సన్నీలియోన్‌ గ్యారేజీలో ఇన్ని కార్లున్నాయా? ఒక్కో కార్‌ రేటు చూస్తే మతిపోవడం ఖాయం!

Sunny Leone Stunning Car Collection: సన్నీలియోన్ (Sunny Leone).. అంటే చాలామందికి ఓ సినీనటిగా లేదా శృంగార తారగా మాత్రమే తెలిసి ఉంటుంది. కానీ ఈమె ఒక ఆటోమొబైల్ ఔత్సాహికురాలు కూడా.. ఈ కారణంగానే ఈమె గ్యారేజిలో అనేక ఖరీదైన కార్లు ఉన్నాయి.

మసెరటీ ఘిబ్లీ నెరిస్సిమో (Maserati Ghibli Nerissimo)

సన్నీలియోన్ గ్యారేజిలోని ఖరీదైన కార్లలో ఒకటి మసెరిటీ కంపెనీకి చెందిన ‘ఘిబ్లీ నెరిస్సిమో’ ఒకటి. దీని ధర రూ. 1 కోటి కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ఈ కారును సన్నీలియోన్ 2017లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈమె అమెరికాను సందర్శించిన సమయంలో మసెరటీ ఘిబ్లీ నెరిస్సిమో కొనుగోలు చేశారు. కంపెనీ ఈ కారును ప్రపంచ వ్యాప్తంగా 450 యూనిట్లు మాత్రమే విక్రయించింది. అంతే ఈ కారు కేవలం 450 మంది మాత్రమే కొనుగోలు చేసినట్లు సమాచారం.

స్పెషల్ ఎడిషన్ అయిన మసెరటీ ఘిబ్లీ నెరిస్సిమో కారును కంపెనీ అమెరికా, కెనెడాలలో మాత్రమే విక్రయించినట్లు సమాచారం. ఈ కారు అద్భుతమైన డిజైన్ కలిగి ఉత్తమ ఫీచర్స్ పొందుతుంది. ఇది 3.0 లీటర్ ట్విన్ టర్బో వీ6 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 345 నుంచి 404 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

మసెరటీ క్వాట్రోపోర్టే (Maserati Quattropote)

సన్నీలియోన్ గ్యారేజిలోని మరో మసెరటీ బ్రాండ్ కారు క్వాట్రోపోర్టే. సుమారు రూ. 1.74 కోట్ల విలువైన ఈ కారు విలాసవంతమైన ఫీచర్స్ పొందుతుంది. చూడగానే ఆకర్షించబడే ఈ కారు అత్యద్భుతమైన డిజైన్ పొందుతుంది. దీనిని ఈమె 2014లో కొనుగోలు చేసినట్లు సమాచారం. క్వాట్రోపోర్టే కారులో కంపెనీ 4691 సీసీ ఇంజిన్ పొందుపరిచింది. ఇది 440 హార్స్ పవర్ మరియు 490 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 270 కిమీ కావడం గమనార్హం.

బీఎండబ్ల్యూ 7 సిరీస్ (BMW 7 Series)

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 7 సిరీస్ కూడా ఆమె తన అమెరికన్ గ్యారేజిలో ఉన్నట్లు సమాచారం. ఇది బీఎండబ్ల్యూ 7 సిరీస్ యొక్క టాప్ మోడల్. దీని ధర రూ. 1.93 కోట్లు అని తెలుస్తోంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు అధునాతన ఫీచర్స్ పొందుతుంది.

సన్నీలియోన్ గ్యారేజిలోని బీఎండబ్ల్యూ 7 సిరీస్ మోడల్ 3.0 లీటర్ టర్బోఛార్జ్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. కాబట్టి ఇది అద్భుతమైన పనితీరును అందిస్తుంది. నిజానికి భారతీయ మార్కెట్లో కూడా ఈ మోడల్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. సెలబ్రిటీలు కూడా ఈ కారును ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు.

ఆడి ఏ5 (Audi A5)

గ్లోబల్ మార్కెట్లో అత్యుత్తమ ప్రజాదరణ పొందిన ఆడి కంపెనీ యొక్క కార్లను సెలబ్రిటీలు మాత్రమే కాకుండా పారిశ్రామికవేత్తలు, క్రికెటర్లు కూడా ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ఈ కారు పాపులర్ నటి సన్నీ లియోన్ గ్యారేజిలో కూడా ఉంది. సన్నీలియోన్ ఆడి ఏ5 ధర రూ. 72 లక్షలు.

గ్లోబల్ మార్కెట్లో ఎంతోమందికి ఇష్టమైన ఈ ఆడి ఏ5 కారు 2.0 లీటర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 252 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, లేదా 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ కారణంగానే ఎక్కువమంది దీన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

మెర్సిడెస్ జెఎల్350డీ (Mercedes JL350D)

సన్నీలియోన్ గ్యారేజిలోని మరో లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్ యొక్క జెఎల్350డీ. ఈ జర్మన్ బ్రాండ్ కారు ధర రూ. 70 లక్షల వరకు ఉంది. లేటెస్ట్ డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు 1950 సీసీ 4 సిలిండర్ ఇన్‌లైన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 192 హార్స్ పవర్ మరియు 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 16.1 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. ఇది కేవలం ఏడు నిమిషాల.. ఎనిమిది సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. పనితీరుపరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.

Don’t Miss: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ‘పవన్ కళ్యాణ్’ వాహన ప్రపంచం చూశారా!.. ఓ లుక్కేసుకోండి

ఎంజీ గ్లోస్టర్ (MG Gloster)

భారతదేశంలో అతి తక్కువ కాలంలో అధిక ప్రజాదరణ పొందిన ఎంజీ మోటార్స్ యొక్క గ్లోస్టర్ కూడా సన్నీ లియోన్ గ్యారేజిలో ఉంది. ఈమె కేవలం మసెరటీ కార్లను మాత్రమే కాకుండా ఎంజీ గ్లోస్టర్ కారును కలిగి ఉన్నారు. ఇది అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇది 2.0 లీటర్ సింగిల్ టర్బో డీజిల్ ఇంజిన్ (163 పీఎస్ పవర్ మరియు 375 న్యూటన్ మీటర్ టార్క్) మరియు 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్ (218 హార్స్ పవర్ మరియు 480 న్యూటన్ మీటర్ టార్క్) పొందుతుంది.