ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పదవ తరగతి పాసై ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి ఇది శుభవార్త. ఈ ఉద్యోగానికి కావలసిన అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలి?, వేతనం ఎంత అనే పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ).. మల్టి టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులు 10వ తరగతి విద్యార్హత కలిగి ఉంటే.. అప్లై చేసుకోవచ్చు. ఇది ఉద్యోగం కోసం వేచి చూస్తున్నవారికి మంచి వార్త అనే చెప్పాలి. పరీక్ష, మెడికల్ టెస్ట్ వంటివి ఉత్తీర్ణత సాధించి.. మెరిట్ లిస్టులో నిలిచిన వారు ఈ ఉద్యోగం పొందవచ్చు. 362 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదలైంది.
అర్హతలు ఏమిటంటే?
- ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థి.. తప్పకుండా భారతీయ పౌరుడై ఉండాలి.
- నిర్ణీత వయసు 2025 డిసెంబర్ 14 నాటికి.. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
- రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి పదవ తరగతి పాసై ఉండాలి.
- జాబ్ కోసం అప్లై చేసుకునే అభ్యర్థి తమ తమ రాష్ట్రాలకు సంబంధించిన నివాస ధ్రువీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి.
ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థి కేటగిరిని బట్టి వయసు సడలింపు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయసు సడలింపు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యుబీడీ అభ్యర్ధులకు పది సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. దీన్ని బట్టి అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
జీతం & ఎంపిక విధానం
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న అభ్యర్థులు టైర్ 1, టైర్ 2 అని రెండు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలలో మెరిట్ జాబితాలో నిలిచినవారికి మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారి నెల జీతం రూ.18వేలు నుంచి రూ. 56,900 వరకు ఉంటుంది. జీతంతో పాటు.. కేంద్ర ప్రభుత్వం అందించే అలవెన్సులు కూడా లభిస్తాయి.
ఎగ్జామ్ ఫీజు వివరాలు
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే.. పరీక్ష ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులు 650 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యుబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్స్, మహిళా అభ్యర్థులు రూ. 550 చెల్లించాల్సి ఉంటుంది.
అప్లై చేసుకునే విధానం & కావలసిన డాక్యుమెంట్స్
- ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు.
- దీనికోసం ముందుగా అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి.. హోమ్ పేజీలో కనిపించే ఐబీ ఎంటీఎస్ రిక్రూట్‌మెంట్ మీద క్లిక్ చేయాలి.
- మీ వివరాలతో పేజీని ఫిల్ చేసిన తరువాత.. రిజిస్ట్రేషన్ చేసుకొవాలి.
- రిజిస్టర్ అయిన తరువాత.. లాగిన్ అయ్యి కావలసిన డాక్యుమెంట్స్ (ఐడెంటిటీ ప్రూఫ్, 10వ తరగతి మార్క్స్ కార్డ్, నివాస ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోస్) అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
- డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తరువాత అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- ఫీజు చెల్లించిన తరువాత.. చివరగా సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి.
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 2025 డిసెంబర్ 14. 2025 నవంబర్ 22 నుంచి దరఖాస్తులు తీసుకోవడం మొదలైంది. ఇప్పటికి కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోకుండా ఉన్న అభ్యర్థులు, గడువు లోపల అప్లై చేసుకోవాలి. బహుశా దరఖాస్తు గడువును పెంచే అవకాశం లేదు. అభ్యర్థులు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.