క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఇంట త్వరలోనే పెళ్లిబాజాలు మోగనున్నాయి. తన కుమారుడు అర్జున్ టెండుల్కర్.. సానియా చందోక్ను వివాహం చేసుకోనున్నారు. ఈ జంట పెళ్లికి సచిన్ ఎంతోమంది ప్రముఖులను ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు.
సచిన్ టెండుల్కర్.. అర్జున్ పెళ్లికి భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించడానికి.. తన భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి వెళ్లారు. అర్జున్.. సానియా పెళ్లికి ప్రధానమంత్రిని ఆహ్వానించడం మాకు చాలా గౌరవంగా ఉందని, దీనికి సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.
పెళ్లికి ప్రముఖుల ఆహ్వానం!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు.. సచిన్ టెండుల్కర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఆహ్వానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా అర్జున్ & సానియా పెళ్లికి ఆహ్వానించారు. రాహుల్ గాంధీని కూడా సచిన్ ఇంట జరిగే పెళ్లికి ఆహ్వానించారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు.
పెళ్లి ఎప్పుడంటే?
అర్జున్ టెండుల్కర్ & సానియా చందోక్ నిశ్చితార్థం 2025 ఆగష్టులో జరిగింది. కాగా ఈ జంట మార్చి 5న పెళ్లి పీటలు ఎక్కనుంది. కాగా అంతకంటే ముందు మార్చి 3 నుంచి పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. సచిన్ ఇంట జరిగే ఈ పెళ్లికి ఎంతోమంది రాజకీయ, సినీ, పారిశ్రామిక, క్రికెట్ దిగ్గజాలు హాజరయ్యే అవకాశం ఉంది.
సచిన్ కుమారుడు అర్జున్ గురించి
ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్‌కు మారిన అర్జున్ టెండుల్కర్.. భారత క్రికెట్ సర్క్యూట్‌లో రెగ్యులర్‌గా కొనసాగుతున్నారు. దేశీయ క్రికెట్‌లో తనదైన శైలిని ఏర్పాటు చేసుకున్న అర్జున్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అయిన ఈయన.. 2022లో గోవా తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశారు. కాగా అర్జున్ వచ్చే సీజన్‌లో ఎల్‌ఎస్‌జీ జెర్సీని ధరించి మళ్లీ అందరి దృష్టిని ఆకట్టుకోనున్నాడు.
ఎవరీ సానియా చందోక్?
సానియా చందోక్ ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామిక కుటుంబానికి చెందిన యువతి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి డిగ్రీ పూర్తి చేసిన ఈమె.. గ్రావిస్ గ్రూప్ కంపెనీ అధినేత రవి ఘాయ్ మనువరాలు. ఈమెకు జంతువుల పట్ల మక్కువ ఎక్కువ. కాబట్టి వెటర్నటీ రంగంలో కూడా ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఫేమస్ ఐస్‌క్రీమ్ బ్రాండ్ బాస్కిన్ రాబిన్స్ కూడా వీరి కంపెనీకి చెందినదే కావడం గమనార్హం.
పెళ్లి ఎక్కడంటే?
అర్జున్ టెండుల్కర్ & సానియా చందోక్ పెళ్లి ముంబైలో మార్చి 5న జరగనుంది. పెళ్లి ఎక్కడ జరగనుంది అనే విషయం అధికారికంగా వెల్లడికాలేదు. అయితే ఈ జంట పెళ్లికి చాలా తక్కువ మంది ప్రముఖులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. అయితే పెళ్లికి ఎవరెవరు హాజరవుతారు అనే విషయం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటికి కొంతమంది ప్రముఖుల పేర్లు మాత్రమే వెల్లడయ్యాయి.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.