సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీల జాబితాలో నటి ‘సమంత‘ కూడా ఒకరు. ఆరోగ్యానికి సంబంధించిన లేదా ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు తాజాగా తాను పికిల్‌బాల్ అడుగుతున్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఒక ఇండోర్ స్టేడియంలో సమంత పికిల్‌బాల్ గేమ్ అడుగుతూ.. చాలా ఉత్సాహంగా ఉంది. ఈ ఆటలో గెలుపొందిన తరువాత చిన్న పిల్లలా గెంతుతూ వెళ్తుంది. నటి సమంత చాలా సంతోషంగా ఉండటం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో షేర్ చేస్తూ.. ”పికిల్‌బాల్ ఆడుతున్నప్పుడు డల్‌గా ఉండకండి” అని సమంత వెల్లడించింది. ప్రస్తుతం ఆ వీడియో చాలామంది నెటిజన్లను ఆకట్టుకుంది. సమంత ఆనందంగా ఉండటం చూసి.. అభిమానులు కూడా సంబరపడిపోతున్నారు. చివర్లో డ్యాన్స్ మాత్రం చాలా క్యూట్ మేడం అని ఒకరు కామెంట్ చేస్తే.. మై సూపర్ ఛాంపియన్ సమంత అని ఇంకొకరు అన్నారు.
పికిల్‌బాల్ గేమ్ గురించి
చాలామందికి పికిల్‌బాల్ గేమ్ గురించి తెలుసుండకపోవచ్చు. ఇది సమంత ఫేవరెట్ గేమ్ కూడా. దీనికి ఇండియాలో పెద్దగా ఆదరణ లేదు. కానీ అమెరికాలో పికిల్‌బాల్ ఆడేవాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది.
పికిల్‌బాల్ గేమ్ విషయానికి వస్తే.. ఇది టేబుల్ టెన్నిస్, బ్యాట్మింటన్ మాదిరిగానే ఉంటుంది. తూట్లు పడిన ఒక బాల్‌ను చిన్న బ్యాట్‌తో కొడతారు. ఈ ఆటను ఇండోర్ లేదా అవుట్డోర్లలో ఎక్కడైనా ఆడుకోవచ్చు. సింగిల్స్‌లో ఇద్దరు, డబుల్స్‌లో నలుగురు ఆడతారు. ఈ గేమ్‌కు ప్రపంచంలోని చాలా దేశాల్లో పెద్ద టోర్నీలు జరుగుతున్నాయి.
ఆటకు పికిల్‌బాల్ అనే వచ్చింది
నిజానికి పికిల్‌బాల్ అనే పేరు ఎందుకు వచ్చిందో చెప్పడానికి కొన్ని వాదనలు వినిపిస్తుంటాయి. అమెరికాకు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ తన కుటుంబంతో కలిసి ఈ గేమ్ ఆడారట, ఈ ఆట గురించి ఆయన భార్య జోన్, ఒక సందర్భంలో మాట్లాడుతూ.. రోయింగ్‌లో పికిల్‌బాల్ ఎలా ఉంటుందో.. ఆట కూడా ఆలా ఉంటుందని అన్నారు. ఈ కారణంగానే ఆటకు పికిల్‌బాల్ అని పేరొచ్చిందని చెబుతారు.
ప్రిట్చర్డ్ అనే వ్యక్తికి పికిల్స్ అనే పేరు కలిగిన పెంపుడు శునకం ఉండేది. తన యజమాని ఆట ఆడుకుంటున్నప్పుడు, బాల్ అందిస్తూ ఉండేది. ఈ శునకం పేరునే.. ఆ తరువాత పికిల్‌బాల్ ఆటకు పెట్టినట్లు కొందరు చెబుతారు. అయితే ఈ ఆటకు ఈ పేరు ఎలా వచ్చిందనే విషయం మీద మాత్రం ఎలాంటి ఖచ్చితమైన క్లారిటీ లేదు.
సమంత ఫిట్నెస్ గురించి
ప్రముఖ నటి సమంత గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే పాపులర్ సెలబ్రిటీలలో ఒకరైన ఈమె ఎప్పుడూ ఆరోగ్యం మీద శ్రద్ద తీసుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగానే ప్రతి రోజూ వ్యాయాయం వంటివి.. క్రమం తప్పకుండా చేస్తుంటారు. సరైన డైట్ పాటిస్తూ.. ఎప్పుడూ ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకునే సమంత.. అప్పుడప్పుడు తనకు ఇష్టమైన పికిల్‌బాల్ గేమ్ కూడా ఆడుతుంటారు. నిజానికి పికిల్‌బాల్ గేమ్ ఒకటి ఉందని.. సమంత వల్లనే చాలామందికి తెలిసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
శౌర్య వర్ధన్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సినిమా, రాజకీయం వంటి విభిన్న అంశాలపై సమగ్రమైన ఆర్టికల్స్ అందిస్తూ వస్తున్నాను. ఈ రంగంలో నాకు నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది. రాయడంలో నైపుణ్యంతో, చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.