ప్రతి మనిషికి తన జీవితంలో కూడు, గుడ్డ, గూడు చాలా అవసరం, తప్పనిసరి కూడా. దాదాపు చాలామంది కూడు, గుడ్డ ఎలాగోలా సంపాదించుకుంటున్నారు. గూడు (ఇల్లు) మాత్రం కలగానే మిగిలిపోతోంది. ఈ కలను నిజం చేయడానికి & సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన‘ స్కీమ్ ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా సొంతిల్లు ఎలా పొందాలి?, అర్హతలు ఏమిటి?, దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వంటి వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ఆఖరి తేదీ ఎప్పుడంటే?
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2025 కింద ఆర్థికంగా వెనుకబడిన వారు సొంతంగా ఇల్లు కట్టుకోవచ్చు. ఈ స్కీమ్ కేవలం గ్రామీణ ప్రాంత వాసులకు మాత్రమే కాకుండా.. నగర వాసులకు కూడా అందుబాటులో ఉంది. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2025 డిసెంబర్ 31.
పీఎం ఆవాస్ యోజన స్కీమ్ గురించి
దేశంలోని ప్రతి ఒక్కరికి సొంతగా ఇల్లు ఉండాలి (హోసింగ్ ఫర్ ఆల్) అనే లక్ష్యంతోనే.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ప్రారంభించారు. 2024-25 బడ్జెట్ సమయంలో దీనికోసం ఏకంగా రూ. లక్ష కోట్ల కంటే ఎక్కువ నిధులను కేటాయించారు. ఇది అంతకు ముందు ఏడాది కేటాయించిన నిధుల కంటే 15 శాతం ఎక్కువ కావడం గమనార్హం.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని రెండుగా విభజించారు. ఒకటి పీఎంఏవై-గ్రామీణ, మరొకటి పీఎంఏవై-అర్బన్.మొత్తం మీద ఈసారి 5 కోట్ల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్రం ఇల్లు కట్టుకోవడానికి కేవలం.. సబ్సిడీ ఇవ్వడం మాత్రమే కాకుండా.. తక్కువ వడ్డీతో లోన్ కూడా అందిస్తుంది. కాబట్టి పేదవారు సైతం సులభంగా ఇల్లు కట్టుకోవచ్చు.
సబ్సిడీ ఇలా..
ఆదాయం ఆధారంగా.. పీఎంఏవై స్కీమ్ నాలుగు వర్గాలుగా విభజించారు. అవి ఆర్థికంగా వెనుకబడిన వర్గం (ఈడబ్ల్యుఎస్), కనిష్ట ఆదాయం కలిగిన వర్గం (ఎల్ఐజీ), మధ్యమ ఆదాయ వర్గం-1 (ఎంఐజీ-1), మధ్యమ ఆదాయ వర్గం-2 (ఎంఐజీ-2).
గ్రామీణ ప్రాంత వాసులకు.. ఈడబ్లుఎస్, ఎల్ఐజీ కుటుంబాలు ఇల్లు కట్టుకోవడానికి గరిష్టంగా 1.2 లక్షలు సహాయంగా అందిస్తారు. సీఎల్ఎస్ఎస్ (క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్) కింద 3 శాతం వడ్డీతో రూ. 6 లక్షలు అందుతాయి. కొంత కొండ ప్రాంత వాసులకు కొంత ఎక్కువ డబ్బు అందిస్తారు.
పట్టణ ప్రాంత వాసుల విషయానికి వస్తే.. ఆర్థికంగా వెనుకబడిన వర్గం వారికి రూ. 1.5 లక్షలు, కనిష్ట ఆదాయ వర్గానికి చెందినవారికి రూ. 2.67 లక్షల వరకు సబ్సిడీ అందిస్తారు. అలాగే 9 లక్షల రూపాయలపై 4శాతం వడ్డీ లభిస్తుంది. అదనంగా మరో 10 లక్షల రూపాయల లోన్ కూడా పొందవచ్చు. దీనికి వడ్డీ 6.5 శాతం ఉంటుంది. లోన్ అనేది.. బ్యాంకులు లేదా హోసింగ్ ఫైనాన్స్ కంపెనీల ద్వారా తీసుకోవచ్చు. దీంతో ఇల్లు నిర్మించుకోవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు.
అర్హతలు ఇవే..
- 18 సంవత్సరాలు నిండిన భారతీయులు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు.
- అప్లై చేసుకునే వ్యక్తి.. కుటుంబంలో ఎవరికీ పక్కా ఇల్లు ఉండకూడదు. ఇంతకు ముందు కేంద్ర, రాష్ట్ర పథకాల్లో సబ్సిడీ పొంది ఉండకూడదు.
- వార్షిక ఆదాయం కనిష్టంగా రూ. 3 లక్షలు, గరిష్టంగా 18 లక్షలు (ఇది గ్రామీణ, పట్టణ వర్గాలవారీగా ఉంటుంది) మధ్య ఉండాలి.
- కుటుంబ పెద్ద మహిళగా ఉన్నవారికి, దివ్యంగులకు, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మైనారిటీలకు, వితంతు మహిళలకు ముందుగా ఇళ్లు వచ్చే అవకాశం ఉంటుంది.
అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్
- ఆధార్ కార్డు
- పాన్ కార్డు
- ఓటర్ ఐడీ లేదా పాస్‌పోర్ట్
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- బ్యాంక్ పాస్‌బుక్
- రేషన్ కార్డు
- క్యాస్ట్ సర్టిఫికెట్
- పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు
- మొబైల్ నెంబర్
అప్లై చేసుకోవడం ఎలా?
పీఎం ఆవాస్ యోజన పథకానికి ఆఫ్‌లైన్, ఆన్లైన్ అనే రెండు విధాలలో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి 2025 డిసెంబర్ 31.
- అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి.. సిటిజెన్ అసెస్మెంట్ ఎంపికను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ మీ వర్గాన్ని సెలక్ట్ చేసుకోవాలి.
- ఆధార్, మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి.
- లాగిన్ అయిన తరువాత వ్యక్తిగత వివరాలు, ఆదాయం, బ్యాంక్ వివరాలను నమోదు చేయాలి.
- పైన చెప్పుకున్న డాక్యుమెంట్స్.. స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అన్ని పూర్తయిన తరువాత సబ్మిట్ చేయాలి.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.