Daily Horoscope in Telugu 2025 March 9th Sunday: ఆదివారం (09/03/2025). శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, శుక్ల పక్షం, పాల్గుణ మాసం. రాహుకాలం మధ్యాహ్నం 12.17 నుంచి 1.55 వరకు, యమగండం మధ్యాహ్నం 12.00 నుంచి 1:00 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2.25 నుంచి 3.59 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4.25 నుంచి 5:13 వరకు, బ్రహ్మ ముహూర్తం సాయంత్రం 4:47 నుంచి 5:36 వరకు.
మేషం
ఈ రాశివారికి చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలు ఏర్పడతాయి. సోదరులతో మాటపట్టింపులు, వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఉద్యోగంలో ఊహించని మార్పులు, కొత్త కార్యక్రమాలను ప్రారంభించే సమయంలో జాగ్రత్త అవసరం, తెలివిగా వ్యవహరించాలి. దైవ చింతన పెరుగుతుంది.
వృషభం
సన్నిహితులతో విభేదాలు, నూతన వాహన కొనుగోలు ఉంది.ఉద్యోగులకు శుభపరిణామాలు, నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవనామ స్మరణ మరింత శుభాలను కలిగిస్తుంది.
మిథునం
ఈ రాశివారికి శుభయోగం మొదలైంది. అవసరానికి కావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్ధిక పరిస్థితి అనుకూలం. సన్నిహితుల నుంచి తెలుసుకునే ఒక సమాచారం.. మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం. విందు వినోదాల్లో పాల్గొంటారు.
కర్కాటకం
ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. శ్రమ అధికమవుతుంది. వ్యాపారాల్లో లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అనవసర ఖర్చులు అధికం. బంధువులతో చిన్న మాటపట్టింపులు, ఆరోగ్య సమస్యల పట్ల కొంత జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయ పారాయణం శుభాలను కలుగజేస్తుంది.
సింహం
వృధా ఖర్చులు, వృధా ప్రయాస. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభించదు. సమస్యలు ఎక్కువవుతాయి. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను ఎదుటుకోవాల్సి ఉంటుంది. ఆర్ధిక ఇబ్బందులు. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచింది.
కన్య
ఈ రాశివారికి అన్నింటా శుభయోగం. నూతన కార్యక్రమాలు చేపడతారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభం ఉంది. దైవ దర్శనం శుభం కలిగిస్తుంది.
తుల
ఉద్యోగులకు శుభయోగం. అయితే కొంత జాగ్రత్త, నేర్పు అవసరం. దూర ప్రయాణాలు అంతగా కలిసి రావు. చేపట్టిన పనుల్లో శ్రమ అధికమవుతుంది. ఆశించిన ఫలితాలు కనిపించవు. అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన అవసరం. నూతన కార్యక్రమాలకు సంబంధించిన ఒప్పందాలు చేసుకుంటారు.
వృశ్చికం
శుభవార్తలు వింటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల పరిచయం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన లాభాలు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు శుభయోగం. పోటీ పరీక్షలలో విజయం లభిస్తుంది.
ధనుస్సు
ముఖ్యమైన పనులలో జాప్యం. ఒత్తిడి పెరుగుతుంది. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతారు. బంధుమిత్రులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాల్లో కొన్ని సమస్యలు. ఆలోచించకుండా నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. దైవ చింతన పెరుగుతుంది.
మకరం
ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆస్తి వివాదాలకు సంబంధించిన పరిష్కారాలు ఓ కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సంయమనం అవసరం. తొందరపాటు వద్దు.
కుంభం
నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. సన్నిహితులతో సరదాగా గడుపుతారు. ఋణబాధలు తొలగిపోతాయి. అవసరానికి డబ్బు చెక్కురుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. దూరప్రయాణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. దైవ దర్శనం మనశ్శాంతిని ఇస్తుంది.
Also Read: తల్లికి కారు గిఫ్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ – వీడియో చూశారా?
మీనం
ఉద్యోగస్తులకు ప్రతికూల వాతావరణం. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. బంధువులతో మాటపట్టింపులు. శ్రమ కొంత అధికమవుతుంది. ఓపిక అవసరం. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
గమనించండి: రాశిఫలాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పేర్కొన్న అంశాలలో.. అన్నీ జరుగుతాయని గానీ లేదా జరగవని గానీ ఖచ్చితంగా చెప్పలేము. 12 గ్రహాల స్థానచలనం ఊహించని మార్పులను కలిగించవచ్చు. కాబట్టి ఎప్పుడో, ఎదో జరుగుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.