెనీ 110 మరియు 90 మోడల్స్ కోసం 5.0 లీటర్ వీ8 పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా పరిచయం చేసింది. అన్ని ఇంజిన్లు స్టాండర్డ్‌గా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తాయి. అంతే కాకుండా వాహనంలో లాకింగ్ సెంటర్ డిఫరెన్షియల్ అండ్ యాక్టివ్ రియర్ లాకింగ్ డిఫరెన్షియల్స్‌తో పర్మినెంట్ ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుంది.

Don’t Miss: రూ.23 లక్షల కంటే ఎక్కువ ధరకు అమ్ముడైన పక్షి ఈక – ఎందుకింత స్పెషల్ తెలుసా?

రిషబ్ పంత్ మాత్రమే కాకుండా.. ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్ కూడా డిఫెండర్ 110లో కనిపించారు. అయితే క్రికెటర్లు సొంతంగా ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్లను కలిగి ఉన్నట్లు స్పష్టంగా తెలియదు. అయితే సునీల్ శెట్టి, అర్జున్ కపూర్, ఆయుష్ శర్మ, సన్నీ డియోల్, సంజయ్ దత్, అబితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, కరీనా కపూర్, సోనమ్ కపూర్, జిమ్మీ షీర్‌గిల్, నేహా కక్కర్ మరియు మమ్ముట్టి వంటి సినీతారలు ల్యాండ్ రోవర్ కార్లను కలిగి ఉన్నారు.