తెలంగాణలో ఇన్ని రోజులు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వీసీకె ఇతరత్రా పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు అందరూ కూడా హోరా హోరిగా ఎన్నికల ప్రచారాలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. మొత్తానికి హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఈరోజు సాయంత్రానికి (11/10/2025)న ముగిసింది. ఎవరి భవితవ్యం ఏమిటి అనేది నియోజకవర్గ ప్రజలు నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించిన సంబందించిన ఓట్లన్నీ ఈవిఏంలో భద్రంగా ఉన్నాయి. అయితే వారి నిర్ణయం ఏమై ఉంటుంది?, ఎవరిని గెలిపించారు?, ఎవరిని వద్దనుకున్నారు?, అనేది తెలియడానికి మాత్రం ఇంకా మూడు రోజులు (14/10/2025) ఆగాల్సిందే. అయితే అంతకు ముందే పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రూపంలో ఇప్పటికే ఎవరు ఎమ్మెల్యే అవుతారని తీర్పులు ఇచ్చేశాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం..
ఎగ్జిట్ పోల్స్ ఏమి చెబుతున్నాయంటే
నాగన్న సర్వే
- కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి: 47 శాతం
- బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి: 46 శాతం
- బీజేపీ పార్టీ అభ్యర్థి: 8.7
- ఇతరులుకు: 00 శాతంగా
ఈ నాగన్న సర్వే అనే సంస్థ తమ యొక్క సర్వేని ఇలా బయటపెట్టింది ఇక్కడ చూస్తే కాంగ్రెస్, బిఆర్ఎస్ పోటాపోటీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. బీజేపీ గెలుపుకి ఆమడం దూరంలో ఉంది. ఇతరులకు అయితే అస్సలు ఒక్క శాతం కూడా ఛాన్స్ ఇవ్వలేదు.
స్మార్ట్ పోల్ సర్వే
- కాంగ్రెస్ అభ్యర్థి: 48.2 శాతం
- బీఆర్ఎస్ అభ్యర్థి: 42.1 శాతం
- బీజేపీ అభ్యర్థి: 7.6 శాతం
- ఇతరులు: 2.1 శాతం
పైన చెప్పిన నాగన్న సర్వేతో పోల్చుకుంటే.. స్మార్ట్ పోల్ సర్వే కాంగ్రెస్ పార్టీకీ ఒకశాతం పెంచి చూపించింది. బీఆర్ఎస్ పార్టీకి అయితే దాదాపు నాలుగు శాతం తగ్గించేశారు. బీజేపీకి కూడా ఇంకా ఒక శాతం తగ్గిపోయింది. ఈ ఇతరులకు అయితే ఒక రెండు శాతం ఫలితం ఉండే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.
పీపుల్స్ పల్స్ సర్వే
- కాంగ్రెస్ అభ్యర్థి: 48 శాతం
- బీఆర్ఎస్: 41 శాతం
- బీజేపీ: 06 శాతం
- ఇతరులు: 05 శాతం
పీపుల్స్ పల్స్ సర్వే దాదాపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థికి కూడా నలభై ఒక్క శాతం గెలుపు అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. బీజేపీ ఆ దరిదాపుల్లో ఎక్కడ కనిపించడం లేదన్నట్టుగా చెబుతోంది. ఇతరులు కూడా ఎక్కడో ఐదు శాతం దగ్గర ఉన్నారు.
చాణక్య స్ట్రాటజీస్ సర్వే
- కాంగ్రెస్ పార్టీకి: 46 శాతం
- బీఆర్ఎస్ పార్టీకి: 43 శాతం
- బీజేపీ పార్టీకి: 06 శాతం
- ఇతరులకు: 05 శాతం
చాణక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వే సంస్థ కూడా అన్ని సంస్థల సర్వే లాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎక్కువ విజయం వైపు అడుగులు ఉన్నట్టు వెల్లడించింది. అదే విధంగా ఇంకా కొన్ని సంస్థలు ఈ కింది విధంగా తమ సర్వేలను వెల్లడించాయి.
- పల్స్ టుడే: కాంగ్రెస్ 47 శాతం, బీఆర్ఎస్ 44 శాతం, బీజేపీ 07 శాతం
- పబ్లిక్ పల్స్: కాంగ్రెస్ 48.5 శాతం, బీఆర్ఎస్ 41.8 శాతం, బీజేపీ 6.5 శాతం
- హెచ్ఏంఆర్ సర్వే : కాంగ్రెస్ 48.31 శాతం, బీఆర్ఎస్ 43.18 శాతం, బీజేపీ 5.84 శాతం
ఎగ్జిట్ పోల్స్‌తో సంబంధం లేకుండా అన్నీ పార్టీల అభ్యర్థులు తమ గెలుపు గురించి వారి వారి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత.. ఒక్కసారి టీడీపీ గెలిచింది. వరుసగా గత రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు పట్టం కట్టారు. ఇలా మూడు సార్లు మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆయన భార్య మాగంటి సునీత మళ్లీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసింది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి, వీసీకె తెలంగాణ శ్యామ్ ఇంకా అనేకులు పోటీలో ఉన్నారు. మరి ఫలితాలు తెలిసేది ఎప్పుడు అంటే 14/11/2025 అని ఎలక్షన్ కమిషన్ ముందే నోటిఫికేషన్‌లో చెప్పిన విషయం అందరికి విదితమే.
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.