మార్కెట్లో సాధారణ కార్లకు మాత్రమే కాకుండా లిమిటెడ్ ఎడిషన్స్ లేదా స్పెషల్ ఎడిషన్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కొన్ని దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు అప్పుడప్పుడు ఈ తరహా కార్లను లాంచ్ చేస్తుంటాయి. ఇప్పుడు జీప్ ఇండియా రాంగ్లర్ విల్లీస్ 41 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని గురించి పూర్తి సమాచారం ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
1941 నాటి కారుకు గుర్తుగా..
జీప్ రాంగ్లర్ విల్లీస్ 41 లిమిటెడ్ ఎడిషన్.. 1941 విల్లీస్ ఎంబీకి గుర్తుగా లాంఛ్ చేయడం జరిగింది. దశాబ్దాల నాటి మోడల్ పేరుతో ఇప్పుడు కారు లాంచ్ కావడం వాహన ప్రియులకు మంచి వార్త. అయితే దీనిని సంస్థ 41 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. అంటే 41 కార్లను మాత్రమే విక్రయిస్తుందన్నమాట. 2025లో కూడా జీప్ కంపెనీ విల్లీస్ 41 స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. అది కేవలం ఏడు రోజుల్లోనే అమ్ముడైపోయింది.
2025లో లాంచ్ అయిన విల్లీస్ 41 స్పెషల్ ఎడిషన్ పొందిన డిమాండును దృష్టిలో ఉంచుకునే.. కంపెనీ మరోమారు ఈ మోడల్ స్పెషల్ ఎడిషన్ తీసుకొచ్చింది. ఇది చూడటానికి రాంగ్లర్ రూబికాన్ మాదిరిగా ఉంటుంది. కాగా ధర దానికంటే రూ. 2 లక్షలు ఎక్కువ.
స్పెషల్ ఎడిషన్ ప్రత్యేకత
జీప్ రాంగ్లర్ విల్లీస్ 41 లిమిటెడ్ ఎడిషన్.. 1941 నాటి థీమ్ గ్రాఫిక్స్ పొందుతుంది. ఇది లిమిటెడ్ ఎడిషన్ అని తెలియజేయడానికి బోనెట్ మీద సిన్స్ 1941 అని ఉండటం కనిపిస్తుంది. మొత్తం థీమ్ 1941 నాటి మిలిటరీ స్పెక్ విల్లీస్ అని తెలుస్తోంది.
విల్లీస్ లిమిటెడ్ ఎడిషన్ మోటరైజ్డ్ సైడ్ స్టెప్, ఇంటిగ్రేటెడ్ డాష్ కెమెరా వంటివి ఉన్నాయి. కంపెనీ రూ. 3.60 లక్షల ధరతో ఆప్షనల్ కిట్ కూడా అందిస్తోంది. ఇందులో సైడ్ ల్యాడర్ కలిగి.. ఒక రూప్ క్యారియర్ & సన్‌రైడర్ రూఫ్‌టాప్ ఉంది. ఈ కిట్ టూరింగ్ లేదా ఆఫ్ రోడింగ్ చేసేవారికోసం ప్రత్యేకంగా పరిచయం చేసింది.
ధర ఎంతంటే?
రూ. 70.31 లక్షల ఖరీదైన విల్లీస్ 41 లిమిటెడ్ ఎడిషన్.. 2.0 లీటర్ 4 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 266 బీహెచ్పీ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటికు గేర్‌బాక్స్ మాత్రమే కాకుండా.. 4 వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది.
ప్రస్తుతం జీప్ ఇండియా ఈ లిమిటెడ్ ఎడిషన్ కారును దేశంలోని బ్రాండ్ డీలర్‌షిప్‌లో ఉంచినట్లు సమాచారం. ఇది 41 యూనిట్లకు మాత్రమే పనిమితం కాబట్టి.. పరిమిత కాలం వరకు అందుబాటులో ఉంటుంది. అంటే ముందుకు బుక్ చేసుకున్న వాళ్లకు మాత్రమే లభిస్తుందన్నమాట.
భారతదేశంలోని జీప్ కార్లు!
జీప్ కంపెనీ లాంచ్ చేసే కార్లకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కాబట్టి సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కార్లను లేదా కొంత అప్డేట్ చేసిన కార్లను లాంచ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం జీప్ మెరిడియన్, జీప్ కంపాస్, జీప్ గ్రాండ్ చెరోకీ, జీప్ రాంగ్లర్ కార్లు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా లిమిటెడ్ ఎడిషన్ కూడా యాడ్ అయింది.
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.