భారత్‌లో అందుబాటులో ఉన్న రాయల్ బండ్లు ఇవే.. ఒక్కొక్కటి ఒక్కో స్టైల్

Royal Enfield Motorcycles Available in Indian Market 2024: రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield).. ఇది నిజంగానే రాయల్ బండి. ఈ పేరు వింటేనే యువ రైడర్లకు పూనకాలు వచ్చేస్తాయి. ప్రస్తుతం భారతీయ ద్విచక్ర వాహన విభాగంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తూ.. గణనీయమైన అమ్మకాలు పొందుతున్న ఈ చైన్నై బేస్డ్ కంపెనీ దాదాపు 10 బైకులను ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తోంది. ఇందులో క్లాసిక్ సిరీస్, రోడ్‌స్టర్ సిరీస్, అడ్వెంచర్ సిరీస్, బాబర్, కేఫ్ రేసర్మరియు క్రూయిజర్ అనే ఆరు విభాగాలు ఉన్నాయి.

క్లాసిక్ 350 (Classic 350)

దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క క్లాసిక్ 350. రిట్రో డిజైన్, టియర్ డ్రాప్ ఫ్యూయెల్ ట్యాంక్, స్పోక్ వీల్స్ మరియు సౌకర్యవంతమైన సీటు కలిగిన ఈ బైక్ 349 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 20.2 బీహెచ్‌పీ పవర్ & 27 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 2.24 లక్షలు (ఎక్స్ షోరూమ్, చెన్నై).

బుల్లెట్ 350 (Bullet 350)

రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క బుల్లెట్ అనేది ఈ రోజు పుట్టించి కాదు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ బైక్ నేడు బుల్లెట్ 350 పేరుతో వాహన ప్రేమికులను ఆకర్శించడంలో విజయం సాధించింది. ఇది 346 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 6100 rpm వద్ద 20.2 Bhp పవర్ మరియు 4000 rpm వద్ద 27 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. 35 కిమీ/లీ మైలేజ్ అందించే ఈ బైక్ 195 కేజీల బరువు ఉంటుంది. ఈ బైక్ ధర రూ. 1.73 లక్షలు (ఎక్స్ షోరూమ్).

హంటర్ 350 (Hunter 350)

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ అనేది రోడ్‌స్టర్ సిరీస్ బైక్. లాంగ్ రైడ్ చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఆకర్షణీయమైన డిజైన్ మరియు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగిన ఈ బైక్ 349 సీసీ ఇంజిన్ కలిగి 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇంజిన్ 20.2 బ్రేక్ హార్స్ పవర్ (Bhp), 27 న్యూటన్ మీటర్ (Nm) టార్క్ అందిస్తుంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు (ఎక్స్ షోరూమ్).

గెరిల్లా 450 (Guerrilla 450)

రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క మరో రోడ్‌స్టర్ బైక్ ఈ గెరిల్లా 450. ఇటీవలే దేశీయ విఫణిలో అడుగుపెట్టిన ఈ బైక్ ధర రూ. 2.39 లక్షలు (ఎక్స్ షోరూమ్). రోజువారీ ప్రయాణానికి అనుకూలంగా ఉండే సరికొత్త బైక్ 450 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 39.47 Bhp పవర్ మరియు 40 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. దాదాపు 185 కేజీల బరువున్న ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్లు.

ఇంటర్‌సెప్టర్ 650 (Interceptor 650)

రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క ఖరీదైన బైకులలో ఒకటి ఈ ‘ఇంటర్‌సెప్టర్ 650’. చూడగానే ఆకర్శించబడే ఈ బైక్ 648 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 47 బ్రేక్ హార్స్ పవర్ (Bhp), 52 న్యూటన్ మీటర్ (Nm) టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. మంచి డిజైన్ కలిగిన ఈ బైక్ డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్, స్లిప్పర్ క్లచ్ వంటివన్నీ పొందుతుంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 3.02 లక్షలు (ఎక్స్ షోరూమ్). 213 కిమీ కేజీల బరువున్న ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 23 కిమీ/లీ. ఈ బైక్ 1960ల నాటి ఇంటర్‌సెప్టర్ నుంచి ప్రేరణ పొందింది.

హిమాలయ 450 (Himalaya 450)

అడ్వెంచర్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ హిమాలయన్ 450. ఎక్కువ మంది ఆఫ్-రోడింగ్ ప్రియుల మనసుదోచిన ఈ బైక్ ప్రారంభ ధర రూ. 2.85 లక్షలు (ఎక్స్ షోరూమ్). హిమాలయన్ 452 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 8000 rpm వద్ద 39.47 బీహెచ్పీ పవర్ మరియు 5500 rpm వద్ద 40 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ వెట్ క్లచ్‌తో జతచేయబడి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇది లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, స్పోక్డ్ వీల్స్ కలిగి కఠినమైన భూభాగాల్లో కూడా సజావుగా ముందుకు సాగటానికి ఉపయోగపడుతుంది.

షాట్‌గన్ 650 (Shotgun 650)

రాయల్ ఎన్‌ఫీల్డ్ లైనప్‌లోకి కొత్తగా ప్రవేశించిన బైక్ ఈ షాట్‌గన్ 650. ఇది బాబర్ స్టైల్ డిజైన్ కలిగి 649 సీసీ ప్యారలల్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 47 Bhp పవర్, 52 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఈ బైక్ ధర రూ. 3.59 లక్షలు (ఎక్స్ షోరూమ్). డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కలిగిన ఈ బైక్ 13.8 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది.

కాంటినెంటల్ జీటీ 650 (Continental GT 650)

650 సీసీ విభాగంలో అత్యుత్తమ బైక్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650. కేఫ్ రేసర్ విభాగానికి చెందిన ఈ బైక్ ధర రూ. 3.18 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 648 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 7250 rpm వద్ద 47 బ్రేక్ హార్స్ పవర్ (Bhp) మరియు 52 న్యూటన్ మీటర్ టార్క్ (Nm) ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. 211 కేజీల బరువున్న ఈ బైక్ 25 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.

మీటియోర్ 350 (Meteor 350)

క్రూయిజర్ విభాగంలో కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ తన బైకులను లాంచ్ చేసి, విక్రయిస్తోంది. ఇందులో రెండు బైకులు ఉన్నాయి. వీటిలో ఒకటి మీటియోర్ 350. దీని ధర రూ. 2.05 లక్షలు (ఎక్స్ షోరూమ్). 349 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 6100 rpm వద్ద 20.2 Bhp పవర్ మరియు 4000 rpm వద్ద 27 ఎన్ఎమ్ తర్క అందిస్తుంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్ కలిగిన ఈ బైక్ ఉత్తమ డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇందులో డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఎల్ఈడీ లైటింగ్, ట్రిప్పర్ న్యావిగేషన్ సిస్టం ఉంటాయి. కాబట్టి ఇవన్నీ రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

Don’t Miss: మెర్సిడెస్ బెంజ్.. ఓ అమ్మాయి పేరు నుంచి పుట్టిందని తెలుసా? కీలక విషయాలు
సూపర్ మీటియోర్ 650 (Meteor Meteor 650)

రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క మరో బైక్ సూపర్ మీటియోర్ 650. రూ. 3.63 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ కూడా 650 సీసీ బైకుల మాదిరిగానే అదే 648 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 7250 rpm వద్ద 46.3 బీహెచ్‌పీ పవర్ మరియు 5650 rpm వద్ద 52 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి ఇతర బైకుల మాదిరిగానే ఇది కూడా మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. లాంగ్ రైడింగ్ చేయడానికి అనుకూలంగా ఉండే ఈ బైక్ రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్, ఫార్వర్డ్ సెట్ ఫుట్‌పెగ్‌లు వంటి వాటితో పాటు ట్రిప్పర్ న్యావిగేషన్ సిస్టం, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ వంటివి పొందుతుంది.