నటుడు పవన్ కల్యాణ్.. ఓజీ సినిమా దర్శకుడు సుజీత్’కు ఇటీవల ఓ ఖరీదైన ల్యాండ్ రోవర్ కారును గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కారును ఎందుకు ఇచ్చారు?, దీని వెనుక ఉన్న అసలైన రీజన్ ఏమిటో బహుశా చలామందికి తెలుసుండక పోవచ్చు. ఈ విషయాలు ఈ కథనంలో..
కారు అమ్మేసి.. షూటింగ్!
ఓజీ సినిమా షూటింగ్ సమయంలో.. దాదాపు షూటింగ్ మొత్తం ముగిసింది అనుకునే సమయంలో కొన్ని సన్నివేశాలను జపాన్‌లో చిత్రీకరించాలని సుజీత్ భావించారు. అయితే అప్పటికే సినిమా కోసం చాలా ఖర్చు చేశారు. జపాన్‌లో షూటింగ్ పూర్తి చేస్తేనే.. సినిమాకు ఒక ఫినిషింగ్ వస్తుందని నమ్మిన సుజీత్.. షెడ్యూల్ కోసం నిధులను సమకూర్చుకోవడం కోసం తన ల్యాండ్ రోవర్ కారును అమ్మేశారు. దాని నుంచి వచ్చిన డబ్బుతో.. షూటింగ్ పూర్తి చేశారు.
కారు గిఫ్ట్ ఇచ్చిన పవన్
సుజీత్ తన ల్యాండ్ రోవర్ కారును అమ్మేసిన విషయం.. పవన్ కల్యాణ్‌కు డబ్బింగ్ సమయంలో తెలిసింది. ఆ విషయం విన్న పవన్.. సినిమాపై సుజీత్‌కు ఉన్న అంకితభావానికి మురిసిపోయాడు. దీంతో తాను ఏ మోడల్ రేంజ్ రోవర్ కారును విక్రయించేసాడో.. అలాంటి మోడల్ కారును గిఫ్ట్ ఇచ్చి సంతోషపెట్టారు.
అసలే పవన్ కల్యాణ్ జాలి హృదయం కలిగిన మనిషి. మనిషి కష్టంలో ఉన్నాడని తెలిస్తే.. తన కోసం ఆలోచించకుండా దానం చేసే ఉదార స్వభావం ఉన్న మహా మనిషి. పవన్ కల్యాణ్ చేసిన దానాలకు సంబంధించిన నిదర్శనాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు సినిమా కోసం ఖరీదైన కారు కొని ఇవ్వడం మరో గొప్ప విషయం అనే చెప్పాలి. విషయం తెలిసిన అభినములు సైతం పవన్ కల్యాణ్ ఉదార స్వభావాన్ని మరోమారు ప్రశంసిస్తున్నారు.
ఓజీ సినిమా
2025 సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన ఓజీ (దే కాల్ హిమ్ ఓజీ).. మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 300 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రబత్తిని సినిమాల జాబితాలో ఓజీ కూడా ఒకటిగా నిలిచింది. సినిమాలో.. పవన్ కల్యాణ్ యాక్టింగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. చాలా రోజుల తరువాత పవన్ యాక్షన్ సినిమాలో కనిపించడంతో.. చాలామందిని ఆకట్టుకోగలిగారు.
పవన్ కల్యాణ్ నెక్స్ట్ సినిమా
ఓవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. తన ప్రొఫెషన్ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా 2026 మార్చి నాటికి రిలీజ్ అవుతుందని సమాచారం. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్స్, సాంగ్స్ కూడా సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యాయి. ఇవి అటు అభిమానులను, సాధారణ సినీ ప్రేమికులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ఎలాంటి విజయం సాదిస్తుందో తెలుసుకోవాలంటే.. రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. ఇది కూడా ఓజీ మాదిరిగా.. మంచి హిట్ సాధిస్తుందని, చాలా మంది భావిస్తున్నారు.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.