Royal Enfield New Bike Guerrilla 450 launched: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ (Royal Enfield) కొత్త బైక్ స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన ఒక కార్యక్రమంలో అధికారికంగా లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ పేరు ‘గెరిల్లా 450’ (Guerrilla 450). ఈ బైక్ త్వరలోనే దేశీయ విఫణిలో కూడా విక్రయించబడుతుంది. గెరిల్లా 450 కొత్త బైక్ ధర, డిజైన్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..
ధర మరియు వేరియంట్స్
రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేసిన కొత్త గెరిల్లా 450 బైక్ మొత్తం మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. అవి అనలాగ్, డాష్ మరియు ఫ్లాష్ వేరియంట్లు. వీటి ధరలు వరుసగా రూ. 2.39 లక్షలు, రూ. 2.49 లక్షలు మరియు రూ. 2.54 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). ఇప్పటికే ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి.
డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 బైక్ మొత్తం ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. అనలాగ్ వేరియంట్ స్మోక్ మరియు ఫ్లేయా బ్లాక్ రంగులలో.. డాష్ వేరియంట్ ప్లేయా బ్లాక్ మరియు గోల్డ్ డిప్ రంగులలో మరియు టాప్ వేరియంట్ ఫ్లాష్ ఎల్లో రిబ్బన్ మరియు బ్రూవా బ్లూ అనే రంగులలో లభిస్తాయి. ఈ కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి కస్టమర్లు ఈ రంగులలో తమకు నచ్చిన కలర్ ఎంచుకోవచ్చు.
డిజైన్ విషయానికి వస్తే.. కొత్త గెరిల్లా 450 బైక్ చూడటానికి రెండవ తరం హిమాలయన్ 450 మాదిరిగా ఉంటుంది. ఇది షెర్పా 450 ఇంజిన్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించబడి ఉంటుంది. కాబట్టి చాసిస్, పవర్‌ట్రెయిన్ అన్నీ కూడా దాదాపు హిమాలయన్ 450తో సమానంగా ఉంటాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 బైక్ రోడ్ ఫోకస్డ్ రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్. ఇది ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, 11 లీటర్ల కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్, వన్-పీస్ సీటు, రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ పొందుతుంది. ఇక టెయిల్ సెక్షన్ మరియు సైడ్ ప్యానెల్ కాకుండా మిగిలిన బాడీ ప్యానెల్, ఎగ్జాస్ట్ వంటివన్నీ హిమాలయన్ మాదిరిగానే ఉంటాయి.
ఫీచర్స్
కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 బైక్ బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన TFT డిస్‌ప్లే మరియు గూగుల్ న్యావిగేషన్ వంటివి పొందుతుంది. అయితే బేస్ వేరియంట్ అయిన అనలాగ్.. ఆప్షనల్ ట్రిప్పర్ న్యావిగేషన్ పాడ్‌తో అనలాగ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. ఇవన్నీ బైక్ రైడర్లకు చాలా ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.
ఇంజిన్
గెరిల్లా 450 బైక్ 450 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. అది 8000 rpm వద్ద 39.47 Bhp పవర్ మరియు 5500 rpm వద్ద 40 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఇతర అడ్వెంచర్ బైకుల మాదిరిగానే 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
ఈ బైక్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ మాత్రమే కాకుండా.. థొరెటర్ రైడ్ బై వైర్ పొందుతుంది. ఇందులో ఎకో మరియు పెర్ఫామెన్స్ అనే రెండు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఇందులో ఉంటుంది. మొత్తం మీద ఇది అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుందని భావిస్తున్నాము.
గెరిల్లా 450 బైక్ 17 ఇంచెస్ అల్లాయ్స్ కలిగి రెండు చివర్లలోనూ రోడ్ ఫోకస్డ్ టైర్స్ పొందుతాయి. సస్పెన్షన్ సెటప్ కోసం ముందు భాగంలో 40 మిమీ టెలిస్కోపిక్ పోర్క్ యూనిట్, వెనుక భాగంలో 150 మిమీ మోనోషాక్ సెటప్ ఉంటుంది. ఈ బైక్ ముందు భాగంలో 310 మిమీ డిస్క్ బ్రేక్, వెనుక 270 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇవన్నీ రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.
Don’t Miss: సరికొత్త బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్.. బుకింగ్స్ స్టార్ట్ – లాంచ్ ఎప్పుడంటే?
ప్రత్యర్థులు
మార్కెట్లో లాంచ్ అయిన కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 బైక్ ఇప్పటికే విక్రయానికి కూడా ట్రయంఫ్ స్పీడ్ 400 మరియు హీరో మావ్రిక్ 440 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి గెరిల్లా 450 బైక్ లాంటి అమ్మకాలను పొందుతుందనే విషయం త్వరలోనే తెలుస్తుంది.