PAN Card New Rules 2026: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్!.. PAN కార్డు కోసం అప్లై చేయాలంటే..

PAN Card New Rules 2026: దేశంలో పన్ను వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి PAN (Permanent Account Number) దరఖాస్తు ప్రక్రియలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు కేవలం ఆధార్ కార్డు ఆధారంగా PAN పొందే సౌకర్యం ఉండగా, ఇకపై అదనపు ధృవీకరణ పత్రాలు అవసరం అవుతాయి.

ప్రస్తుతం ఆధార్ మాత్రమే ఉపయోగించి PAN అప్లై చేసే గడువు మార్చి 31, 2026తో ముగియనుంది. ఆ తరువాత నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. ఈ మార్పులు దరఖాస్తు ప్రక్రియను మరింత కఠినతరం చేయనున్నాయి. కాబట్టి ఈ మార్పులు సాధారణ ప్రజలపై నేరుగా ప్రభావం చూపుతాయి.

కొత్త డాక్యుమెంట్లు తప్పనిసరి

కొత్త నిబంధనల ప్రకారం, PAN కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆధార్‌తో పాటు జనన తేదీ (DOB) ధృవీకరణ పత్రాలు లేదా ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, మ్యాట్రిక్యులేషన్ సర్టిఫికేట్ లేదా మేజిస్ట్రేట్ జారీ చేసిన అఫిడవిట్ వంటి పత్రాల్లో ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది.

పాత ఫార్మ్‌లకు గుడ్‌బై

అధికారుల ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి పాత PAN అప్లికేషన్ ఫార్మ్‌లు చెల్లవు. కొత్త ఫార్మాట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. దీంతో దరఖాస్తుదారులు తాజా ఫార్మ్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. లేకపోతే అప్లికేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.

పేరులో సరిపోలిక తప్పనిసరి

కొత్త మార్పుల్లో ముఖ్యమైనది పేరు సరిపోలిక. ఇకపై PAN కార్డులో పేరు, ఆధార్‌లో ఉన్న పేరుతో పూర్తిగా సరిపోవాలి. ఇంతకు ముందు కొంత మార్పు అనుమతించబడినా, ఇప్పుడు కఠినంగా అమలు చేయనున్నారు. ఇది డేటా ఖచ్చితత్వాన్ని పెంచడంలో సహాయపడుతుంది.

ఎందుకు ఈ మార్పులు?

ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం పన్ను చెల్లింపుదారుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం. అలాగే ఆర్థిక వ్యవస్థలో ఐడెంటిటీ గందరగోళాన్ని తగ్గించడం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ మార్పులు పారదర్శకతను పెంచుతాయి. అయితే దరఖాస్తు ప్రక్రియ కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది.

దరఖాస్తుదారులకు ముఖ్యమైన సూచనలు

PAN కోసం దరఖాస్తు చేసుకునే వారు ముందుగానే అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఆధార్ వివరాలు, ఇతర డాక్యుమెంట్లు సరిపోలేలా చూసుకోవాలి. ఆలస్యం చేయకుండా మార్చి 31లోపు అప్లై చేస్తే ప్రస్తుత సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు.

PAN కార్డు ఉపయోగాలు

PAN అంటే Permanent Account Number. ఇది ప్రతి భారతీయ పౌరుడికి ఇవ్వబడే 10 అక్షరాల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. PAN కార్డు ప్రధానంగా ఆదాయపు పన్ను సంబంధిత కార్యకలాపాల కోసం తీస్తారు. అయితే, ఈ కార్డు కేవలం పన్నుల కోసం మాత్రమే కాదు, మన ఆర్థిక జీవితంలో అనేక అవసరాల కోసం ఉపయోగపడుతుంది.

PAN కార్డు బ్యాంకింగ్ కార్యకలాపాల్లో అత్యంత ముఖ్యమైన పత్రం. బ్యాంక్ ఖాతాలు తెరవడం, పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేయడం, ఫిక్స్డ్ డిపాజిట్ లేదా రికరింగ్ డిపాజిట్ మొదలైన వాటిలో PAN కార్డు చూపించడం తప్పనిసరి. ఇది ఆర్థిక లావాదేవీలలో పారదర్శకతను కలిగిస్తుంది.

PAN లేకుండా ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయలేరు. అలాగే, పన్ను మినహాయింపులు పొందడం, టాక్స్ క్రెడిట్, ఆడ్జస్ట్మెంట్ లాంటి అవకాశాలను ఉపయోగించుకోవడం కోసం PAN అనివార్యం. PAN కార్డు పెద్ద ఆస్తుల లావాదేవీలలో కూడా అవసరం. స్థిరాస్థి, plots, కారు లేదా ఇల్లు కొనుగోలు/విక్రయాల్లో PAN తప్పనిసరి. ఇది పెద్ద లావాదేవీలను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. అదేవిధంగా, విదేశాల్లో రుసుము చెల్లించడం, ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడం వంటి అంతర్జాతీయ ఆర్థిక కార్యకలాపాలలో కూడా PAN కార్డు అవసరం.

పెద్ద వ్యాపారాలు, ప్రభుత్వ స్కీమ్‌లు, ఉద్యోగాలు, విద్యార్థుల లోన్‌లు కూడా PAN ఆధారంగా లావాదేవీలు చేస్తాయి. కాబట్టి PAN కార్డు కేవలం పన్ను గుర్తింపు పత్రం కాకుండా, ఆర్థిక జీవితంలో ఒక కీలకమైన పత్రంగా మారింది. PAN ద్వారా లావాదేవీలు సులభంగా, నిశ్శబ్దంగా మరియు పారదర్శకంగా జరుగుతాయి. PAN లేకుండా పెద్ద ఆర్థిక కార్యకలాపాల్లో సమస్యలు ఎదురవ్వడం సాధారణం.

Also Read: Illegal gambling ban India: కేంద్రం కఠిన చర్యలు.. వందలాది సైట్లు, యాప్‌లు బ్లాక్!