Nagarjuna Akkineni Expensive Car Collection: తెలుగు సినీ పరిశ్రమలోని అగ్రగణ్యులు జాబితాలో ఒకరైన ‘అక్కినేని నాగార్జున’ (Akkineni Nagarjuna) గురించి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా అందరికి తెలుసు. అటు రొమాంటిక్ చిత్రాల్లో, యాక్షన్ చిత్రాల్లో ఎంతోమంది యువకుల మనసుదోచిన టాలీవుడ్ మన్మధుడు అన్నమయ్య, శ్రీరామదాసు, ఓం నమోవెంకటేశాయ వంటి భక్తి చిత్రాల్లో నటించి పెద్దవారు, ముసలివాళ్ల మనసును కూడా దోచేశాడు. టాలీవుడ్ కింగ్ అని పిలువబడే మన సోగ్గాడు ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఈ రోజు అక్కినేని నాగార్జున పుట్టిన రోజు. ఈ సందర్భంగా నాగ్ ఉపయోగించే కార్లు ఏవి? వాటి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడా తెలుసుకుందాం..
చాలామంది సెలబిట్రీల మాదిరిగానే అక్కినేని నాగార్జునకు ఖరీదైన కార్లను ఉపయోగించడం అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఈయన గ్యారేజిలో బీఎండబ్ల్యూ, ఆడి, టయోటా, నిస్సాన్, రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ వంటి బ్రాండ్ కార్లను కలిగి ఉన్నారు.
బీఎండబ్ల్యూ 7 సిరీస్ (BMW 7 Series)
కింగ్ నాగార్జున ఉపయోగించే కార్లలో బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 7 సిరీస్ (750Li xDrive M Sport) కూడా ఒకటి. దీని ధర రూ. 1.82 కోట్ల నుంచి రూ. 1.85 కోట్ల (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉంటుంది. ఈ కారును నాగ్ తన 57వ పుట్టిన రోజు సందర్భంగా కొనుగోలు చేశారు. ఇది బ్లూ కలర్ ఆప్షన్లో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.
బీఎండబ్ల్యూ 7 సిరీస్ 4.4 లీటర్ టర్బో ఛార్జ్డ్ వీ8 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. రియర్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు మంచి డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ కారులో ఏసీ వెంట్స్, సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైనవి ఉన్నాయి.
ఆడి ఏ7 (Audi A7)
నాగార్జున బీఎండబ్ల్యూ కారు కొనడానికి ముందే ఆడి ఏ7 కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కారు ప్రారంభ ధర రూ. 90.50 లక్షలు. ఇది 2967 సీసీ ఇంజిన్ కలిగి 241.4 బ్రేక్ హార్స్ పవర్ (BHP) మరియు 500 న్యూటన్ మీటర్ (NM) టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ ఎస్ ట్రానిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. కాబట్టి ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.
బీఎండబ్ల్యూ ఎం6 (BMW M6)
అక్కినేని నాగార్జున గ్యారేజిలోని మరో బీఎండబ్ల్యూ కారు ఎం6. ఈ కారు ప్రారంభ ధర దేశీయ విఫణిలో రూ. 1.76 కోట్ల నుంచి రూ. 1.85 కోట్ల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. కానీ నాగరాజును కారు ఏ ఇంజిన్ కలిగి ఉందనేది తెలియడం లేదు. అయితే ఇందులోని 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 258 పీఎస్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.
డీజిల్ ఇంజిన్ (2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్) 190 పీఎస్ పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇక డిజైన్ మరియు ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పనితీరు కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది.
టయోటా వెల్‌ఫైర్ (Toyota Vellfire)
చాలామంది రాజకీయ నాయకులకు, పారిశ్రామిక వేత్తలకు ఇష్టమైన కార్లలో టయోటా యొక్క వెల్‌ఫైర్ కూడా ఒకటి. ఈ కారు కూడా నాగార్జున గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 1.22 కోట్ల నుంచి రూ. 1.32 కోట్ల (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉంది. ఈ కారు విశాలమైన క్యాబిన్ కలిగి ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది ఈ కారును కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.
టయోటా వెల్‌ఫైర్ కారు 2.5 లీటర్ పెట్రోల్ – హైబ్రిడ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 180 పీఎస్ పవర్, 235 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ సీవీటీ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ పొందుతుంది. మొత్తం మీద ఇది వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
నిస్సాన్ జీటీ-ఆర్ (Nissan GT-R)
అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటిగా చెప్పబడే నిస్సాన్ కంపెనీకి చెందిన జీటీ-ఆర్ కూడా నాగార్జున ఉపయోగించే కార్లలో ఒకటి. ఈ కారు కొనుగోలు చేయడానికి నాగ్ సుమారు రూ. 2 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. నిస్సాన్ జీటీ-ఆర్ 3798 సీసీ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కలిగిన ఈ కారు 4 సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంది. కాబట్టి ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు.
రేంజ్ రోవర్ వోగ్ (Range Rover Vogue)
చాలామంది గ్యారేజిలో కనిపించే కార్ బ్రాండ్ రేంజ్ రోవర్. ఈ కంపెనీకి చెందిన కార్ల ధరలు ఎక్కువైనా సెలబ్రిటీలు మాత్రం ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. నాగార్జున దాదాపు రూ. 2 కోట్ల ఖరీదైన రేంజ్ రోవర్ వోగ్ కలిగి ఉన్నారు. విలాసవంతమైన ఈ లగ్జరీ కారు 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 4000 rpm వద్ద 296 Bhp పవర్ ,మరియు 1500 rpm వద్ద 650 Nm టార్క్ అందిస్తుంది.
మెర్సిడెస్ బెంజ్ ఎస్450 (Mercedes Benz S450)
బెంజ్ కంపెనీకి చెందిన ఎస్450 మోడల్ అక్కినేని నాగార్జున గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 2.2 కోట్లు వరకు ఉంటుంది. చూడగానే ఆకర్షించబడే డిజైన్, వాహన వినియోగదారులకు అవసరమైన లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు 2999 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 5500 నుంచి 6100 rpm వద్ద 362.07 Bhp పవర్ మరియు 1600 నుంచి 4500 rpm వద్ద 500 Nm టార్క్ విడుదల చేస్తుంది. ఇంజిన్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది.
Don’t Miss: సమంత ఎలాంటి కార్లు ఉపయోగిస్తుందో తెలుసా?.. ఒక్కక్కటి ఇంత రేటా..
పైన చెప్పిన కార్లు మాత్రమే కాకుండా.. నాగార్జున గత కొన్ని రోజులకు ముందు సౌత్ కొరియా బ్రాండ్ అయిన కియా మోటార్స్ (Kia Motors) యొక్క ఎలక్ట్రిక్ కారు ఈవీ6 కూడా కొనుగోలు చేశారు. ఈ కారు ప్రారంభ ధర రూ. 60.95 లక్షలు. ఆధునిక డిజైన్ కలిగిన ఈ కారు, భారతదేశంలో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్ల జాబిట్లో ఒకటిగా ఉంది. ఇందులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి.