సాధారణ నటుడిగా.. ఈశ్వర్ సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అరడుగుపెట్టి, పాన్ ఇండియా స్టార్ స్థాయికి ఎదిగిన ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. సినిమాల్లో మాత్రమే కాకుండా.. నిజ జీవితంలో కూడా ఎంతమంది ఆదర్శంగా నిలిచిన ఈ రెబల్ స్టార్ నటించిన ‘ది రాజా సాబ్’ ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ అయిపోయింది.
రన్ టైమ్ ఎంతంటే?
కల్కి 2898 ఏడీ సినిమా తరువాత హీరోగా ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ ప్రస్తుతం మంచి టాక్ పొందింది. ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబడుతుందని అటు సినిమా వర్గాలు, నిర్మాతలు కూడా భావిస్తున్నారు. ఇప్పటికే ఫ్యాన్స్ షో కూడా మొదలైపోయింది. ఈ సినిమా రన్ టైమ్ 189 నిముషాలు. అంటే 3 గంటల 9 నిమిషాలన్నమాట.
ముగ్గురు హీరోయిన్స్
ఇప్పటికి వరకు ప్రభాస్ యాక్షన్ సినిమాల్లో నటించారు, రొమాంటిక్ సినిమాల్లోనూ నటించారు. అయితే మొదటిసారి హారర్ కామెడీ సినిమాలో కనిపించారు. ఈ సినిమా కేవలం ప్రభాస్ అభిమానులకు మాత్రమే కాకుండా.. సాధారణ ప్రజలకు కూడా బాగా నచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ (రిద్ధి కుమార్, మాళవిక మోహన్, నిధి అగర్వాల్) నటించారు. ఇది కూడా రాజా సాబ్ సినిమాలో పెద్ద హైలెట్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ముగ్గురు హీరోయిన్స్ ఒక సినిమాలో కనిపించడం చాలా అరుదు అనే చెప్పాలి. సంజయ్ దత్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు.
ప్రభాస్ రెమ్యునరేషన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోల జాబితాలో ఒకరు. కాబట్టి ఒక్కో సినిమాకు ఈయన సాధారణంగా రూ. 120 కోట్ల నుంచి రూ. 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు. కానీ ది రాజాసాబ్ సినిమా కోసం తన రెమ్యునరేషన్ రూ. 100 కోట్లు అని తెలుస్తోంది. డైరెక్టర్ మారుతికి రూ. 18 కోట్లు, విలన్ పాత్రలో నటించిన సంజయ్ దత్ రూ. 6 కోట్లు పారితోషికంగా తీసుకున్నారని చెబుతున్నారు. రిద్ధి కుమార్ రూ. 3కోట్ల రెమ్యునరేషన్ తీసుకోగా.. మాళవిక రూ. 2 కోట్లు, నిధి అగర్వాల్ రూ. 1.5 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్లు సమాచారం. అయితే రాజా సాబ్ సినిమా కోసం పీపుల్స్ మీడియా నిర్మాణ సంస్థ రూ. 450 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. కాగా సినిమాలోని మొసలి సీన్ షూట్ చేయడానికి.. చిత్ర బృందం 23 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
ది రాజా సాబ్ సినిమా కేవలం.. తెలుగు భాషలో మాత్రమే కాకుండా.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అయింది. కాబట్టి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గొప్ప హిట్ సాదిస్తుందని చెబుతున్నారు. మొత్తం మీద ఈ సినిమా అనుకున్నట్లుగా హిట్ కొడితే.. ప్రభాస్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరినట్టే అవుతుంది.
ప్రభాస్ రాబోయే సినిమాలు
నటుడు ప్రభాస్.. రాజా సాబ్ సినిమా తరువాత సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాలో కనిపించనున్నారు. అంతే కాకుండా.. కల్కి 2898 ఏడీ పార్ట్ 2లో కూడా నటిస్తున్నారు. ఈ రేణు సినిమాలో బహుశా 2027లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే రిలీజ్ గురించి చిత్ర బృందం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
న్యూస్, మీడియా రంగంలో 12 సంవత్సరాల అనుభవం గల సీనియర్ ప్రొఫెషనల్. అనేక ప్రసిద్ధ తెలుగు టీవీ చానెల్స్‌లో పని చేశారు. ఇప్పటివరకు అనేక వ్యాసాలు, కథనాలు, అలాగే డిజిటల్ కంటెంట్ రచనలు చేయడంలో విశేష అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం ఉన్న మహేష్, క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగిన వ్యక్తి.