Narendra Modi: మోదీకి నెంబర్ 1 గ్లోబల్ ర్యాంక్.. వెనుకబడ్డ ట్రంప్!

Narendra Modi: భారత ప్రధానమంత్రి Narendra Modi ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రజాస్వామ్య నాయకుడిగా మరోసారి నిలిచారు. అమెరికా ఆధారిత సంస్థ Morning Consult నిర్వహించిన తాజా సర్వేలో ఆయనకు 68% అప్రూవల్ రేటింగ్ లభించింది. మార్చి 2 నుంచి 8, 2026 మధ్య సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదిక విడుదలైంది.

ఏడురోజుల సర్వే

“గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్” పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనం ప్రపంచ దేశాల నాయకులపై ప్రజల అభిప్రాయాలను విశ్లేషిస్తుంది. ప్రతి దేశంలో పెద్దల అభిప్రాయాలపై ఏడు రోజుల సగటు (7-day moving average) ఆధారంగా ఈ రేటింగ్‌లు నిర్ణయించబడ్డాయి. ఈ సర్వేలో మోదీకి లభించిన 68% అప్రూవల్ రేటింగ్ ఆయన దేశీయ ప్రజాదరణతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న గుర్తింపును కూడా ప్రతిబింబిస్తోంది.

ఇతర నాయకుల స్థానం

ఈ జాబితాలో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు Guy Parmelin, దక్షిణ కొరియా అధ్యక్షుడు Lee Jae-myung ఇద్దరూ 62% అప్రూవల్ రేటింగ్‌తో రెండో స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు Donald Trump 39% రేటింగ్‌తో వెనుకబడ్డారు. యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి Keir Starmer కు కేవలం 24% మాత్రమే లభించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు Emmanuel Macron ఈ జాబితాలో అత్యల్ప రేటింగ్‌లలో ఒకటిగా నిలిచారు. ఆయనకు 17% అప్రూవల్ మాత్రమే ఉండగా, 75% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎందుకింత రేటింగ్!

ప్రధాని మోదీకి ఉన్న 68% అప్రూవల్ రేటింగ్ ఇతర దేశాల నాయకులతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేసినవారు కేవలం 26% మాత్రమే ఉండటం గమనార్హం. ఇది ఆయన పాలనపై దేశీయ స్థాయిలో ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. అంతేకాకుండా, గ్లోబల్ స్థాయిలో కూడా ఆయన ప్రభావం పెరుగుతోందని ఈ సర్వే సూచిస్తోంది.

గత సర్వేతో పోలిస్తే..

2025 జూలైలో విడుదలైన ఇదే సంస్థ నివేదికలో కూడా మోదీ 75% అప్రూవల్ రేటింగ్‌తో టాప్‌లో నిలిచారు. ఆ సమయంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ 59%తో రెండో స్థానంలో ఉండగా, అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలే 57%తో మూడో స్థానంలో నిలిచారు. ఆ సర్వేలో డోనాల్డ్ ట్రంప్ 44% రేటింగ్‌తో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. తాజా సర్వేలో ఆయన రేటింగ్ మరింత తగ్గడం గమనించదగ్గ విషయం.

చరిత్రాత్మక మైలురాయి..

Narendra Modi మే 2024లో తన మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన నిరవధికంగా 4,079 రోజులు పదవిలో కొనసాగుతూ చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో ఆయన మాజీ ప్రధాని Indira Gandhi రికార్డును అధిగమించి, నిరవధికంగా ఎక్కువకాలం పనిచేసిన రెండో ప్రధానిగా నిలిచారు. ఈ జాబితాలో మొదటి స్థానంలో మాత్రం దేశ తొలి ప్రధాని Jawaharlal Nehru ఉన్నారు.

ప్రపంచ స్థాయిలో నాయకుల మధ్య పెరుగుతున్న పోటీలో కూడా మోదీ తన స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం. దేశీయంగా ప్రజల మద్దతు, అంతర్జాతీయంగా పెరుగుతున్న గుర్తింపు ఆయనను ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రజాస్వామ్య నాయకుడిగా నిలబెట్టాయి.

Also Read: US Iran war:ఇరాన్ సంచనల ప్రకటన!.. యుద్ధం ఆపాలంటే?