సాయి తేజ, వేద జలంధర్ జంటగా నటించిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. ఈ చిత్రాన్ని కేఏ ప్రొడక్షన్స్ & సుమైరా స్టూడియోస్ సంయుక్తంగా హీరో కిరణ్ అబ్బవరం మరియు వేల్పు చర్ల తెజేశ్వర్ రెడ్డి నిర్మిస్తున్నారు. దీనికి వి.మునిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. వంశీకాంత్ రెహానా మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా నవంబర్ 29న చిత్రం బృందం సినిమాలోని మొదటి పాటను వీడియో రూపంలో విడుదల చేయడం జరిగింది.
కిరణ్ అబ్బవరం ప్రొడ్యూసర్‌గా..
రాజావారు రాణివారు సినిమాతో 2019లో వెండితెరకు నటుడిగా పరిచయమైన కిరణ్ అబ్బవరం.. తర్వాత తాను చేసిన ఎస్ఆర్ కల్యాణమండపం, సమ్మతమే లాంటి తదితర సినిమాలు మంచి పేరుని తెచ్చిపెట్టాయి. గత సంవత్సరంలో “క”, ఈ ఏడాది “కే-ర్యాంప్” అనే చిత్రాలతో విజయాల పరంపర కొనసాగిస్తున్నాడు. అయితే అనూహ్యంగా కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్ అని సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. కొత్త టాలెంట్ ప్రోత్సహించడంలో అబ్బవరం ఎప్పుడూ ముందుంటాడు. అదే వరుసలో ఈసారి తొలిసారిగా తన ప్రోడక్షన్లో అందరూ కొత్తవాళ్లతో “తిమ్మరాజుపల్లి టీవీ” అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దీంతో సినిమాకి మంచి ప్రచారం దొరుకుతోంది.
కథ మొత్తం అచ్చమైన పచ్చని పల్లెటూరు పంటపొలాలు, ఆ అందులో ఉండే మంచి అనుబంధాలు, సంస్కృతి, స్వచ్ఛమైన పల్లె ప్రేమలు, అలనాటి పల్లెటూరు యువత ఆడుకునే ఆటలు గురించి చెప్పే మంచి కథలాగా అనిపిస్తున్నది.
ఫస్ట్ సాంగ్..
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. ఆ పాట.. ఈ మధ్య కాలంలో ఎప్పుడు విననంత మెలోడీని అందించింది. వీడియోలో చూపించిన పంటలు, చేలు, పొలం గట్లు, పచ్చని చెట్లు, కొండలు, చెరువులు చాలా అందంగా ఆహ్లాదంగా అనిపిస్తోంది. చిన్నప్పుడు మనం ఆడి, మరిచిపోయిన అలచందరాళ్ల ఆట, బొంగరాల ఆట, బారాకట్టి లాంటి ఆటలతో పాటు భార్య తన భర్త చొక్కాని చేతితో సూది దారంతో కుట్టివ్వడం లాంటి చిన్న చిన్న అద్భుతమైన విషయాలను కూడా అందంగా తెరకేక్కించారు.
కొత్తవాళ్లే అయినా..
అందరూ కొత్తవాళ్లే అయినా.. ప్రతి పాత్ర కూడా జీవించేశారు అని చెప్పొచ్చు అంతబాగా నటించారు. సినిమా దర్శకుడు, హీరో, హీరోయిన్ కూడా చాలామంది మొదటిసారిగా పరచయమవుతున్నారు. డైరెక్టర్ వీ.మునిరాజు కిరణ్ అబ్బవరం సినిమాలకు కొన్ని విభాగాల్లో పనిచేశాడు.
పాట ఎన్నిసార్లు విన్నా కూడా ఇంకా వినాలని అనిపిస్తుంది. ఇప్పటికి దాదాపు పది లక్షలపైనే సాంగ్ విన్నారు. “చిన్ని చిన్ని గుండెలోన చానా ప్రేమే దాచిన, దబాయించి దొంగోడా దోచుకుపోలేవా, చిందే చిందే ఈడులోన ఏకాంతల యాతన, మీసాలున్న మొనగాడా జంటకు రాలేవా.” అంటూ సాగే ఈ సాహిత్యం సనారే రచించాడు. హరిణి ఇవటూరి, పవన్ కళ్యాణ్ కట్టిపడేసే విధంగా వినసొంపుగా పాడారు. వంశీకాంత్ రితమిక్ మ్యూజిక్ అందించాడు. పాట ప్రేక్షకులలో ఎక్కువ ఆదరణ పొందుతోంది. దీంతో చిత్రం బాగా ప్రచారం అవుతోంది. కొత్తవాళ్లు అందరూ కలిసి చేస్తున్న సినిమాకు, మొదటిసారి ప్రొడ్యూసర్‌గా మారిన కిరణ్ అబ్బవరంకి మంచి ఫలితాన్ని అందించే విధంగా ఉంది. అయితే సినిమా వచ్చే ఏడాది 2026లో విడుదల కానుంది.
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.