Social Media Influencer Buys Suzuki Hayabusa Superbike: ఖరీదైన బైకులు, కార్లంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ ఇష్టమే. అయితే వీటిని అందరూ కొనుగోలు చేస్తారా? అంటే.. అది మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. ఇటీవల ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓ ఖరీదైన బైకును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కమనిస్తే.. ఒక యువతి బైక్ చుట్టూ ఉన్న మెటల్ గార్డ్ తొలగిస్తుంది. ఆ తరువాత దానిని కప్పివున్న ఒక తెల్లటి షీట్ కూడా తొలగిస్తుంది. ఈమెతో పాటు మరో ఇద్దరు కూడా ఈ బైకును డెలివరీ తీసుకునే దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు. యువతి కొనుగోలు చేసిన బైక్ మెటాలిక్ థండర్ గ్రే కలర్ పొంది ఉండటం చూడవచ్చు.
నిజానికి సుజుకి హయబుసా అనేది కంపెనీ యొక్క అత్యంత ఖరీదైన బైక్. దీనిని జపాన్‌లోని టోక్యోలో తయారు చేస్తారు. అయితే ఈ బైకుని కంప్లీట్ నాక్డ్ డౌన్ (CKD) మార్గం ద్వారా మనదేశానికి దిగుమతి చేసుకుంటారు. దిగుమతి చేసుకోవడం వల్ల దీని ధర కొంత ఎక్కువగా ఉంటుంది. ఈ బైకు ధర ఎక్కువగా ఉండటం వల్ల చాలా తక్కువమంది మాత్రమే దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కొనుగోలు చేసిన బైక్ మెటాలిక్ థండర్ గ్రే కలర్‌లో అద్భుతంగా ఉండటమే కాకుండా అక్కడక్కడా రెడ్ కలర్ డెకాల్స్ పొందింది. ఇవి దీనిని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. ఈ బైక్ ఎవ్వరినైనా ఒక్క చూపుతోనే ఫిదా చేసే డిజైన్ కలిగి ఉంది. అందుకే దీనిని చాలామంది ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు.
సుజుకి హయబుసా (Suzuki Hayabusa)
ప్రస్తుతం మార్కెట్లో సుజుకి హయబుసా రెండు వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. అవి స్టాండర్డ్ మరియు 25వ యానివెర్సరీ ఎడిషన్. స్టాండర్డ్ హయబుసా మోడల్ ధర రూ. 16.91 లక్షలు. 25వ యానివెర్సరీ ఎడిషన్ ధర రూ. 17.70 లక్షలు (ఎక్స్ షోరూమ్). సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కొనుగోలు చేసిన బైక్ స్టాండర్డ్ మోడల్ అని తెలుస్తోంది.
సుజుకి హయబుసా యొక్క రెండు వేరియంట్లు 1340 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 190 Bhp పవర్ మరియు 142 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ ట్విన్ స్పార్ అల్యూమినియం ఫ్రేమ్‌పై నిర్మించబడి ఉంటుంది. హయబుసా మొత్తం బరువు 264 కేజీలు మాత్రమే. ఇది బ్రెంబో స్టైల్మా బ్రేక్ కాలిపర్‌లతో వస్తుంది. అంతే కాకుండా హయబుసా బైక్ సిక్స్ యాక్సిస్ ఐఎంయూ, 10 లెవెల్స్ ట్రాక్షన్ కంట్రోల్ మరియు 10 లెవెల్స్ యాంటీ విలీ కంట్రోల్‌తో వస్తుంది.
హయబుసా బైక్ త్రీ లెవెల్ ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ మరియు మూడు పవర్ మోడ్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో లాంచ్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కర్నారింగ్ ఏబీఎస్ మరియు హిల్ హోల్డ్ కంట్రోల్ వంటివి కూడా ఉంటాయి. కాగా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో కొత్త తరం హయబుసా టీఎఫ్‌టీ డిజిటల్ డిస్‌ప్లే మరియు ఎల్ఈడీ లైట్స్ పొందుతుంది.
Don’t Miss: హీరో ‘అజిత్ కుమార్’ రేసింగ్ టీమ్.. అంతర్జాతీయ పోటీలకు సిద్ధం! – ఫోటోలు చూడండి
జాన్ అబ్రహం సుజుకి హయబుసా
ప్రముఖ నటుడు జాన్ అబ్రహం గ్యారేజిలో హయబుసా బైక్ ఉంది. దీనిని షారుక్ ఖాన్ గిఫ్ట్ ఇచ్చినట్లు.. వేద ప్రమోషన్ ఇంటర్వ్యూలో జాన్ స్వయంగా వెల్లడించారు. జవాన్ సినిమా విజయం సాధించిన తరువాత ఈ బైకును గిఫ్ట్ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఈయన గ్యారేజిలో ఖరీదైన హయబుసా మాత్రమే కాకుండా.. అత్యంత విలాసవంతమైన కార్లు, బైకులు కూడా చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. జాన్ అబ్రహం కాకుండా ఇతర ఏ సెలబ్రిటీ గ్యారేజీలోనూ హయబుసా లేదనే తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. హయబుసా వినియోగించే సెలబ్రిటీల సంఖ్య కూడా చాలా తక్కువనే తెలుస్తోంది.