సమంత లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా సినిమా మా ఇంటి బంగారం. నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ట్రలాల మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత, రాజ్ నిడిమోరు & హిమాంక్ దువ్వూరు కలిసి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దీనికి సంబంధించిన్ ట్రైలర్‌ను మూవీ టీమ్ విడుదల చేయడం జరిగింది.
రెండో పెళ్లి తరువాత మొదటి సినిమా..
నటి సమంత రుత్ ప్రభు తన రెండో వివాహం తరువాత చేస్తున్న మొదటి చిత్రం ఇది. నాగచైతన్యతో 2021లో విడాకులు తీసుకున్న తరువాత తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు, నిందలు మోస్తూ వచ్చింది. ఇంటా, బయట అన్ని సోషల్ మీడియా వేదికలలోనూ ఎన్నో రకాల మాటలు భరిస్తూ వచ్చింది. అయితే ఈ పరిస్థితుల మధ్య తను ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మహానటి, ఓ బేబీ, యూ టర్న్, యశోద, జాను, శాకుంతలం, ఖుషి ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తోంది.
ఇదిలా ఉండగా.. గత సంవత్సరం 2025 డిసెంబర్‌లో సమంత.. ప్రొడ్యూసర్ రాజ్ నిడిమోరుతో కలిసి తన రెండో వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. పెళ్లి అయిన తరువాత తను చేస్తున్న మొదటి చిత్రం ఈ మా ఇంటి బంగారం. నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోంది. శ్యామ్, నందిని వీరిద్దరి కలయికలో ఇది రెండో సినిమాగా వస్తోంది. మునుపు వీరు ఓ బేబీ అనే సినిమా చేశారు. అది వారి ఇద్దరికీ కూడా మంచి విజయాన్ని అందించింది. ఇప్పుడు మా ఇంటి బంగారం మూవీ కూడా అదే విధంగా సక్సెస్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.
సొంత బ్యానర్‌పై సినిమా..
సమంత మా ఇంటి బంగారం సినిమాను తన సొంత బ్యానర్‌పై తానే నిర్మిస్తోంది. అయితే పోయిన ఏడాది శుభం అనే చిత్రాన్ని ఆమె ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ఇందులో కూడా తనకి మంచి అనుభవం ఉంది. భర్త రాజ్ నిడిమోరు కూడా సహ నిర్మాతగా ఉన్నారు మరియు కథ కూడా అందించారు. పెళ్లి కాకముందు ది ఫ్యామిలీ మ్యాన్ -2, సిటాడెల్,హనీ బన్నీ లాంటి వెబ్ సిరీస్‌లు వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. ఇక ఈ సినిమాకి సంగీతం అందించిన సంతోష్ నారాయణ్00 తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత ఆదరణ, గుర్తింపు కలిగిన మంచి సంగీత దర్శకుడు. అతని మ్యూజిక్ స్టైల్ మార్క్ ఈ మా ఇంటి బంగారం సినిమా ట్రైలర్‌లో కనిపిస్తోంది. మాటలు తక్కువ యాక్షన్ ఎక్కువ ఉన్న ఈ టీజర్‌కు మ్యూజిక్ బలంగా పనిచేసింది. చిత్రంలో శ్రీముఖి, గుల్షన్ దేవయ్య, గౌతమి లాంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు.
ఫుల్ యాక్షన్ మోడ్‌లో
మా ఇంటి బంగారం అనే టైటిల్‌కు సమంత సరిగ్గా సరిపోయింది అని చెప్పొచ్చు. ట్రైలర్ అద్భుతంగా ఉంది. పబ్లిక్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఒక సాధారణ కుటుంబ స్త్రీ గా వీడియో మొదటలో మనకు కనిపిస్తుంది.. కానీ చివరికి వచ్చే సరికి ఒక రెబల్ మాదిరిగా తయారవుతుంది. ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. చీర కట్టులోనే ఫైట్ సీన్స్ మొత్తం అద్భుతంగా చేసింది. ఇంట్లో మాత్రం అందరూ మెచ్చిన ఇల్లాలుగా బాగా నటించడం జరిగింది. ఈ చిత్రంలో మనం ఇంతకు ముందు ఎప్పుడు చూడని సమంతను చూస్తాము. ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉన్నట్టగా అర్థమవుతోంది. తుపాకులు పట్టుకుని ఊర మాస్‌గా కనిపిస్తున్న సమంత ఏ విధంగా ఆకట్టుకుంటుందో సినిమా విడుదల తరువాత తెలుస్తుంది.
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.