Rythu Bharosa: తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా పథకం కింద తొలి విడత నిధుల పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈ మొత్తాలు నేరుగా జమ అవుతున్నాయి. ఈ పథకం కింద మొత్తం 68,89,955 మంది రైతులకు 3,446 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి ఎకరాకు రూ.6,000 చొప్పున ఈ సాయం అందుతోంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రైతు శ్రమకు గౌరవం దక్కాలని, వారి కష్టానికి సరైన ఫలితం రావాలని ఈ పథకం లక్ష్యమని తెలిపారు. రైతు ఖాతాలోకి చేరే ప్రతి రూపాయి వారి శ్రమకు ప్రతిఫలంగా మారాలని ఆయన పేర్కొన్నారు. రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కోసం ఈ పథకం కీలకంగా మారుతోంది. ముఖ్యంగా సాగు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సాయం రైతులకు ఉపశమనంగా నిలుస్తోంది.
రైతు భరోసా పథకం
రైతు భరోసా పథకం.. తెలంగాణలో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు రూపొందించారు. ఈ పథకం ద్వారా రైతులకు నేరుగా.. ఆర్థిక సహాయం అందుతుంది. ఎకరాకు రూ.6,000 చొప్పున సాయం, నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ, చిన్న.. మధ్య తరహా రైతులకు ప్రయోజనం, సాగు ఖర్చులకు మద్దతు వంటివి దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ సాయం అందిస్తోంది. రైతులకు తక్షణ ఆర్థిక భరోసా కల్పించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రధాన లక్ష్యం.
సీఎం రేవంత్ రెడ్డి స్పందన
సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. రైతు ఖాతాలో పడే ప్రతి పైసా.. తన శరీరం నుంచి చిందే ప్రతి చెమట చుక్క.. పంట మొక్కై, పసిడి పంటై తిరిగి రైతు ముఖంలో ఆనందంగా మారాలి. ఇదే రైతు భరోసా పరమార్థం.” ఈ వ్యాఖ్యలు రైతుల పట్ల ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తున్నాయి.
ఆర్థిక ప్రభావం – రైతులకు ఊరట
రూ.3,446 కోట్ల భారీ మొత్తాన్ని విడుదల చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో చైతన్యం పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. రైతుల చేతుల్లో డబ్బు ఉండటం వల్ల స్థానిక మార్కెట్లలో కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇది వ్యవసాయ రంగానికి మాత్రమే కాకుండా గ్రామీణ వ్యాపారాలకు కూడా ఉపయోగపడుతుంది. దీంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పరోక్షంగా మేలు కలుగుతుంది.
రైతులు ఏమి చేయాలి?
రైతులు తమ బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. డబ్బు జమ కాకపోతే సంబంధిత వ్యవసాయ అధికారులు లేదా బ్యాంకులను సంప్రదించాలని చెప్పారు. అదేవిధంగా, ఆధార్-బ్యాంక్ లింకింగ్, భూసంబంధిత వివరాలు సరిగా ఉన్నాయా అనే విషయాలను కూడా రైతులు ధృవీకరించుకోవాలి.
చిన్న సాయం – పెద్ద ఊరట
రైతు సంక్షేమం కోసం దేశంలోని దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమదైన రీతిలో సాయపడుతున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా రైతులను ఆడుకుంటోంది. చేసేది చిన్న సాయమే అయినా.. కష్టాల్లో ఉన్న రైతులకు ఇది పెద్ద ఉపశమనం అనే చెప్పాలి. కాగా రాబోయే రోజుల్లో ఖాతాల్లో జమ అయ్యే డబ్బు మరింత పెంచితే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచిస్తే బాగుంటుంది.
Also read:Anganwadi new phones Telangana: ‘అంగన్వాడీ సిబ్బందికి కొత్త స్మార్ట్ఫోన్లు’: సీఎం రేవంత్
న్యూస్, మీడియా రంగంలో 12 సంవత్సరాల అనుభవం గల సీనియర్ ప్రొఫెషనల్. అనేక ప్రసిద్ధ తెలుగు టీవీ చానెల్స్‌లో పని చేశారు. ఇప్పటివరకు అనేక వ్యాసాలు, కథనాలు, అలాగే డిజిటల్ కంటెంట్ రచనలు చేయడంలో విశేష అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం ఉన్న మహేష్, క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగిన వ్యక్తి.