Ramayana Teaser Ranbir Kapoor: అంచనాలను మించిన రామాయణ.. ట్రైలర్ చూశారా?

Ramayana Teaser Ranbir Kapoor: బాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రామాయణ’ చిత్రం నుంచి టీజర్ విడుదలై చర్చనీయాంశంగా మారింది. హనుమాన్ జయంతి సందర్భంగా ముంబైలో మేకర్స్ విడుదల చేసిన ఈ వీడియోలో హీరో రణ్‌బీర్ కపూర్ రాముడి లుక్ మొదటిసారి బయటపడింది. దాదాపు 2.38 నిమిషాల నిడివి గల ఈ టీజర్‌లో విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల కానుంది.

బాలీవుడ్‌లో పౌరాణిక కథాంశాలతో తెరకెక్కే సినిమాలు అరుదుగా ఉంటాయి. ‘రామాయణ’ వంటి మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని సినిమా రూపొందించడం పెద్ద సవాల్‌గా భావిస్తారు. గతంలో వచ్చిన కొన్ని చిత్రాలు ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిన నేపథ్యంలో, ఈసారి నితేశ్ తివారీ తీసుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ టీజర్ రిలీజ్ ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రలో ఎలా కనిపిస్తాడో అన్న ఆసక్తి నెలలుగా కొనసాగుతోంది. ఇప్పుడు ఆ లుక్ బయటపడడంతో సోషల్ మీడియాలో చర్చలు మరింత వేగంగా సాగుతున్నాయి.

రణ్‌బీర్ రాముడి లుక్‌

‘రామాయణ’ టీజర్‌లో రాముడిగా రణ్‌బీర్ కపూర్ కనిపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. సాంప్రదాయబద్ధంగా, సాదాసీదాగా కనిపించే ఈ లుక్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. కొంతమంది నెటిజన్లు “ఇది నిజంగా రాముడి లుక్‌లా అనిపిస్తోంది” అంటూ అభినందిస్తున్నారు. ముఖ్యంగా ఆయన బాడీ లాంగ్వేజ్, హావభావాలు పాత్రకు తగ్గట్టుగా ఉన్నాయని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ పాత్ర కోసం రణ్‌బీర్ కపూర్ తీసుకున్న శ్రమ టీజర్‌లో స్పష్టంగా కనిపిస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

VFXపై మిశ్రమ స్పందన

అయితే టీజర్‌లోని VFX మరియు గ్రాఫిక్స్‌పై మాత్రం మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొంతమంది ప్రేక్షకులు “గతంలో వచ్చిన ‘ఆదిపురుష్’ కంటే ఇది మెరుగ్గా ఉంది” అని వ్యాఖ్యానిస్తుంటే, మరికొందరు “కొన్ని సన్నివేశాలు ఏఐ వీడియోలా కనిపిస్తున్నాయి” అని అభిప్రాయపడుతున్నారు.

సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో VFX నాణ్యతపై మరింత శ్రద్ధ అవసరమని అభిమానులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పౌరాణిక చిత్రాల్లో విజువల్ ఎఫెక్ట్స్ కీలక పాత్ర పోషిస్తాయని, అందుకే మేకర్స్ జాగ్రత్తలు తీసుకోవాలని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

భారీ ప్రాజెక్ట్‌గా ‘రామాయణ’

దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ ‘రామాయణ’ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి విడుదల కానుండగా, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

ఈ చిత్రంలో భారీ బడ్జెట్, ఆధునిక టెక్నాలజీ, అంతర్జాతీయ స్థాయి VFX వినియోగిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్‌లో ఇంత భారీ స్థాయిలో పౌరాణిక చిత్రం రావడం చాలా అరుదు. అందుకే ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. టీజర్ ద్వారా ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ సినిమా, విడుదల సమయంలో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ప్రేక్షకుల అంచనాలను అందుకుంటే ‘రామాయణ’ బాలీవుడ్‌లో ఒక కొత్త ట్రెండ్‌కు నాంది కావచ్చని సినీ నిపుణులు భావిస్తున్నారు.

Also read:Prabhas Promotes Sharwanand Biker: ‘ట్రైలర్ చూసి నమ్మేయాలి డ్యూడ్’: బైకర్ సినిమాపై ప్రభాస్