అక్కినేని నాగార్జున కుమారుడు.. నాగ చైతన్య గురించి దాదాపు అందరికీ తెలిసిందే. సినిమాల్లో నటిస్తూ.. తనదైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన ఇప్పుడు మరో సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా పేరు వృషకర్మ అని, ఈ విషయాన్ని నాగచైతన్య ట్వీట్ చేశారు.
మైథలాజికల్ మూవీ!
రాబోయే కొత్త సినిమా పేరును అక్కినేని నాగ చైతన్య తన పుట్టినరోజు (నవంబర్ 23) నాడు అధికారికంగా వెల్లడించారు. అభిమానులు కూడా తనకు పెద్దఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా ఇది నాగ చైతన్య మైథలాజికల్ మూవీ అని తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీనిపై మహేష్ బాబు కామెంట్ చేస్తూ.. లుక్ బాగుందని, పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు.
మొదటిసారి ఇలాంటి సినిమా!
ఇప్పటివరకు లవ్, యాక్షన్ సినిమాల్లో తనను తాను నిరూపించుకున్న నాగ చైతన్య.. మొదటిసారి మైథలాజికల్ మూవీలో కనిపించనున్నారు. కార్తిక్ దండు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ సినిమాలో ఇంకా ఎవరెవరు నటించనున్నారు అనే విషయం అధికారికంగా తెలియాల్సి ఉంది. బహుశా ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
షూటింగ్ షురూ!
నాగచైతన్య 24వ సినిమా అయిన వృషకర్మ.. సినిమా షూటింగ్ ఇప్పటికే జరుగుతున్నట్లు సమాచారం. దీనికోసం అన్నపూర్ణ స్టూడియోలు ప్రత్యేకంగా సెట్ వేసినట్లు చెబుతున్నారు. కొండలు, కోనలు, అడవులు అన్నీ కూడా ఈ సెట్లో ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద ఈ సినిమా నాగ చైతన్యకు విజయం చేకూరుస్తుందా?, లేదా? అనేది తెలియాల్సి ఉంది.
అక్కినేని నాగ చైతన్య గురించి
నాగార్జున కుమారుడిగానే సినిమాల్లోకి (జోష్) అడుగుపెట్టినప్పటికీ.. ఆ తరువాత తనను తాను నిరూపించుకున్నారు. 100% లవ్, రారండోయ్ వెదుకు చూద్దాం, శైలజ రెడ్డి అల్లుడు, మజిలీ, లైలా మొదలైన సినిమాల్లో నటించి నాగ చైతన్య.. సాయిపల్లవితో నటించిన తండేల్ సినిమాతో భారీ విజయం సాధించారు. ఇప్పుడు వృషకర్మ సినిమాతో తెరమీద కనిపించనున్నారు.
కెరియర్ విషయానికి వస్తే.. 2017లో సమంతను పెళ్లి చేసుకున్న నాగ చైతన్య 2021లో కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోయారు. ఆ తరువాత మూడేళ్లకు 2024లో శోభితా దూళిపాలను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం శోభితతో వైవాహిక జీవితం గడుపుతూనే.. సినిమాల్లో కూడా నటిస్తున్నారు. శోభిత కూడా సినిమాల్లో నటిస్తోంది.
కార్లంటే ఇష్టం!
నటుడు నాగ చైతన్యకు స్పోర్ట్స్ కార్లు, బైకులు అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఆయన తరచూ ఖరీదైన వాహనాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈయన దగ్గర పోర్స్చే 911 జీటీ3 ఆర్ఎస్, ఫెరారీ 488 జీటీబీ, మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ, రేంజ్ రోవర్ వోగ్ వంటి వాటితో పాటు.. బీఎండబ్ల్యూ ఎం2 కూపే, బీఎండబ్ల్యూ 740 ఎల్ఐ, నిస్సాన్ జీటీ-ఆర్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 మొదలైన కార్లు ఉన్నాయి. ఎంవీ అగస్టా ఎఫ్4, బీఎండబ్ల్యూ ఆర్ నైన్టీ వంటి ఖరీదైన బైకులు ఉన్నాయి.
శౌర్య వర్ధన్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సినిమా, రాజకీయం వంటి విభిన్న అంశాలపై సమగ్రమైన ఆర్టికల్స్ అందిస్తూ వస్తున్నాను. ఈ రంగంలో నాకు నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది. రాయడంలో నైపుణ్యంతో, చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.