NHAI Arogya Van Project: దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు మరో కీలక అడుగు పడింది. నేషనల్ హైవేల వెంట ఖాళీ స్థలాల్లో ‘ఆరోగ్య వనాలు’ ఏర్పాటు చేయాలని జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI) నిర్ణయం తీసుకుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు జీవవైవిధ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తొలిదశలో ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
గత కొన్నేళ్లుగా దేశంలో వాయు కాలుష్యం తీవ్ర సమస్యగా మారుతోంది. ముఖ్యంగా హైవేల పరిసరాల్లో వాహనాల సంఖ్య పెరగడంతో కాలుష్యం మరింత అధికమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడేందుకు పలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి పరిష్కారంగా నేషనల్ హైవేల వెంట ఆరోగ్య వనాలు(, Arogya Van on National Highways) అభివృద్ధి చేయాలని NHAI నిర్ణయించింది.
ఈ ప్రాజెక్ట్ ప్రజల ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. హైవేలు పక్కన ప్రయాణించే వారికి శుభ్రమైన గాలి అందడం మాత్రమే కాకుండా, ప్రకృతి సౌందర్యం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా పక్షులు, సూక్ష్మ జీవులు నివసించే వాతావరణం కూడా ఏర్పడుతుంది.
ఆరోగ్య వనాల లక్ష్యం ఏమిటి?
NHAI చేపట్టిన ఈ ఆరోగ్య వనాలు ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం వాయు కాలుష్యాన్ని తగ్గించడం. హైవేల్లో వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని చెట్లు స్వీకరించడం ద్వారా గాలి నాణ్యత మెరుగుపడుతుంది.
ఇందులో భాగంగా వేప, ఉసిరి, నేరేడు, నిమ్మ వంటి ఔషధ గుణాలు (Medicinal plants on highways)కలిగిన మొక్కలను నాటనున్నారు. ఈ మొక్కలు కేవలం కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే ఈ వనాలకు “ఆరోగ్య వనాలు” అనే పేరు పెట్టారు.
తొలి దశలో భారీగా మొక్కల నాటకం
తొలిదశలో ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో 155 ఎకరాల విస్తీర్ణంలో 36 జాతులకు చెందిన సుమారు 67 వేల మొక్కలను నాటాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని దశలవారీగా విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను గుర్తించి, అక్కడ మొక్కలు నాటేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరిన్ని హైవేల వద్ద కూడా ఈ విధానం అమలు చేసే అవకాశముంది.
జీవవైవిధ్యానికి కొత్త ఊతం
ఈ ఆరోగ్య వనాలు కేవలం చెట్లు నాటడమే కాదు, జీవవైవిధ్యాన్ని పెంపొందించే ప్రయత్నం కూడా. పక్షులు, తేనెటీగలు, సూక్ష్మ జీవులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, హైవేల వెంట ఈ విధమైన వనాలు ఏర్పడితే ప్రకృతి సమతౌల్యం మెరుగుపడుతుంది. దీని వల్ల దీర్ఘకాలంలో పర్యావరణ సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంది. అధికారులు చెబుతున్నట్లుగా, “ఈ ప్రాజెక్ట్ ద్వారా కేవలం కాలుష్య నియంత్రణ(Pollution control measures India) మాత్రమే కాకుండా, ప్రకృతితో మనిషి సంబంధాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం.”
Also Read: Indian Embassy Advisory Iran: ఇరాన్‌లోని భారతీయులకు ఎంబసీ హెచ్చరిక!

గిరిబాబు – నేను MarthaTelugu వెబ్సైట్లో డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. నాకు రైటర్‌గా మూడేళ్ల అనుభవం ఉంది. నాకు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు రాయడంలో ప్రావీణ్యం ఉంది. వార్తలు మాత్రమే కాకుండా పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుణ్ణి.
