OnePlus Nord 6 vs Nord 5: స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్?

OnePlus Nord 6 vs OnePlus Nord 5: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ₹30,000 ధర పరిధి అత్యంత పోటీతో కూడిన సెగ్మెంట్‌గా మారింది. ఈ విభాగంలో కంపెనీలు ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను తక్కువ ధరలో అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా performance, battery life, display smoothness వంటి అంశాలు వినియోగదారులకు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో OnePlus Nord 5 మంచి ఎంపికగా నిలిచింది. ఇప్పుడు అదే సిరీస్‌లో కొత్తగా వచ్చిన OnePlus Nord 6 మరింత అప్‌గ్రేడ్‌లతో మార్కెట్‌లోకి వచ్చింది. ఈ రెండు ఫోన్ల మధ్య ఉన్న తేడాలు ఈ కథనంలో వివరంగా చూద్దాం.

డిజైన్ & డ్యూరబిలిటీ

మొదట డిజైన్ విషయానికి వస్తే, Nord 5 గ్లాస్ బ్యాక్‌తో సింపుల్, క్లిన్ లుక్‌ను అందిస్తుంది. ఇది Phantom Grey, Dry Ice, Marble Sands వంటి ఆకర్షణీయ రంగుల్లో అందుబాటులో ఉంది. కెమెరా సెటప్ కూడా చాలా సాధారణంగా ఉండి ఫోన్‌కు సాఫ్ట్ లుక్ ఇస్తుంది.

ఇదే సమయంలో Nord 6 అదే డిజైన్ ఫిలాసఫీని కొనసాగిస్తూ కొంత మార్పులు చేసింది. ఫ్లాట్ ఫ్రేమ్, స్క్వేర్ కెమెరా మాడ్యూల్ కారణంగా ఇది మరింత స్ట్రాంగ్ విజువల్ ప్రెజెన్స్ ఇస్తుంది. Holographic Quick Silver, Fresh Mint వంటి కలర్స్‌తో ఇది మరింత మోడ్రన్‌గా కనిపిస్తుంది.

అయితే.. అసలు మార్పు durabilityలో ఉంది. Nord 6 లో IP66, IP68, IP69 రేటింగ్స్ ఇవ్వడం వల్ల ఇది నీరు, ధూళి నుంచి మెరుగైన రక్షణ ఇస్తుంది. Nord 5 మాత్రం IP65తో మాత్రమే పరిమితం అయింది. దీని వల్ల Nord 6 ఎక్కువగా కఠిన పరిస్థితుల్లో ఉపయోగించడానికి అనుకూలంగా మారింది.

డిస్‌ప్లే & పనితీరు

డిస్‌ప్లే విషయానికి వస్తే, Nord 5 లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED స్క్రీన్ ఇప్పటికే మంచి అనుభవాన్ని ఇస్తుంది. స్క్రోలింగ్, గేమింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది.

Nord 6 ఈ రిఫ్రెష్ రేట్‌ను 165Hz వరకు పెంచింది. అలాగే 3600 nits పీక్ బ్రైట్‌నెస్, మెరుగైన టచ్ రిస్పాన్స్ వంటి ఫీచర్లు జోడించింది. కానీ వాస్తవంలో చాలా యాప్స్ 165Hz‌ను పూర్తిగా ఉపయోగించవు. కాబట్టి ఇది పేపర్‌పై ఉన్నంత ప్రభావం రోజువారీ వినియోగంలో కనిపించకపోవచ్చు.

పనితీరు విషయంలో Nord 5లో Snapdragon 8s Gen 3 ఇప్పటికే మంచి పనితీరును ఇచ్చింది. గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో ఇది బలంగా నిలిచింది. Nord 6 లో Snapdragon 8s Gen 4 ఉన్నప్పటికీ, ఇది పెద్ద జంప్ కాకుండా incremental upgrade మాత్రమే. అయితే మెరుగైన కూలింగ్ సిస్టమ్ కారణంగా దీర్ఘకాల వినియోగంలో స్టేబిలిటీ మెరుగవుతుంది.

బ్యాటరీ గురించి

ఈ రెండు ఫోన్ల మధ్య పెద్ద తేడా బ్యాటరీలో కనిపిస్తుంది. Nord 5 లో 6800mAh బ్యాటరీ ఉండడం అప్పట్లోనే పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.

అయితే Nord 6 ఈ విషయంలో భారీగా ముందంజ వేసింది. ఇందులో 9000mAh బ్యాటరీ ఇవ్వడం ఈ సెగ్మెంట్‌లో చాలా అరుదైన విషయం. దీని వల్ల ఒకసారి ఛార్జ్ చేస్తే చాలా కాలం ఉపయోగించుకోవచ్చు. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు bypass charging, reverse charging కూడా ఉన్నాయి. రోజువారీ వినియోగంలో తరచుగా ఛార్జ్ చేయాల్సిన అవసరం తగ్గిపోవడం Nord 6కి ప్రధాన అడ్వాంటేజ్.

కెమెరా & సాఫ్ట్‌వేర్

కెమెరా సెటప్ విషయంలో రెండు ఫోన్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. Nord 5 లో 50MP ప్రధాన కెమెరా, ultrawide, అలాగే 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. Nord 6 కూడా ఇలాంటి సెటప్‌ను కొనసాగించింది. అయితే ప్రాసెసింగ్‌లో కొంత మెరుగుదల ఉండొచ్చు.

సాఫ్ట్‌వేర్ విషయంలో Nord 5 OxygenOS 15 (Android 15) పై నడుస్తుంది. Nord 6 మాత్రం OxygenOS 16 (Android 16)తో వస్తుంది. రెండు ఫోన్లకూ నాలుగు Android updates, ఆరు సంవత్సరాల security updates అందిస్తారు. Nord 6లో AI ఫీచర్లు కొంచెం ఎక్కువగా ఉంటాయి.

ఏది కొనాలి?

ధర విషయానికి వస్తే Nord 5 తక్కువ ధరలో మంచి performance అందించే ఫోన్‌గా నిలుస్తుంది. ప్రస్తుత ధరలో ఇది value for money ఎంపికగా ఉంటుంది.

మరోవైపు Nord 6 ధర ఎక్కువైనా, పెద్ద బ్యాటరీ, మెరుగైన durability, మరియు long-term performance కారణంగా ఇది future-ready ఫోన్‌గా భావించవచ్చు. మీరు తక్కువ బడ్జెట్‌లో మంచి పనితీరు కోరుకుంటే Nord 5 సరైన ఎంపిక. కానీ ఎక్కువ battery life, బలమైన నిర్మాణం, మరియు దీర్ఘకాల వినియోగం కోరుకుంటే Nord 6 తీసుకోవడం మంచిది.

Also read:Bank Loan EMI Reduction: లోన్ తీసుకున్నవారికి ఉపశమనం.. వడ్డీ తగ్గుతుందా?