చదువున్న ప్రతి ఒక్కరూ.. ఒకే రంగంవైపు రావాలని ఏమి ఉండదు, కదా!. ఎవరి అభిరుచి వారిది. ఉద్యోగ సంపాదనలో ఎవరి దారి వారిది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంకింగ్ రంగంవైపు వస్తున్నా యువత చాలామంది ఉన్నారు. ఇలాంటి వారిలో.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)లో జాబ్స్ తెచ్చుకోవాలని కలలు కంటుంటారు. అలాంటి వారికి ఇప్పుడు శుభవార్త.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని వివిధ కార్యాలయాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 650 పోస్టులు ఉన్నట్లు వెల్లడించింది. పరీక్షలో మంచి ర్యాంక్ తెచ్చుకోవడం ద్వారా జాబ్ సొంతం చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
- ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకునేవారు ఈ రోజు (2026 ఫిబ్రవరి 16) నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
- అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 2026 మార్చి 08.
- ఫీజు చెల్లించటానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 16 నుంచి మార్చి 8 వరకు.
- ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ 2026 ఏప్రిల్ 11
- ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్ 2026 జూన్ 7 (అభ్యర్థులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అవసరమైతే ఈ తేదీలను మార్చుకునే హక్కు ఆర్‌బీఐకు ఉంటుంది.
ఖాళీల వివరాలు
హైదరాబాద్, బెంగళూరు. ఢిల్లీ, ముంబై, భోపాల్, చండీగఢ్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, లక్నో, కోల్‌కతా, అహ్మదాబాద్, చెన్నై, గువహతి, పాట్నా, నాగ్‌పూర్, తిరువనంతపురం మొదలైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాల్లో 650 అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.
అర్హతలు
- ఆర్‌బీఐ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకే వ్యక్తి తప్పకుండా భారతీయ పౌరుడై ఉండాలి.
- వయసు కనీసం 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయసు సడలింపులు ఉంటాయి.
- విద్యార్హత కనీసం 50 శాతం మార్కులతో బ్యాచలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- కంప్యూటర్‌లో వర్డ్ ప్రాసెసింగ్ స్కిల్ ఉండాలి.
- అప్లై చేసుకునే అభ్యర్థి రాష్ట్రం లేదా ప్రాంతన్ని బట్టి స్థానిక భాషపై పట్టు (చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం) ఉండాలి.
సెలక్షన్ & పరీక్షా విధానం
- ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (ఎల్పీటీ) అనే మూడు ఎంపికల ఆధారంగా సెలక్షన్ ప్రక్రియ ఉంటుంది. నెగటివ్ మార్కులు ఉంటాయి అభ్యర్థులు గమనించాలి.
- ప్రిలిమినరీ ఎగ్జామ్ 100 మార్కులు.. 60 నిముషాలు (ఇంగ్లీష్ – 30 మార్కులు, రీజనింగ్ – 35 మార్కులు, న్యూమరిక్ ఎలిజిబిలిటీ – 30 మార్కులు)
- మెయిన్స్ 200 మార్కులు (రీజనింగ్ 40 మార్కులు, ఇంగ్లీష్ 40 మార్కులు, న్యూమరికల్ ఎలిజిబిలిటీ 40 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 40 మార్కులు, కంప్యూటర్ పరిజ్ఞానం 40 మార్కులు)
అప్లికేషన్ ఫీజు & జీతభత్యాలు!
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.450 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు రూ.50 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి.
- ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల బేసిక్ శాలరీ రూ.29000. ఇతర అలవెన్సులు కలిపి నెలకు దాదాపు రూ.58514 జీతంగా లభిస్తుంది.
ఏ విభాగం నుంచి ఎన్ని మార్కులు అనే వివరాలు తెలిసిపోయింది. కాబట్టి ఈ ఉద్యోగానికి సిద్ధమయ్యే అభ్యర్థులు ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధమైతే.. తప్పకుండా జాబ్ తెచ్చుకోవచ్చు. పరీక్షలు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సన్నద్ధమవ్వడానికీ ప్రయత్నించాలి.
శౌర్య వర్ధన్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సినిమా, రాజకీయం వంటి విభిన్న అంశాలపై సమగ్రమైన ఆర్టికల్స్ అందిస్తూ వస్తున్నాను. ఈ రంగంలో నాకు నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది. రాయడంలో నైపుణ్యంతో, చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.