Mamta Mohandas Buys New BMW Z4 M40i: మమతా మోహన్‌దాస్ (Mamta Mohandas) గురించి మలయాళీ ప్రేక్షలుకు మాత్రమే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచయమే. యమదొంగ, చింతకాయల రవి, కృష్ణార్జున, కేడీ వంటి సినిమాల్లో నటించి బాగా పాపులర్ అయిన ‘మమతా మోహన్‌దాస్’కు బైకులు మరియు కార్లు అంటే కూడా చాలా ఇష్టం. ఈ కారణంగానే ఎప్పటికప్పుడు ఈమె ఖరీదైన బైకులు మరియు కార్లు కొనుగోలు చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఇటీవల ఓ ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుకి కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
2021లో పోర్స్చే కారును కొనుగోలు చేసిన మమతా మోహన్‌దాస్ ఇప్పుడు సుమారు రూ. కోటి విలువైన ‘బీఎండబ్ల్యూ’ (BMW) కారును కొనుగోలు చేసింది. మమతా మోహన్‌దాస్ కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ కారు ‘జెడ్4’ స్పోర్ట్స్ కారు. స్పోర్ట్స్ కారు డెలివరీకి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.
కేరళలోని బీఎండబ్ల్యూ కంపెనీ అధీకృత డీలర్ అయిన బీఎండబ్ల్యూ ఈవీఎమ్ ఆటోక్రాఫ్ట్ ఈ వీడియోను తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. నటి కొన్ని వారాల క్రితం ఈ కారును కొనుగోలు చేసింది. వీడియో మాత్రం ఇప్పుడు తెరమీదకు వచ్చింది.
వీడియోలో గమనించినట్లయితే మమతా మోహన్‌దాస్ టాటా హెక్సా కారులో బిఎమ్‌డబ్ల్యూ డీలర్‌షిప్ వద్దకు రావడం మనం చూడవచ్చు. హెక్సా కారులో వచ్చిన నటి డీలర్‌షిప్‌లోకి వెళ్లి ఆమె తల్లితో కలిసి సిబ్బందిని కలుస్తుంది. ఆమె సేల్స్ రిప్రజెంటేటివ్‌ని కలిసి అన్ని డాక్యుమెంటేషన్ ప్రక్రియలను పూర్తి చేస్తుంది.
కారు డెలివరీలో భాగంగానే ఆమె కేక్ కట్ చేసి.. కారు మీద ఉన్న క్లాత్ తీసేస్తారు. ఆ తరువాత ఆమె కారులో కూర్చుని.. రూఫ్ (ఓపెన్ టాప్) ఓపెన్ చేస్తుంది. థండర్‌నైట్ మెటాలిక్ షేడ్‌లో కలిపించే ఈ కారు చూపరులను ఒక్క చూపుతోనే ఆకట్టుకుంటోంది.
బీఎండబ్ల్యూ జెడ్4 ఎమ్40ఐ (BMW Z4 M40i)
మమతా మోహన్‌దాస్ కొనుగోలు చేసిన కారు బీఎండబ్ల్యూ జెడ్4 ఎమ్40ఐ (BMW Z4 M40i). నిజానికి ఈ కారుని కంపెనీ 2023లోనే దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు సెరియం గ్రే పెయింటెడ్ గ్రిల్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది మిర్రర్ క్యాప్స్‌తో పాటు ట్రాపెజోయిడల్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌తో వస్తుంది. బోనెట్, హెక్సాగోనల్ ఇన్నర్ స్ట్రక్చర్ కలిగిన కిడ్నీ గ్రిల్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌లు, స్లీకర్-లుకింగ్ హెడ్‌ల్యాంప్‌లు ఇందులో చూడవచ్చు.
బీఎండబ్ల్యూ జెడ్4 అనేది ఫాబ్రిక్ సాఫ్ట్ టాప్‌తో వస్తుంది. ఇది కేవలం 10 సెకన్లలో ఎలక్ట్రానిక్‌గా ఓపెన్ అవుతుంది లేదా క్లోజ్ అవుతుంది. ఇది 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ పొందుతుంది. లోపల బ్లాక్, మాగ్మా రెడ్, కాగ్నాక్ అనే మూడు అపోల్స్ట్రే ఎంపికలను పొందుతుంది.
బీఎండబ్ల్యూ జెడ్4 ఎమ్40ఐ ఫీచర్స్ (BMW Z4 M40i Features)
ఈ కారులో డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, మెమరీ ఫంక్షన్ డ్రైవర్ సీట్, ముందు ప్రయాణీకుల కోసం పవర్డ్ ఫ్రంట్ సీట్లు వంటి మరెన్నో ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. ఇందులోని ఫీచర్స్ అన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.
Don’t Miss: Skoda Slavia కొత్త ఎడిషన్ – కేవలం 500 మందికి మాత్రమే..
కొత్త బీఎండబ్ల్యూ జెడ్ ఎమ్40ఐ స్పోర్ట్స్ కారు 3.0 లీటర్ ఇన్ లైన్ సిక్స్ సిలిండర్ ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 335 Bhp పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడిన ఈ కారు కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ కావడం గమనార్హం.