మెగా ఫ్యామిలీలో మరొకరు పెళ్లిపీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే అధికారికంగా వెల్లడించినట్లు సమాచారం. గత ఏడాదే వరుణ్ తేజ్ పెళ్లి జరిగింది. ఇక సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ పెళ్లి చేసుకోవడానికి సన్నద్ధమయ్యారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
పెళ్లిపై క్లారిటీ..
నటుడు సాయిధరమ్ తేజ్.. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెళ్లిపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాదిలో నా పెళ్లి ఉంటుందని అన్నారు. మంచి జీవితాన్ని, మంచి చిత్రాలను అందించిన భగవంతునికి కృతఙ్ఞతలు. కొత్త ఏడాది వస్తోంది. ఆ దేవదేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చే ఏడాది నేను నటించిన సంబరాల ఏటిగట్టు సినిమా రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను.
సంబరాల ఏటిగట్టు
సాయిధరమ్ తేజ్ నటించిన సంబరాల ఏటిగట్టు సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది. నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం.. రోహిత్ కేపీ దర్శకత్వంలో విడుదల కానుంది. ఇంకా ఈ సినిమాలో అనన్య నాగేళ్ల, జగపతిబాబు, శ్రీకాంత్, సాయికుమార్ కూడా కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం చిత్ర బృందం భారీగా ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఈ చిత్రం తన జీవితంలో చాలా ముఖ్యమైందని గతంలో జరిగిన ఒక కార్యక్రమంలో.. సాయిధరమ్ తేజ్ స్పష్టం చేశారు.
నటుడు సాయిధరమ్ తేజ్
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ గురించి అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈయన 2014లో పిల్లా నువ్వు లేని జీవితం అనే సినిమాతో.. తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టారు. ఆ తరువాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, విన్నర్, జవాన్, చిత్రలహరి, ప్రతిరోజూ పండగే, విరూపాక్ష వంటి సినిమాల్లో నటించారు. బ్రో సినిమాలో.. పవన్ కళ్యాణ్ & సాయిధరమ్ తేజ్ ఇద్దరూ కలిసి కనిపించారు. కాగా ఇప్పుడు సంబరాల ఏటిగట్టు సినిమాతో కనిపించనున్నారు. ఈయన సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్, సంతోషం ఫిల్మ్ అవార్డు, సినిమా అవార్డు వంటివి గెలుచుకున్నారు.
ఐశ్వర్య లక్ష్మి గురించి
బహుశా ఐశ్వర్య లక్ష్మి గురించి చాలామందికి తెలిసుండకపోవచ్చు. కానీ 2022లో రిలీజ్ అయిన అమ్ము సినిమాలో కనిపించింది. కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన ఈమె.. ప్రారంభంలో మలయాళం, తమిళ సినిమాల్లో నటించింది. ఆ తరువాత తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఈమె ఒక కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు, మూడు సైమా అవార్డులను మాత్రమే కాకుండా.. ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డు సౌత్ కూడా అందుకుంది.
ఈమె పొన్నియమ్ సెల్వం సినిమాలో కూడా నటించింది. ఆ తరువాత అనేక సినిమాల్లో నటిస్తూ.. అత్యధిక పారితోషికం తీసుకుంనే మలయాళీ నటిగా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా ఇప్పుడు సాయిధరమ్ తేజ్ సరసన సంబరాలు ఏటిగట్టు సినిమాలో కనిపించనుంది. ఈ సినిమా 2026లో రిలీజ్ అవుతుందని సమాచారం. అయితే ఏ నెలలో రిలీజ్ అవుతుందనే విషయం మాత్రం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
హిమాన్షు కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, సినీ రంగాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలను అందిస్తున్నారు. గతంలో ఆయన ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, రాజకీయాలు, క్రికెట్ వార్తలు రాశారు. హైపర్ లోకల్ న్యూస్ రైటింగ్‌లో అనుభవం కలిగిన ఆయన వీడియో టీమ్‌తో కూడా పని చేసిన అనుభవం కలిగి ఉన్నారు. జర్నలిజం రంగంలో 14 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆయన ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించిన ఆర్టికల్స్ రాశారు.