ప్రముఖ వాహన తయారీ సంస్థ.. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మిబిలిటీ లిమిటెడ్ చాలా రోజుల నిరీక్షణ తరువాత పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేసింది. ఇది బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) కింద కూడా లభిస్తుంది. ఇంతకీ దీని ధర ఎంత?, టాటా పంచ్ సాధారణ ఈవీకి, పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌కు మధ్య తేడా ఏమిటనేది ఇక్కడ తెలుసుకుందాం.
ఐదు వేరియంట్ & ధరలు ఇలా
ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి స్మార్ట్, స్మార్ట్ ప్లస్, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ ప్లస్ ఎస్. వీటి ధరలు రూ. 9.69 లక్షల నుంచి రూ. 12.59 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. అయితే దీనిని బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ కింద రూ. 6.49 లక్షలకు కొనుగోలు చేయవచ్చు.
డిజైన్ ఎలా ఉందంటే?
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ చూడటానికి.. సాధారణ ఈవీ మాదిరిగా ఉన్నప్పటికీ, కొంత అప్డేటెడ్ డిజైన్ గమనించవచ్చు. స్టాండర్డ్ ఈవీలో కనిపించే బ్లాక్ స్ట్రిప్ ఇప్పుడు.. కొత్త కారులో కనిపించదు. బాడీ కలర్ ప్యానెల్‌లోనే క్లోజ్డ్ ఆఫ్ ఏరియా కనిపిస్తుంది. కాగా డీఆర్ఎల్ స్థానం కూడా మారింది. బంపర్ డిజైన్ కూడా కొంత అప్డేట్ పొంది ఉండటం గమనించవచ్చు. ఇది చూడటానికి కొంత నెక్సాన్ ఈవీ, హారియార్ ఈవీ కార్లను తలపిస్తుంది.
సైడ్ ప్రొఫైల్ గమనిస్తే.. ఇక్కడ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉండటం చూడవచ్చు. సిల్హౌట్ అలాగే ఉన్నప్పటికీ.. వెనుక డిజైన్ కూడా కొంత మార్పు చెంది ఉండటం చూడవచ్చు. ఇది ఏడు రంగుల్లో లభిస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 195 మిమీ కాగా, వాటర్ వాడింగ్ కెపాసిటీ 450 మిమీ వరకు ఉంది. ఈ కారు బరువు 1360 కేజీలు. అయితే ఇది మంచి పనితీరును అందిస్తుంది.
ఇంటీరియర్ ఫీచర్స్ ఇలా..
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ చాలా వరకు అప్డేట్ అయింది. లోపల 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఇల్యూమినేటెడ్ లోగోతో టూ స్పోక్ స్టీరింగ్ వీల్ ఉండటం ఇందులో గమనించవచ్చు. సెంటర్ కన్సోల్‌లో టచ్ ఆపరేటేడ్ కంట్రోల్స్ మాత్రమే కాకుండా.. రోటరీ డయల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, క్రూయిజ్ కంట్రోల్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్ వంటివన్నీ ఉన్నాయి.
సేఫ్టీ కోసం.. ఆరు ఎయిర్‌బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా, రియర్ వైపర్, డీఫాగర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ మౌంట్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం మొదలైనవి ఉన్నాయి.
బ్యాటరీ & రేంజ్ వివరాలు
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ కారు 40 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. ఇది 7.2 కేడబ్ల్యు, 3.3 కేడబ్ల్యు ఛార్జర్ వంటి వాటికి మాత్రమే కాకుండా 65 కేడబ్ల్యు డీసీ ఫాస్ట్ ఛార్జర్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 26 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఈ కారు ఒక ఫుల్ ఛార్జితో 468 కిమీ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే వాస్తవ ప్రపంచంలో రేంజ్ కొంత తగ్గవచ్చు.
కంపారిజన్
పాత పంచ్ ఈవీకి.. 2026 పంచ్ ఈవీకి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. ఇందులో కేవలం ధరలు మాత్రమే కాకుండా.. బ్యాటరీ ఆప్షన్ కూడా. ఓల్డ్ మోడల్ 25 కిలోవాట్, 35 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలతో లభిస్తే.. కొత్త మోడల్ 40 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. డిజైన్ & ఫీచర్స్ విషయాల్లో కూడా సూక్షమైన అప్డేట్స్ ఉండటం ఇక్కడ చూడవచ్చు.
శౌర్య వర్ధన్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సినిమా, రాజకీయం వంటి విభిన్న అంశాలపై సమగ్రమైన ఆర్టికల్స్ అందిస్తూ వస్తున్నాను. ఈ రంగంలో నాకు నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది. రాయడంలో నైపుణ్యంతో, చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.