Nayanthara Buys New House in Chennai: లేడీ సూపర్ స్టార్ ‘నయనతార’ గురించి అటు తెలుగు, ఇటు తమిళంలో అందరికీ తెలుసు. సినీ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ట్రెండ్ సెట్ చేసుకున్న ఈమె ‘లక్ష్మి’ సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టింది. అలా.. అలా తన నటనతో, అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అమ్మడు 2022లో ‘విఘ్నేష్ శివన్’ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈమె సినిమాల్లో నటించడం దాదాపు తగ్గించేసింది. అయితే.. తాజాగా ఓ ఖరీదైన ఇల్లును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తరచూ ఏదో ఒకవిధంగా వార్తల్లో నిలుస్తున్న నయనతార సుమారు 15 ఏళ్లకంటే ఎక్కువ కాలం సినీ రంగంలో తనను తాను నిరూపించుకుంది. సినిమాల్లో నటిస్తూ బాగా సంపాదించిన ఈమె.. గత ఏడాది రూ. 50 కోట్లు పెట్టి ఓ ఫ్లైట్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ఇప్పుడు రూ. 100 కోట్లు ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసినట్లు కొన్ని వార్తలు సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
రూ.100 కోట్లు?
నయనతార ఇల్లు కొన్నమాట వాస్తవమే.. కానీ దాని ధర ఎంత అనేది ఖచ్చితంగా తెలియడం లేదు. ఈ ఇల్లు చైన్నెలోని సూపర్ స్టార్ రజిని కాంత్ మరియు ధనుష్ వంటి హీరోలు ఉంటున్న ప్రాంతంలోనే (పోయెస్ గార్డెన్ ఏరియా) ఉన్నట్లు తెలుస్తోంది. తన భర్తతో కలిసి కొనుగోలు చేసిన ఇంటికి సంబందించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
నటి నయనతార కొనుగోలు చేసిన ఇల్లు మొత్తం మూడు అంతస్తులలో ఉంది. ఇందులో ఒకదాన్ని స్టూడియో కోసం వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఇంటిలోపల మొత్తం ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా.. నయనతార అనుభూతికి తగిన విధంగా డిజైన్ చేసుకుంది. ఈ ఇల్లు సుమారు 7000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు సమాచారం. అయితే దీని విలువ రూ. 100 కోట్లా తనకంటే తక్కువా?.. లేదా ఎక్కువా? అనే విషయాలు అధికారికంగా వెల్లడి కాలేదు. ఇల్లు డిజైన్ చూస్తే మాత్రం దీని ఖరీదైన వంద కోట్లు ఉంటుందని భావిస్తున్నారు.
నయనతార గురించి
సౌత్ ఇండియా అగ్ర హీరోయిన్లల జాబితాలో ఒక్కరుగా చెప్పుకోదగ్గ నయనతార 1984 నవంబర్ 18న జన్మించింది. మలయాళీ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన ఈమె విద్యాభ్యాసం వివిధ రాష్ట్రాలలో జరిగింది. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ చేస్తున్న ఈమెకు మలయాళీ డైరెక్టర్ ‘సత్యం అంతిక్కాడ్’ మనస్సినక్కరే అనే సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చారు.
Also Read: అమలా పాల్‌కు ఖరీదైన కారు గిఫ్ట్!.. ఆనందంలో మునిగిపోయిన నటి (వీడియో)
మొదట్లో సినిమాల్లో నటించడం ఇష్టం లేకపోయినా.. ఒక్క సినిమా చేసి ఊరుకుందామని ఆ సినిమాలో నటించింది. ఆ తరువాత విస్మయతుంబట్టు, తస్కర వీరం, రాప్పకల్ వంటి సినిమాల్లో.. మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి పెద్ద హీరోలతో కూడా నటించింది. ఆ తరువాత టాలీవుడ్ చిత్ర సీమలో కూడా అడుగుపెట్టింది.
సినిమా ప్రపంచంలో తిరుగులేని నటిగా గుర్తింపు తెచ్చుకున్న నయనతార 2022లో ‘విగ్నేష్ శివన్’ను పెళ్లి చేసుకుంది. వీరి పెళ్ళికి రజనీకాంత్, అజిత్, షారుఖ్ ఖాన్, బోణీ కపూర్, డైరెక్టర్ అట్లీ, విజయ్ సేతుపతి, రాధిక శరత్‌కుమార్ మరియు కార్తీ వంటివారు హాజరయ్యారు. నయన్, విగ్నేష్ జంటకు సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలు పుట్టారు. వారే ఉయిర్ మరియు ఉలగం. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో ఈ జంట సంతోషంగా ఉంది.