NHAI Internship: సమ్మర్ ఇంటర్న్‌షిప్.. రూ. 20వేల స్టైపెండ్: అర్హులు ఎవరంటే?

దేశవ్యాప్తంగా విద్యార్థులకు శుభవార్తగా National Highways Authority of India (NHAI) సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. రెండు నెలలపాటు కొనసాగే ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20 వేల స్టైపెండ్ అందించనున్నారు.

ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ వివరాలు

ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ మే 4 నుంచి జూలై 5 వరకు రెండు నెలలపాటు కొనసాగనుంది. ఇందులో ఎంపికైన విద్యార్థులు NHAI ఫీల్డ్ ఆఫీసులు, హెడ్‌క్వార్టర్స్‌లలో పని చేసే అవకాశం పొందుతారు. రోడ్లు, హైవేలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై ప్రత్యక్ష అనుభవాన్ని పొందే అవకాశం ఉండటం ఈ ప్రోగ్రామ్ ప్రత్యేకత. గతంలో కూడా NHAI ఇలాంటి ఇంటర్న్‌షిప్‌లను నిర్వహించగా, విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఇంజినీరింగ్, లా, మేనేజ్‌మెంట్ విద్యార్థులకు ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించేందుకు ఉపయోగపడుతుంది.

అర్హులు ఎవరు?

ఈ NHAI ఇంటర్న్‌షిప్‌కు వివిధ కోర్సులు చదివే విద్యార్థులు అర్హులు. అందులో ప్రధానంగా.. బీటెక్, ఎల్ఎల్బీ, బీఏ, బీకామ్, ఎంబీఏ వంటి కోర్సులు చేస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థుల చదువు, ఆసక్తికలిగిన రంగాల ఆధారంగా ఈ ఏమికా జరుగుతుంది.

విద్యార్థులకు గొప్ప అవకాశం

ఈ NHAI ఇంటర్న్‌షిప్ విద్యార్థులకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో పని చేసే అనుభవం పొందాలని ఆశించే వారికి ఇది ఒక మంచి అవకాశం. హైవేలు, రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులు ఎలా అమలు అవుతున్నాయి అనే విషయాలను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు.

ఇక రూ.20 వేల స్టైపెండ్ కూడా విద్యార్థులకు ఆకర్షణీయంగా మారింది. ఇతర ఇంటర్న్‌షిప్‌లతో పోలిస్తే ఇది మంచి ఆర్థిక సహాయం అందించనుంది. అలాగే ప్రోగ్రామ్ పూర్తయ్యాక సర్టిఫికెట్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది.

దరఖాస్తు విధానం & గడువు

ఈ NHAI ఇంటర్న్‌షిప్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ ఫారమ్ నింపాలి. దరఖాస్తు చేసుకునే చివరి తేదీ ఏప్రిల్ 15గా నిర్ణయించారు. దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. గడువు సమీపిస్తున్నందున త్వరగా అప్లై చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

రియల్ టైమ్ ప్రాజెక్టులపై పని

ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా విద్యార్థులు రియల్ టైమ్ ప్రాజెక్టులపై పని చేసే అవకాశం పొందుతారు. ఇది వారి రిజ్యూమేను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలలో కెరీర్ కొనసాగించాలని భావించే వారికి ఇది ఒక మంచి ప్రారంభం అవుతుంది. అలాగే ఈ అనుభవం వల్ల భవిష్యత్తులో పెద్ద కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కూడా పెరగవచ్చు. అందుకే ఈ NHAI ఇంటర్న్‌షిప్‌పై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది.

ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ – ఉపయోగాలు

విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి తరగతి గదిలో నేర్చుకున్న సిద్ధాంత జ్ఞానాన్ని ప్రాక్టికల్‌గా ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తాయి. పరిశ్రమలో పనిచేసే విధానం, టీమ్ వర్క్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యం వంటి ముఖ్యమైన స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకోవడానికి ఇంటర్న్‌షిప్‌లు దోహదపడతాయి. అలాగే, భవిష్యత్‌లో ఎలాంటి కెరీర్‌ను ఎంచుకోవాలో స్పష్టత వస్తుంది. కొంతమంది విద్యార్థులకు స్టైపెండ్ కూడా లభించడం వల్ల ఆర్థికంగా సహాయం కలుగుతుంది. ముఖ్యంగా, ఇంటర్న్‌షిప్ అనుభవం రెజ్యూమేలో ఉండటం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాకుండా, కంపెనీలకు అభ్యర్థిపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. మొత్తానికి, ఇంటర్న్‌షిప్‌లు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, కెరీర్ ఎదుగుదలకు బలమైన పునాది వేస్తాయి.

Also Read: మోదీకి నెంబర్ 1 గ్లోబల్ ర్యాంక్.. వెనుకబడ్డ ట్రంప్!