Mercedes AMG G 63 facelift launched in India: భారతీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ కార్లకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అనేక కార్లను దేశీయ విఫణిలో లాంచ్ చేసిన బెంజ్ ఇప్పుడు మరో ఖరీదైన కారును అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కారు ధర అక్షరాలా రూ. 3.60 కోట్లు (ఎక్స్ షోరూమ్)
2024 మార్చిలో గ్లోబల్ మార్కెట్లో అడుగుపెట్టయిన జీ-క్లాస్ లాంచ్ తరువాత, మెర్సిడెస్ బెంజ్ ‘ఫేస్‌లిఫ్టెడ్ ఏఎంజీ జీ 63’ లాంచ్ చేసింది. కంపెనీ ఇండియన్ మార్కెట్లో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించడంలో భాగంగానే ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూనే ఉంది. ఇప్పుడు బెంజ్ కంపెనీ లాంచ్ చేసిన అప్డేటెడ్ జీ-క్లాస్ చాలా వరకు కాస్మొటిక్ అప్డేట్స్ పొందింది.
బుకింగ్స్
కంపెనీ ఇప్పటికే మొదటి బ్యాచ్ కార్లను విక్రయించేసింది. అయితే రెండో బ్యాచ్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కాబట్టి ఆసక్తికలిగిన కస్టమర్లు బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2025 మొదటి త్రైమాసికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీ63 ఫేస్‌లిఫ్ట్ నిటారుగా ఉన్న ఫ్రంట్ గ్రిల్, వర్టికల్ స్లాట్స్, రేడియేటర్ గ్రిల్ మీద డార్క్ క్రోమ్ ఫినిషింగ్, ఏ చిన్నగా.. గుండ్రంగా ఉన్నాయి. విండ్‌స్క్రీన్ కూడా కొత్తదిగా ఉండటం చూడవచ్చు. వెనుకవైపు ఆప్షనల్ కార్బన్ ఫినిష్డ్ స్పేర్ వీల్ కవర్ ఉంది. కొత్త ఏఎంజీ జీ63 ఇప్పుడు కీ-లెస్ ఎంట్రీ కూడా పొందుతుంది.
ఏఎంజీ జీ63 లోపలి భాగంలో గమనించదగ్గ పెద్ద అప్‌గ్రేడ్ ఏబీయూఎక్స్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం. ఇది 12.3 ఇంచెస్ స్క్రీన్స్ పొందుతుంది. ఇందులో డ్రైవర్ డిస్‌ప్లే మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ రెండూ ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం ఇప్పుడు టచ్‌స్క్రీన్. ఇది వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటివి పొందుతుంది. అంతే కాకుండా.. 18 స్పీకర్, 760 వాట్ బర్మెస్టర్ సౌండ్ సిస్టం.. కొత్త త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ కూడా ఇందులో ఉన్నాయి.
ఇంజిన్ వివరాలు
కొత్త మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీ 63 ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు మైల్డ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ పొందుతుంది. ఇందులోని 3982 సీసీ వీ8 ఇంజిన్ 585 హార్స్ పవర్, 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 48 వోల్ట్స్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ ద్వారా 22 హార్స్ పవర్ విడుదలవుతుంది. ఇది పాడిల్ షిఫ్టర్‌లతో 9 స్పీడ్ డీసీటీ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ కారు టాప్ స్పీడ్ 240 కిమీ కాగా.. 4.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.
డైమెన్షన్స్ (కొలతలు)
కొత్త మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీ 63 ఫేస్‌లిఫ్ట్ ఆఫ్-రోడింగ్ కెపాసిటీ ఏ మాత్రం మారలేదు. కాబట్టి ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ 229 మీమీ వరకు ఉంది. వాటర్ వాడింగ్ కెపాసిటీ 700 మిమీ. ఆప్షనల్ 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ కారు సెంటర్ లాకింగ్ మెకానిజం కూడా పొందుతుంది. కాబట్టి ఇది అన్ని విధాలా మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
Don’t Miss: రూ. 94707లకే Bajaj Pulsar N125: కొత్త డిజైన్ & బోలెడన్ని కలర్ ఆప్షన్స్
భారతదేశంలో మెర్సిడెస్ బెంజ్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. చాలా మంది సెలబ్రిటీల మొదటి ఎంపిక మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ కావడం గమనార్హం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అంబానీ దగ్గర వరకు చాలామంది గ్యారేజిలో ఈ బెంజ్ కార్లు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే.. మార్కెట్లో ఈ కార్లకు ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కంపెనీ ఆధునిక హంగులతో.. చూడగానే ఆకట్టుకునే మరో బెంజ్ కారును లాంచ్ చేసింది. ఇప్పటికే మొదటి బ్యాచ్ పూర్తిగా అమ్ముడైపోయింది. రెండవ బ్యాచ్ కోసం బుకింగ్స్ కూడా స్వీకరించబడుతున్నాయి. డెలివరీలు మాత్రం వచ్చే ఏడాదిలోనే జారుతాయి.