మహీంద్రా అండ్ మహీంద్రా.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మరో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ మూడు వరుసల కారు పేరు ఎక్స్ఈవీ 9ఎస్. ఇది కూడా ఐఎన్జీఎల్ఓ ప్లాట్‌ఫామ్‌పైనే నిర్మితమై ఉంటుంది. కాబట్టి దృఢమైన బాడీ, అత్యుత్తమ పనితీరును అందించేలా డిజైన్ చేయబడి ఉంటుంది.
బుకింగ్స్, డెలివరీ & ధర
మహీంద్రా లాంచ్ చేసిన ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 19.95 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు టెస్ట్ డ్రైవ్ యూనిట్లు డిసెంబర్ 5 నుంచి మహీంద్రా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటాయి. బుకింగ్స్ 2025 జనవరి 14న ప్రారంభమవుతాయి. డెలివెరీలు జనవరి 23న ప్రారంభమవుతాయి.
ఎక్స్ఈవీ 9ఎస్ డిజైన్ వివరాలు
మహీంద్రా కంపెనీకి చెందిన ఎక్స్ఈవీ 9ఎస్ ఎలక్ట్రిక్ కారు చాలావరకు ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎక్స్ఈవీ 9ఈ మాదిరిగా ఉంటుంది. కానీ 9ఎస్ ఈవీ ఉనికిని తెలియజేయడానికి కొన్ని ప్రత్యేకతలు స్పష్టంగా కనిపిస్తాయి. క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్, కనెక్టెడ్ డేటైమ్ రన్నింగ్ లాంప్స్, త్రిభుజాకారంలో ఉండే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, పొడవైన బానెట్ ఇందులో కనిపిస్తాయి.
చంకీ ఫ్రంట్ ప్రొఫైల్ చూడవచ్చు. 2762 మిమీ వీల్‌బేస్, ముందు భాగంలో 915 మిమీ, వెనుక భాగంలో 1099 మిమీ ఓవర్‌హాంగ్‌లు.. క్యాబిన్ & లగేజ్ స్పేస్ పెంచుకోవడానికి పనికొస్తాయి. వెనుక భాగం సింపుల్ డైజిన్ కలిగి స్మోక్డ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, రీడిజైన్ బంపర్ కనిపిస్తాయి. మొత్తం మీద పరిమాణం ఎక్స్ఈవీ 9ఎస్ పరంగా ఎక్స్ఈవీ 9ఈ కంటే కొంత పెద్దదిగా ఉంటుంది. కొత్త కారు కూడా మహీంద్రా కొత్త లోగో పొందుతుంది.
ఎక్స్ఈవీ 9ఎస్ ఇంటీరియర్ & ఫీచర్స్
పనోరమిక్ సన్‌రూఫ్, హర్మాన్ కార్టాన్ సౌండ్ సిస్టం, ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్.. కొత్త ఎక్స్ఈవీ 9ఎస్ కారులో ఉన్నాయి. రెండవ వరుస ప్రయాణికుల కోసం స్క్రీన్‌లు ఉన్నాయి. టాప్ వేరియంట్స్ హెడ్ అప్ డిస్ప్లే పొందుతుంది. కానీ అన్ని వేరియంట్లు స్లైడింగ్ అండ్ రిక్లైనింగ్ రెండవ వరుస సీట్లను కలిగి ఉంటాయి.
ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ ఎలక్ట్రిక్ కారు ఏడీఏఎస్ సూట్, ఆటో పార్కింగ్ కెపాసిటీ, మల్టి కలర్ యాంబియంట్ లైటింగ్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, లెథరెట్ సీట్ అపోల్స్ట్రే వంటివాటిని పొందుతుంది. కాగా టాప్ వేరియంట్స్ డ్రైబిలిటీ డిటెక్టర్ పొందుతాయి.
బ్యాటరీ కెపాసిటీ & రేంజ్, ఛార్జింగ్ వివరాలు
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ ఎలక్ట్రిక్ కారు 59 కిలోవాట్ (521 కిమీ), 70 కిలోవాట్ (600 కిమీ), 79 కిలోవాట్ (679 కిమీ) బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. ఈ అన్ని బ్యాటరీలు 140 కేడబ్ల్యు – 180 కేడబ్ల్యు డీసీ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. పనితీరై పరంగా ఉత్తమంగా ఉంటాయని సమాచారం. అన్ని వేరియంట్లు 7 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతాయి. టాప్ స్పీడ్ 202 కిమీ/గం.
ఎక్స్ఈవీ 9ఎస్ ప్రత్యర్థులు
మహీంద్రా కొత్త ఎక్స్ఈవీ 9ఎస్ ఎలక్ట్రిక్ కారు.. మార్కెట్లో ప్రధానంగా కియా క్లావిస్ ఈవీ, బీవైడీ ఈమ్యాక్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఎక్స్ఈవీ 9ఎస్ అనే మూడు వరుసల కారు. అయినప్పటికీ ఇందులో అత్యుత్తమ భద్రతా ఫీచర్స్ ఉంటాయి. కాబట్టి ఇది దేశీయ విఫణిలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నాము. ఇది ఎలాంటి అమ్మకాలు పొందుతుందో తెలుసుకోవడానికి ఇంకొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.