Raveena Tandon Earring Gift: ఏవైనా ఫ్యాన్స్ అడిగితే ఆటోగ్రాఫ్ ఇస్తారు, లేదా ఒక సెల్ఫీ ఇస్తారు. కొందరు అది ఇవ్వడానికి కూడా విసుక్కుంటారు. అయితే ప్రముఖ నటి రవీనా టండన్ (Raveena Tandon) మాత్రం ఇందుకు భిన్నమనే చెప్పాలి. ఎందుకంటే అభిమాని కోసం ఏకంగా తన చెవికున్న బంగారు కమ్మను గిఫ్ట్ ఇచ్చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిజానికి నటి రవీనా టండన్.. బుధవారం సాయంత్రం ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించారు. ఆ సమయంలో ఈమెతో పాటు తన కుమార్తె ‘రాషా తడానీ’ (Rasha Tadani) ఉంది. తల్లి, కూతురు ఎయిర్‌పోర్టులో కనిపించేసరికి.. అభిమానులు, ఫోటో గ్రాఫర్లు వారిని వెంబడిస్తూ.. ఫోటోలు, వీడియోలు తీశారు. ఆ సమయంలో ఒక అభిమాను మీ చెవి దుద్దులు బాగున్నాయని అన్నాడు. ఆ తరువాత రవీనా టండన్.. ఒక చెవి దుద్దు తీసి అతని చేతిలో పెట్టి వెళ్లిపోయింది.
తల్లి చేసిన పనికి.. కూతురు ఆశ్చర్యంతో చూస్తుండిపోయింది. మీ చీర బాగుంది, మీ బ్యాగ్ బాగుంది అని పూజిస్తే.. థాంక్స్ చెప్పి ఊరుకునే ఈ రోజుల్లో అభిమాని కోసం, పెట్టుకున్న చెవి దుద్దును ఇవ్వడం అనేది గొప్ప విషయం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ అభిమాని కూడా ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఆ తరువాత తేరుకుని తెగ సంతోషపడిపోయాడు.
ఇదే మొదటిసారి కాదు
నటి రవీనా టండన్ బంగారం గిఫ్ట్ ఇవ్వడం ఓడే మొదటిసారి కాదు. గతంలో కూడా ఈమె ఒక పెళ్ళికి హాజరైంది. ఆ పెళ్ళిలో, పెళ్లి కుమార్తెకు.. తన చేతిలో ఉన్న గాజులను తీసి ఇచ్చేసింది. ఆ గాజుల మీద రవీనా టండన్ మరియు ఆమె భర్త అనిల్ పేరు రాసుంది. అవేమీ పట్టించుకోకుండా.. చేతికున్న గాజులను తీసి ఇచ్చేసి, తన మంచి మనసు చాటుకుంది. ఉన్నవాటిని ఇతరులకు ఇచ్చేంత గొప్ప మనసు చాలా తక్కువమందికే ఉంటుంది. అలాంటి కోవకు చెందిన వారిలో రవీనా టండన్ మొదటి వ్యక్తి అనే చెప్పాలి.
సాధారణంగా మహిళలు, తమకు ఇష్టమైన వస్తువులను సొంత వారికి ఇవ్వడానికి ఆలోచించే.. ఈ రోజుల్లో, తాను వేసుకున్న గాజులు, చెవి దుద్దు వంటివి ఇవ్వడం అనేది గొప్ప విషయం. ఇది ప్రశంసనీయం కూడా. బహుశా ఇలాంటి ఘటనలు గతంలో కూడా ఎక్కడా కానరాలేదు. మొత్తానికి.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు మరియు అభిమానులు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: తల్లికి కారు గిఫ్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ – వీడియో చూశారా?
రవీనా టండన్
ప్రముఖ నటి రవీనా టండన్.. బాలీవుడ్ చిత్ర సీమలో అగ్రతారలలో ఒకరు. అయినప్పటికీ ఈమె తెలుగులో బాలకృష్ణ సరసన బంగారు బుల్లోడు, మోహన్ బాబు నటించిన పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో నటించింది. సినిమా రంగంలో అనేక చిత్రాలలో నటించి ఎంతోమంది అభిమానులను కలిగి ఉన్న ఈమె.. అనేక జాతీయ చలన చిత్ర అవార్డ్స్, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వంటివి సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా.. భారతదేశ అత్యున్నత పురస్కారాలతో ఒకటైన పద్మశ్రీ కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ”వెల్‌కమ్ టు ద జంగిల్” అనే సినిమాలో నటిస్తోంది.
View this post on Instagram