ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రేడ్ మరియు రిటెన్షన్ ముగియడంతో ప్రాంచైజీలు ఆయా ఆటగాళ్ళను ఆక్షన్‌లోకి వదిలేసారు. ఎవరిని ట్రేడ్ చేశారు. ఎవరిని అలాగే నిలుపుకున్నారు అనేది తేలిపోయింది. దీంతో ఇప్పటి నుంచే అభిమానుల్లో ఐపీఎల్ హీట్ మొదలయిపోయింది. అయితే ఇప్పుడు సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు మారడంపైనే అందరు చర్చించుకుంటున్నారు.
సీఎస్కేకు సంజు శాంసన్
రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్‌ను సీఎస్కేకు ఇవ్వగా, సీఎస్కే రవీంద్ర జెడేజా మరియు సామ్ కరన్‌ను ఆర్ఆర్ టీముకు ఇచ్చేసింది. సంజుని 18 కోట్ల రూపాయలకు సీఎస్కే తీసుకోగా, జడేజాను రూ. 14 కోట్లకు, సామ్ కరన్‌ను రూ. 2.4 కోట్లకు ఆర్ఆర్ తీసుకుంది. ఈ విధంగా రెండు జట్లు కూడా ఒప్పందం కుదర్చుకున్నారు. దీంతో కొంతమంది అభిమానుల్లో నిరాశ, కొంతమందిలో సంతోషం నెలకొనింది.
రాజస్థాన్ రాయల్స్ ప్రాంచైజీతో తన ఐపీల్ కెరియర్ను ప్రారంభించాడు సంజు శాంసన్. 2013 సంవత్సరంలో దాదాపు పంతోమ్మిదేళ్ల ప్రాయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి 2016 – 2017(డీసీ) మినహా మిగతా అంతా ఆర్ఆర్తోనే కొనసాగాడు. 2012లో కేకేఆర్.. అతన్ని పది లక్షల రూపాయలకు కొనుగోలు చేసినప్పటికీ కూడా కనీసం అతను అందులో ఒక్కటంటే ఒక్క ఆట కూడా ఆడకపోవడం గమనార్హం. కాబట్టి ఎవరు ఆ విషయాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటారు.
2021లో ఆర్ఆర్ కెప్టెన్
2022లో టీమును ఫైనల్‌కు చేర్చాడు. అక్కడ రన్నరప్‌గా నిలిచింది. తరువాత 2024లో ప్లే ఆఫ్స్‌లో నిలిపాడు. ఇక 2021లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. అప్పటి నుంచి 2025 ఐపీల్ వరకు అదే పొజిషన్లో కొనసాగాడు. 2026 ఐపీల్ ట్రేడ్ మరియు రిటెన్షన్ కారణంగా రాజస్థాన్ రాయల్స్‌ను వీడి చెన్నై సూపర్ కింగ్స్‌లోకి చేరాడు.
ఇప్పటి వరకు ఐపీల్ కెరియర్లో సంజు శాంసన్ 177 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 172 ఇన్నింగ్స్ ఉన్నాయి. మొత్తం 4,704 పరుగులు తీశాడు. హైయస్ట్ స్కోర్ 119, మూడు సేంచెరీలు, 26 అర్ధ సెంచరీలు, 219 సిక్స్‌లు, 379 ఫోర్లు, వికెట్ కీపర్‌గా 80 క్యాచ్‌లు పట్టాడు.
12ఏళ్ల బంధం
రాజస్థాన్ రాయల్స్ ప్రాంచైజీతో ఉన్న 12 సంవత్సరాల బంధాన్ని వీడి సీఎస్కేకు వెళుతున్న వేళ సంజు శాంసన్ ఆర్ఆర్ ఒక బావోద్వేగభరితమైన జ్ఞాపకాల వీడియోను విడుదల చేసింది. అందులో రాజస్థాన్ రాయల్స్ తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు.
ఆటగాళ్లు అందరు సంజుతో ప్రయానాన్ని గొప్పగా, ప్రేమగా, అభిమానంతో చెప్పుకొచ్చారు. సంజుకి వీడ్కోలు తెలుపుతూ “నువ్వు నీలి దుస్తుల్లో చిన్న పిల్లవాడిగా నడుచుకుంటూ వచ్చావు, కానీ ఈరోజు మేము ఒక కెప్టెన్‌కు, ఒక నాయకుడికి వీడ్కోలు పలుకుతున్నాము, నీ ప్రయాణంలో మేము ఒక భాగం అవడమనేది మా అదృష్టంగా భావిస్తున్నాము” అని ఆర్ఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. రాజస్థాన్ రాయల్స్ అభిమానులు బాధపడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు సంతోషపడుతున్నారు. ఏది ఏమైనా సంజు శాంసన్ అభిమానులు మాత్రం.. ఇకపై ఎలా ఆట ఆడనున్నారు అనేదాని గురించి ఆలోచిస్తున్నారు.
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.