చెప్పినట్లుగానే టాటా మోటార్స్.. తన సియెర్రా కారు ధరలను అధికారికంగా వెల్లడించింది. ఇప్పటికే దాదాపు అన్ని వివరాలను వెల్లడించిన కంపెనీ.. ఇప్పుడు బుకింగ్ డేట్, డెలివరీలకు సంబంధించిన వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ధరలు & వేరియంట్స్
టాటా మోటార్స్ లాంచ్ చేసిన కొత్త సియెర్రా ధరలు రూ. 11.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది కేవలం ఒక వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. సంస్థ దీనికోసం డిసెంబర్ 16 నుంచి బుకింగ్స్ స్వీకరించనుంది. డెలివరీలు 2026 జనవరి 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
మూడు ఇంజిన్ ఎంపికలు
చూడటానికి అద్భుతమైన డిజైన్ కలిగిన టాటా సియెర్రా.. మూడు ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. అవి 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ (106 పీఎస్ పవర్ & 145 ఎన్ఎమ్ టార్క్), 1.5 లీటర్ టర్బో పెట్రోల్ (160 పీఎస్ పవర్ & 255 ఎన్ఎమ్ టార్క్), 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ (118 పీఎస్ పవర్ & 280 ఎన్ఎమ్ టార్క్). ఇవి ఉత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం.
డిజైన్ ఎలా ఉందంటే?
టాటా సియెర్రా కారు.. బాక్సీ డిజైన్ పొందుతుంది. ఇందులో నిలువగా ఉండే లైటింగ్ సెటప్ చూడవచ్చు. కారుపైన సియెర్రా అక్షరాలను చూడవచ్చు. బంపర్‌లో ఇంటిగ్రేటెడ్ స్కిడ్ ప్లేట్ & రెండు ఫాగ్ ల్యాంప్ కూడా ఉన్నాయి. హై సెట్ బోనెట్, స్క్వేర్డ్ ఆల్ ఆర్చ్‌లు, మందపాటి బీ-పిల్లర్ కూడా ఇందులో గమనించవచ్చు. స్పేర్ వీల్ టెయిల్‌గేట్‌పై కనిపించదు.. పైగా కింద భాగంలో ఫిక్స్ చేయబడి ఉంది. వెనుక భాగంలో ఎల్ఈడీ లైట్ బార్, ఇల్యూమినేషన్‌తో ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. 17 ఇంచెస్ స్టీల్ వీల్స్ ఇందులో ఉన్నాయి.
కలర్ ఆప్షన్స్ & పరిమాణం
టాటా సియెర్రా కారు కూర్గ్ క్లౌడ్, ప్రిస్టైన్ వైట్, ప్యూర్ గ్రే, అండమాన్ అడ్వెంచర్, మున్నార్ మిస్ట్, బెంగాల్ రూజ్ అనే ఆరు రంగుల్లో లభిస్తుంది.
ఇక పరిమాణం విషయానికి వస్తే.. బాక్స్ మాదిరిగా ఉండే సియెర్రా.. పొడవు 4340 మిమీ, వెడల్పు 1841 మిమీ, ఎత్తు 1715 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 205 మిమీ, బూట్ స్పేస్ 622 లీటర్లు, వీల్‌బేస్ 2730 మిమీ వరకు ఉంటుంది. పరిమాణం పరంగా ఇది ఉత్తమంగా ఉంటుంది. కాబట్టి ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంటుంది.
ఇంటీరియర్ ఫీచర్స్ ఇలా..
టాటా సియెర్రా డాష్‌బోర్డ్ మూడు డిస్ప్లేలను పొందుతుంది. ఒకటి డ్రైవర్ కోసం.. మిగిలిన రెండు ఇన్ఫోటైన్మెంట్ కోసం. ఇందులోని ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్, ఇందులో ప్రకాశవంతమైన లోగో.. టచ్ సెన్సిటివ్ కంట్రోల్స్, 12 స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టం, ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ సోనిక్‌షాఫ్ట్ సౌండ్‌బార్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్లెస్ ఛార్జర్, రియర్ సన్‌షేడ్స్, వెంటిలేటెడ్ అండ్ పవర్డ్ ఫ్రంట్ సీటు మొదలైనవి ఉన్నాయి.
భద్రతకు పెద్దపీట వేసే టాటా మోటార్స్.. ఇప్పుడు సియెర్రా కారులో కూడా అందించింది. ఇందులో డ్యూయెల్ బ్లైండ్ స్పాట్ డిటెక్టర్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్‌బెల్ట్ యాంకర్ ఫ్రీ టెన్షన్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, లెవెల్ 2 ఏడీఏఎస్ సూట్ కూడా ఇందులో ఉన్నాయి. పిల్లల భద్రతా కోసం ఐసోఫిక్స్ టెథర్‌లు, 3 పాయింట్ ఈఎల్ఆర్ సీట్ బెల్ట్ మొదలైనవి ఉన్నాయి.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.