Kia Syros Launched in India: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘కియా మోటార్స్’ (Kia Motors) ఎట్టకేలకు ‘సైరోస్’ (Syros) కారు ధరలను అధికారికంగా వెల్లడించింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు గురించి మరిన్ని వివరాలు వివరంగా.. ఈ కథనంలో చూసేద్దాం.
వేరియంట్స్ & ధరలు
- హెచ్‌టీకే: రూ. 9 లక్షలు
- హెచ్‌టీఎక్స్ (ఓ): రూ. 10 లక్షలు
- హెచ్‌టీఎక్స్ ప్లస్: రూ. 11.50 లక్షలు
- హెచ్‌టీఎక్స్: రూ. 13.30 లక్షలు
డిజైన్
భారతదేశంలో లాంచ్ అయిన కొత్త కియా సైరోస్.. చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చూడటానికి ఈవీ9, ఈవీ5 మరియు ఈవీ3 వంటి మోడళ్లకు సమానంగా ఉంటుంది. ఈ కారు యొక్క ముందు భాగంలో.. నిలువుగా పేర్చబడిన హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. అంతే కాకుండా పెద్ద ఎయిర్ డ్యామ్.. మధ్యలో కొంత విభజించబడి ఉంటుంది. 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగిన.. సిరోస్ కారు ప్లాట్ రూఫ్‌లైన్, పొడవైన గ్లాస్‌హౌస్.. వీల్ ఆర్చ్ చుట్టూ క్లాడింగ్ వంటివి పొందుతుంది. వెనుకవైపు విండ్‌స్క్రీన్ అంచున టెయిల్ ల్యాంప్ ఉండటం చూడవచ్చు. బంపర్ క్లాడింగ్ మరియు ఫాక్స్ స్కిడ్ ప్లేట్ ఎలిమెంట్ కూడా పొందుతుంది. కాబట్టి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
కలర్ ఆప్షన్స్
కొత్త కియా సిరోస్ కారు ఎనిమిది రంగులలో అందుబాటులో ఉంటుంది. అవి అరోరా బ్లాక్ పెర్ల్, ఫ్రాస్ట్ బ్లూ, గ్లేసియర్ వైట్ పెర్ల్, గ్రావిటీ గ్రే, ఇంపీరియర్ బ్లూ, ఇంటెన్స్ రెడ్, ప్యూటర్ ఆలివ్ మరియు స్పార్క్లింగ్ సిల్వర్. ఇవన్నీ చూడటానికి చాలా అద్భుతంగా మరియు ఒక్క చూపుతోనే ఆకర్శించే విధంగా ఉంటాయి.
ఫీచర్స్
కియా సిరోస్ సెంటర్ కన్సోల్‌లో 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో క్లైమేట్ కంట్రోల్ కోసం 5 ఇంచెస్ స్క్రీన్ కూడా లభిస్తుంది. టూ స్పోక్ స్టీరింగ్ వీల్ బ్రాండ్ లోగో పొందుతుంది. ఏసీ వెంట్స్ డాష్‌బోర్డ్ పొడవునా విస్తరించి ఉన్నాయి.
నాలుగు సీట్లకు వెంటిలేషన్, యాంబియంట్ లైటింగ్, సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌తో కూడిన రిక్లైనింగ్.. రెండవ వరుసలో స్లైడింగ్ సీట్లు, 60:40 స్ప్లిట్ ఫోల్డింగ్ ఫంక్షన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ డ్రైవర్ సీటు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు 8 స్పీకర్ హర్మాన్ కార్డన్ సౌండ్ సిస్టం వంటి మరెన్నో ఫీచర్స్ కియా సిరోస్ కారులో ఉన్నాయి.
సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. కియా సిరోస్ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా మరియు లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.
పవర్‌ట్రెయిన్
కొత్త కియా సిరోస్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 1.0 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 120 హార్స్ పవర్ మరియు 172 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇక 1.5 లీటర్ ఫోర్ సిలినాద్ర డీజిల్ ఇంజిన్ 116 హార్స్ పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజిన్లు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతాయి. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తాయని సమాచారం.
బుకింగ్స్ & డెలివరీ
2024లో మార్కెట్లో అడుగుపెట్టిన కియా సిరోస్ కారు.. త్వరలోనే విక్రయానికి రానుంది. కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఆసక్తికలిగిన కస్టమర్లు రూ. 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ఈ నెలలో (ఫిబ్రవరి) ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.
Also Read: నెక్సాన్ సిఎన్‌జీ రెడ్ డార్క్ ఎడిషన్: ఫిదా చేస్తున్న డిజైన్ & ధర ఎంతంటే?
ప్రత్యర్థులు
మార్కెట్లో లాంచ్ అయిన కొత్త కియా సిరోస్ కారు.. ఇప్పటికే దేశీయ విఫణిలో విక్రయానికి ఉన్న టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, స్కోడా కైలాక్ మరియు హ్యుందాయ్ వెన్యూ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది మార్కెట్లో అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము.