ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ వారణాసి. మహేష్ బాబు కథానాయకుడుగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ కూడా పూర్తయింది. అంతే కాకుండా.. మూవీకి చెంది షూటింగ్ కూడా ఇప్పటికే కొంత పూర్తయినట్లు.. కొన్ని ఫోటోలు ద్వారా తెలుస్తోంది. నటుడు ప్రకాష్ రాజ్.. వారణాసి చిత్రానికి సంబంధించిన ఒక ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.
నటుడు ప్రకాష్ రాజ్ ఏమన్నారంటే?
వారణాసి సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూస్ పూర్తయింది. ఇది నాలోని నటుడి ఆకలి తీర్చిందని ప్రకాష్ రాజ్ తన ఎక్స్ ఖాతా ద్వారా చెబుతూ.. రాజమౌళికి ధన్యవాదాలు తెలిపారు. మహేష్ బాబు, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రాలతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. తరువాత షెడ్యూల్ కోసం వేచి చూస్తున్నాను అని కూడా వెల్లడించారు.
నటుడు ప్రకాష్ రాజ్.. రాజమౌళి సినిమాలో నటించడం ఇదే మొదటిసారి కాదు. ఎందుకంటే.. రవితేజ నటించిన, రాజమౌళి దర్శకత్వం వహించిన విక్రమార్కుడు సినిమాలో.. పోలీస్ పాత్రలో కనిపించారు. ఇప్పుడు మరోమారు వారణాసి సినిమాలో కనిపించనున్నారు. ఆ సినిమాలో ఏ పాత్రలో కనిపిస్తారనేది సస్పెన్షన్. బహుశా ఓ కీలక పాత్రలో కనిపించే అవకాశం తప్పకుండా ఉందని మాత్రం చెప్పవచ్చు. మహేష్ బాబు తండ్రి పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తున్నప్పటికీ.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
వారణాసి సినిమా గురించి
మహేష్ బాబు హీరోగా.. దర్శక ధీరుడు రాజమోళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా వారణాసి. ఇది యాక్షన్ అడ్వెంచర్ సినిమా అని తెలుస్తోంది. ఇందులో పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. కాగా ప్రియాంక చోప్రా హీరోయిన్ కాగా.. ఎమ్ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
వారణాసి సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కాగా రిలీజ్ మాత్రం 2027లో అవకాశం ఉంది. అయితే విడుదలకు సంబంధించిన అధికారిక డేట్ తెలియాల్సి ఉంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
ఓటమి ఎరుగని డైరెక్టర్
2001లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. రాజమౌళి తన మొదటి సినిమాను (స్టూడెంట్ నెం.1) తెరకెక్కించారు. ఆ తరువాత సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా తెరకెక్కించనున్న సినిమా వారణాసి. ఇది కూడా భారీ సక్సెస్ సాదిస్తుందని సినిమా వర్గాలు చర్చించుకుంటున్నాయి.
మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్
బాలనటుడిగా సినిమాల్లో కనిపించిన మహేష్ బాబు.. చాలా సినిమాల్లో నటించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నారు. టక్కరి దొంగ, రాజకుమారుడు, మురారి, దూకుడు, ఆగడు, బిజినెస్ మ్యాన్, పోకిరీ వంటి సినిమాలతో బాగా పాపులర్ అయ్యారు. అయితే రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న మొదటి సినిమా వారణాసి కావడం గమనార్హం. ఈ సినిమా ఎలా ఉండబోతోందో.. చూడటానికి ఇంకా కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.