ఫిదా చేస్తున్న కలర్ ఆప్షన్స్.. Jawa 42 FJ బైక్ లాంచ్: రేటెంతో తెలుసా?

Jawa 42 FJ Bike Launched in India: రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవల తన 2024 క్లాసిక్ 350 బైక్ లాంచ్ చేసిన తరువాత.. జావా మోటారుసైకిల్ ఎట్టకేలకు ’42 ఎఫ్‌‌‌‌‌‌‌‌జే’ బైకును లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ దాని 42 శ్రేణిలో భాగమే. అయితే ఇది జావా 42 బేస్ మోడల్ బైక్ కంటే రూ. 26000 ఎక్కువ ధర వద్ద లభిస్తుంది.

ధరలు & కలర్ ఆప్షన్స్ (Price & Colour Options)

కొత్త జావా 42 ఎఫ్‌‌‌‌‌‌‌‌జే (Jawa 42 FJ) బైక్ ధరలు రూ. 1.99 లక్షల నుంచి రూ. 2.20 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇది మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఎంచుకునే కలర్ ఆప్షన్ మీద ధర ఆధారపడి ఉంటుంది. ఆ ధరలను ఇక్కడ చూడవచ్చు.

అరోరా గ్రీన్ మాట్టే (స్పోక్ వీల్ పొందుతుంది): రూ. 1.99 లక్షలు
అరోరా గ్రీన్ మాట్టే: రూ. 2.10 లక్షలు
మిస్టిక్ కాపర్: రూ. 2.15 లక్షలు
కాస్మో బ్లూ మాట్టే: రూ. 2.15 లక్షలు
డీప్ బ్లాక్ మాట్టే బ్లాక్ క్లాడ్: రూ. 2.20 లక్షలు
డీప్ బ్లాక్ మట్టీ రెడ్ క్లాడ్: రూ. 2.20 లక్షలు

డిజైన్ (Design)

కొత్త జావా 42 ఎఫ్‌‌‌‌‌‌‌‌జే బైక్.. స్టాండర్డ్ జావా 42 కంటే చాలా స్పోర్టియర్ డిజైన్ పొందుతుంది. అయితే ఇందులోని ట్విన్ ఎగ్జాస్ట్ కొంచెం అప్‌స్వెప్ట్ డిజైన్ పొందుతుంది. టియర్ డ్రాప్ షేప్ ఫ్యూయెల్ ట్యాంక్.. ఎల్ఈడీ లైటింగ్ సెటప్ ఇందులో చూడవచ్చు. సైడ్ కవర్ మాత్రం మునుపటి మోడల్ మాదిరిగానే ఉంది. ఈ బైక్ జావా 42 కంటే 790 మిమీ ఎక్కువ పొడవుగా ఉంటుంది.

ఫీచర్స్ (Features)

కొత్త జావా 42 ఎఫ్‌‌‌‌‌‌‌‌జే బైకులోని ఫీచర్స్ దాదాపు స్టాండర్డ్ మోడల్ బైకును తలపిస్తాయి. ఇందులోని సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ బైక్ గురించి రైడర్లకు చాలా సమాచారం అందిస్తుంది. సింగిల్ పీస్ సీటు లాంగ్ రైడ్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తం మీద ఈ బైకులో రైడర్లకు కావలసిన ఫీచర్స్ అన్నీ ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ఇంజిన్ (Engine)

జావా 42 ఎఫ్‌‌‌‌‌‌‌‌జే కొంత అప్డేటెడ్ డిజైన్ పొందినప్పటికీ.. జావా 42 బైకులోని అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి ఇందులో 334 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 29.1 హార్స్ పవర్ మరియు 29.6 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి పనితీరు ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాము.

కొత్త జావా 42 ఎఫ్‌‌‌‌‌‌‌‌జే యొక్క సీటు ఎత్తు 790 మిమీ వరకు ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 178 మిమీ కాగా ఈ బైక్ మొత్తం బరువు 184 కేజీలు. ఇంజిన్ 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్‌తో డబుల్ క్రెడిల్ ఫ్రేమ్ చుట్టూ చుట్టబడిన ఉంటుంది. వీల్‌బేస్ పొడవు 1440 మీమీ. ఈ బైక్ 320 మిమీ ఫ్రంట్ డిస్క్, వెనుక భాగంలో కూడా డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా అందుబాటులో ఉంది.

ప్రత్యర్థులు (Rivals)

మల్టిపుల్ కలర్ ఎంపికలలో లభించే జావా 42 ఎఫ్‌‌‌‌‌‌‌‌జే దేశీయ విఫణిలో ఇప్పటికే అమ్మకానికి ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా సీబీ350 మరియు హీరో మావ్రిక్ 440 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా కొంత పోటీ తట్టుకోక తప్పదు. అయితే ఈ జావా 42 ఎఫ్‌‌‌‌‌‌‌‌జే బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా హుందాగా ఉంది. ఇది తప్పకుండా ఎక్కువమంది వాహన ప్రియులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాము.

Don’t Miss: ఓటమి ఎరుగని దర్శకధీరుడు ‘రాజమౌళి’ కార్లు చూశారా? బెంజ్, ఆడి, వోల్వో ఇంకా..

భారతదేశంలో కొత్త బైకులకు డిమాండ్ పెరుగుతున్న సమయంలో జావా కొత్త 42 ఎఫ్‌‌‌‌‌‌‌‌జే బైక్ లాంచ్ చేసింది. ఇది దేశీయ విఫణిలో ఎలాంటి అమ్మకాలను పొందుతుంది. ప్రత్యర్థులను ఎదుర్కోగలదా? ఈ బైక్ ఎలాంటి పర్ఫామెన్స్ అందిస్తుంది వంటి మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో తెలుస్తాయి. అయితే ఈ బైక్ ఆధునిక కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. కాబట్టి తప్పకుండా పొందుతుందని భావిస్తున్నాము.