ఇప్పుడు టాలీవుడ్ సినిమా ప్రపంచంలోనే ‘మిరాయ్‘ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. సెప్టెంబర్ 12 రిలీజ్ కానున్న ఈ సినిమాను ప్రమోట్ చేయడంలో హీరో ‘తేజ సజ్జ‘ బిజీ అయిపోయారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలలో పాల్గొంటూ.. సినిమా గురించి, తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘనటనల గురించి చెబుతున్నాడు. ఇందులో భాగంగానే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంత గురించి మాట్లాడారు.
హనుమాన్ సినిమాతో స్టార్‌డమ్
ఎన్నో సినిమాల్లో బాల నటుడిగా కనిపించి.. ప్రేక్షకులను మెప్పించినప్పటికీ, గత ఏడాది తెరమీదకు వచ్చిన హనుమాన్ సినిమా తేజ సజ్జకు గొప్ప సక్సెస్ ఇచ్చింది. ఈ సినిమా తరువాత బాగా ఫేమస్ అయిన తేజ ఇప్పుడు మిరాయ్ సినిమాలో కనిపిస్తున్నారు. నిజానికి హనుమాన్ సినిమాకంటే ముందు.. ఓ బేబీ, జాంబీ రెడ్డి, ఇష్క్ – నాట్ ఏ లవ్ స్టోరీ, అద్భుతం సినిమాల్లో కనిపించినప్పటికీ.. చెప్పుకోదగ్గ ఫేమ్ దక్కలేదు. హనుమాన్ సినిమాతో ఇతని స్టార్‌డమ్ మారిపోయింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నటి సమంత గురించి మాట్లాడుతూ.. ఆమెను ప్రశంసించారు. కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చాలా సినిమాలు చెబుతారు, కానీ బడ్జెట్ సమస్యల వల్ల.. లేదా ఇతర కారణాల వల్ల చివరి నిమిషాల్లో క్యాన్సిల్ అవుతాయి. కొన్ని సినిమాలలో నన్ను ఫైనల్ చేసినప్పటికీ.. వేరేవాళ్లను తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. నన్ను సినిమాలకు ఫైనల్ చేసినప్పుడు.. సినిమా రిలీజ్, వీధుల్లో పోస్టర్లు, నా యాక్టింగ్ అన్నీ ఊహించుకుంటాను. కానీ చివరికి.. సినిమాకు వేరేవాళ్లను ఎంపిక చేసుకున్నాం అని నాకు కాల్ వస్తుంది. అప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను. ఇలా చాలా సార్లు జరిగింది.
చాలా నిరాశకు గురయ్యాను
సుమారు ఏడు లేదా ఎనిమిది సార్లు ఇలాగే జరిగింది. చాలా నిరాశకు గురయ్యాను. ”ఎలా జరగాలని ఉంటే.. ఆలా జరగని” అని గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఒక అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు ఓ బేబీ అనే కొరియన్ రీమేక్ కోసం నాకు కాల్ వచ్చింది. అందులో క్యారెక్టర్ రోల్ ఒప్పుకున్నాను.
ఓ బేబీ సినిమాలో క్యారెక్టర్ రోల్ ఒప్పుకున్నాను. ఆ సినిమాలో సమంత ఉన్నారని నాకు తెలియదు. నిజంగా సమంత చాలా దయగల వ్యక్తి. దాదాపు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో.. నన్ను ముందుకు నెట్టారు. నేను అందరి దృష్టిని ఆకట్టుకునేలా చేశారు. ఆమె సినిమా అయినప్పటికీ.. నాకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేశారు. అందుకే ఆమె అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం.. అంతే కాకుండా సమంత నాకు మంచి ఫ్రెండ్ కూడా అని తేజ సజ్జ పేర్కొన్నారు.
మిరాయ్ గురించి..
ఇక మిరాయ్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో రితికా నాయక్, శ్రియ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను భారీగా పెంచేసింది. మంచు మనోజ్ ప్రతి నాయకుడుగా కొత్తగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రావడానికి సిద్ధమైపోయింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా.. చాలామందిని ఆకట్టుకుంటుందని, తేజ సజ్జ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ యాడ్ అవుతుందని భావిస్తున్నాము.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.