Daily Horoscope in Telugu 2025 March 26 Wednesday: బుధవారం (26 మార్చి 2025). శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణ పక్షం. రాహుకాలం మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:36 నుంచి 12: 24 వరకు. సూర్యోదయం ఉదయం 6:12. సూర్యాస్తమయం సాయంత్రం 6:24 గంటలకు.
మేషం
ఈ రాశివారు ఇంటాబయట ప్రతికూల వాతావరణం ఎదుర్కోవాల్సి వస్తుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి, శ్రమకు తగిన ఫలితం లభించదు. సన్నిహితులతో అకారణ వివాదాలు. ఉద్యోగంలో ఒత్తిడి, విమర్శలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. దైవ చింతన పెరుగుతుంది.
వృషభం
ఆదాయానికి తగిన విధంగా ఖర్చులు ఉంటాయి. సన్నిహితుల సహాయ, సహకారాలు అందుతాయి. వ్యాపారంలో లాభాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
మిథునం
ఖర్చులు అధికంగా ఉన్నాయి. అవసరానికి చేతికి అందవలసిన ధనం అందదు. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కర్కాటకం
పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. సన్నిహితులతో ఉత్సాహంగా కాలం గడుపుతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సింహం
ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన రీతిలో ముందుకు సాగవు. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సన్నిహితులతో అనవసర వివాదాలు. దైవ చింతన పెరుగుతుంది. ఉద్యోగం మరియు వ్యాపారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
కన్య
శుభకార్యాలలో పాల్గొంటారు. ముఖ్యమైన సమాచారం ఒకటి మిమ్మల్ని ఎంతగానో ఆనందానికి గురి చేస్తుంది. దీర్ఘకాలిక ఋణ బాధలు తగ్గుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా ముందుకు సాగుతాయి.
తుల
విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయం మిమ్మల్ని మరింత ఉన్నత స్థాయికి చేరుస్తుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయాలి.
ధనుస్సు
ముఖ్యమైన పనులకు ఆటంకాలు కలుగుతాయి, తద్వారా వాయిదా పడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగానే ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో కొన్ని ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దైవ చింతన పెరుగుతుంది.
మకరం
ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానం లభిస్తుంది3 ఆర్ధిక పరిస్థితి ఆశాజనంకంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు ఉన్నాయి. కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు తెలుస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. అలోచించి తీసుకునే కొన్ని నిర్ణయాలే మీకు శుభం కలిగిస్తాయి.
కుంభం
ఆర్ధిక పరిస్థితి మునుపటి కంటే దిగజారుతోంది. నూతన ఋణ ప్రయత్నాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురువుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పెద్దల సలహాలు మీకు కొంత లాభదాయకంగా ఉంటుంది.
మీనం
సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు తలెత్తవచ్చు. తొందరపాటు వద్దు. అలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారంలో లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి. కొన్ని విమర్శలు మిమ్మంల్ని బాధిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. త్వరలోనే శుభవార్తలు వింటారు.
గమనించండి: రాశిఫలాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. రాశుల ఫలితాలు గ్రహాల స్థితి గగతుల మీద కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇక్కడ చెప్పినవే జరుగుతాయని, జారకూడదను లేదు. ఎప్పుడు ఏది జరగాలన్నా.. అది తప్పకుండా దైవేశ్చ.