చిత్ర సీమలో పరిచయం అవసరం లేని హీరోయిన్స్ పేర్లలో సమంత ఒకరు. ఏమాయ చేసావే సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. ఆ తరువాత దిగ్గజ నటుల సరసన నటించి.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు వరుస సినిమాలతో కాకుండా.. ఎప్పుడో ఒకటి అన్నట్టుగా సినిమాల్లో నటింస్తోంది. దీనికి గల కారణాన్ని కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
సినిమాలు తగ్గించుకోవడానికి కారణం ఏమిటంటే?
విజవంతమైన నటీమణులలో ఒకరైన సమంత.. ప్రస్తుతం తన కెరీర్లో ఓ కొత్త దశను స్వీకరించినట్లు, దీనికి కారణం ఆరోగ్యం మీద శ్రద్ద చూపడమే అని తెలుస్తోంది. పని భారాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలని.. తనకు అనుగుణంగా ఉన్న ప్రాజెక్టులను మాత్రమే స్వీకరించాని నిర్ణయించుకున్నట్లు సమంత ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నేను చాలావరకు నాకు ఇష్టమైన పనులను చేస్తాను. అందులో ఫిట్నెస్, సినిమాలు రెండూ ఉన్నాయి. నేను చాలా సినిమాలు, సిరీస్‌లలో నటించాను. అవన్నీ నా ఫ్యాషన్ ప్రాజెక్టులు కాదని అన్నారు.
ఇప్పుడు నేను చేసే ప్రతి పని, నేను పెట్టుబడి పెట్టే ప్రతి వ్యాపారం, నేను నిర్మించే ప్రతి సినిమా నా హృదయంలో ఉన్నాయి. ఇకపై ఒకేసారి మల్టిపుల్ ప్రాజెక్టులు తీసుకోను. ఎందుకంటే శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నట్లు సమంత పేర్కొన్నారు. నా శరీరం చెప్పిందే వినాలనుకుంటున్నాను. అందుకే పనిని తగ్గించుకున్నానని ఆమె స్పష్టం చేసారు.
ప్రొడ్యూసర్‌గా సమంత
నటి సమంత ఖుషి సినిమా తరువాత.. మా ఇంటి బంగారం అనే సినిమాలో నటింస్తోంది. ఓ వైపు విజయవంతమైన నటిగా కీర్తి పొందిన సమంత.. శుభం సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించి సక్సెస్ సాధించింది. ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ సినిమాల్లో కూడా నటించి.. పాపులర్ అయింది.
మోడలింగ్ నుంచి హీరోయిన్
తమిళనాడులో జన్మించిన సమంత.. తమిళం, తెలుగు అనర్గళంగా మాట్లాడగలదు. హొలీ ఏంజిల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకుంది. ఆ తరువాత స్టెల్లా మారిస్ కాలేజీలో వాణిజ్యంలో డిగ్రీ పూర్తి చేసింది. సమంత అండర్ గ్యాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసే సమయానికి మోడలింగ్ చేయడం మొదలుపెట్టింది. ఆ తరువాత కాలంలో.. ఏ మాయ చేసావే సినిమాలో మొదటిసారి తెరపై కనిపించింది. ఆ తరువాత 2013లో ఐదు సినిమాల్లో నటించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తరువాత సినిమాలలో నటించడం చాలా వరకు తగ్గించింది.
వ్యాపారాల్లో పెట్టుబడి & రెమ్యునరేషన్ వివరాలు
సమంత సినిమాల్లో నటిస్తూనే.. సాకి, సస్టైన్‌కార్ట్, నౌరీష్ యూ, వరల్డ్ పికెల్‌బాల్ లీగ్ వంటి వాటిలో కూడా పెట్టుబడి పెట్టింది. వ్యాపార సామ్రాజ్యంలో కూడా మంచి లాభాలను గడిస్తున్న సమంత.. ఒక్కో సినిమాకు గానూ రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. మొత్తం మీద సినిమాల్లో నటిస్తూ.. వ్యాపార రంగంలో రాణిస్తూ.. తనదైన రీతిలో సమంత ముందుకు సాగుతోంది. అయితే మళ్ళీ వరుస సినిమాలతో కనిపించాలనీ.. ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.






