మనం చాన్నాళ్లుగా చెప్పుకుంటున్నట్లుగా.. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతూ ఉంది. గత ఏడాది (2025) ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మకాలు ఏకంగా.. 12.8 లక్షల మార్క్ దాటేశాయి. ఈ సేల్స్ అంతకుముందు ఏడాది కంటే కూడా 11 శాతం ఎక్కువని రిపోర్ట్స్ చెబుతున్నాయి.
మొదటి స్థానంలో టీవీఎస్
2025లో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 22.7 లక్షల యూనిట్లు కాగా.. ఇందులో 56 శాతం (12.8 లక్షలు) ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఇందులో అగ్రస్థానంలో టీవీఎస్ (2,98,867 యూనిట్లు) నిలిచింది. ఆ తరువాత స్థానంలో లేదా రెండో స్థానంలో బజాజ్ ఆటో (2,69,836 యూనిట్లు) నిలిచింది.
వెనుకపడిన ఓలా ఎలక్ట్రిక్
దాదాపు మూడేళ్లు అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచిన ఓలా ఎలక్ట్రిక్ మాత్రం.. 2025లో మొత్తం 1,99,316 యూనిట్ల అమ్మకాలతో మొదటిసారి నాల్గవ స్థానంలోకి పడిపోయింది. ఈ కంపెనీ మార్కెట్ వాటా కూడా 35 శాతం నుంచి 15.57 శాతానికి చేరింది. దాదాపు కంపెనీ అమ్మకాలు చాలావరకు క్షిణించాయి.
ఇక ఏథర్ ఎనర్జీ సేల్స్ కూడా 59 శాతం (మొత్తం 2,00,785 యూనిట్ల అమ్మకాలు) పెరిగాయి. కంపెనీ మొదటిసారి రెండు లక్షల అమ్మకాల మార్క్ క్రాస్ చేసింది. సేల్స్ పెరగడానికి రిజ్టా స్కూటర్ (70 శాతం వాటా) బాగా కలిసొచ్చింది. దీంతో మార్కెట్ వాటా 11 శాతం నుంచి 16 శాతానికి పెరిగింది.
మొదటిసారి హీరో మోటోకార్ప్
దేశంలో అతిపెద్ద టూవీలర్స్ తయారీ సంస్థ.. హీరో మోటోకార్ప్ సేల్స్ గత ఏడాది 109167 యూనిట్లు. కంపెనీ అమ్మకాలు ఫస్ట్ టైమ్ లక్ష సేల్స్ మార్క్ అధిగమించింది. విడా వీఎక్స్2 ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ గణనీయంగా పెరగడంతో.. సంస్థ అమ్మకాలు పెరిగాయి. నెలవారీ అమ్మకాల్లో కూడా హీరోమోటోకార్ప్ మంచి వృద్ధిని నమోదు చేసింది.
గ్రీన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అమ్మకాలు 57 శాతం పెరిగి 56,639 యూనిట్ల సేల్స్ సాధించగా.. ఆ తరువాత స్థానాల్లో బగాస్, ప్యూర్ ఈవీ, రివర్ మొబిలిటీ, కైనెటిక్ గ్రీన్ వంటి సంస్థలు అమ్మకాల్లో మొదటి టాప్ 10 జాబితాలో నిలిచాయి. మొత్తం ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మకాల్లో.. టాప్ 6 కంపెనీల వాటా 89 శాతం వద్ద ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తుంటే.. ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
ఈవీలకు ఎందుకీ డిమాండ్!
ఒకప్పుడు (ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ప్రారంభమైన రోజుల్లో) మన దేశంలో ఈవీలకు పెద్దగా డిమాండ్ లేదు. ఆ తరువాత ప్రభుత్వాలు చేపట్టిన కొన్ని అవగాహన కార్యక్రమాలు, కొంత డిస్కౌంట్స్ వంటివి అందించడం మొదలుపెట్టాక అమ్మకాలు పెరిగాయి. అంతే కాకుండా.. ప్రజల్లో కూడా అవగాహన పెరిగింది. దీంతో ప్రజలు కూడా చిన్న చిన్న దూరాలకు ప్రయాణించడానికి లేదా నగర ప్రయాణాలకు ఎలక్ట్రిక్ టూ వీలర్లను కొనుగోలు చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ఫ్యూయెల్ టూవీలర్ల కంటే కూడా.. ఎలక్ట్రిక్ టూవీలర్ల మెయింటెనెన్స్ కొంచెం తక్కువే. కాబట్టి.. రోజు రోజుకీ ఎలక్ట్రిక్ టూ వీలర్ల అమ్మకాలు పెరిగాయి. రాబోయే రోజుల్లో పెట్రోల్ టూ వీలర్ల అమ్మకాలను సైతం అధిగమిస్తాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.