ప్రపంచంలో అత్యంత ధనవంతులైన హీరోయిన్స్: జాబితాలోని ఇండియన్స్ వీళ్లే!

2025 ముగుస్తున్న తరుణంలో.. గ్లోబల్ స్టాటిస్టిక్స్ ప్రపంచంలో అత్యంత ధనవంతులైన 20మంది హీరోయిన్స్ ఎవరనే జాబితా రిలీజ్ చేసింది. ఇందులో మన దేశానికి (భారత్) చెందిన ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఎక్కువమంది అమెరికాకు చెందిన హీరోయిన్స్ కాగా.. ఒక చైనా హీరోయిన్, ఇద్దరు ఆస్ట్రేలియన్ హీరోయిన్స్, ఒక యూకే హీరోయిన్ ఉన్నారు.

జాబితా & సంపద

➤జామీ గెర్ట్జ్ (అమెరికా): 12 బిలియన్ డాలర్స్
➤ఓప్రా విన్‌ఫ్రే (అమెరికా): 3.1 బిలియన్ డాలర్స్
➤సెలీనా గోమెజ్ (అమెరికా): 1 బిలియన్ డాలర్స్
➤జావో వీ (చైనా): 500 మిలియన్ డాలర్స్
➤జెన్నీఫర్ లోఫెజ్ (అమెరికా): 400 మిలియన్ డాలర్స్
➤రీస్ విథర్‌స్పూన్ (అమెరికా): 400 మిలియన్ డాలర్స్
➤విక్టోరియా ప్రిన్సిపాల్ (అమెరికా): 350 మిలియన్ డాలర్స్
➤జెన్నిఫర్ అనిస్టన్ (అమెరికా): 320 మిలియన్ డాలర్స్
➤జూలియా రాబర్స్ (అమెరికా): 250 మిలియన్ డాలర్స్
➤జూలియా లూయిస్ డ్రేఫర్ (అమెరికా): 250 మిలియన్ డాలర్స్
➤జెస్సికా బీల్ (అమెరికా): 250 మిలియన్ డాలర్స్
➤క్రిష్టా మిల్లర్ (అమెరికా): 250 మిలియన్ డాలర్స్
➤మిచెల్ ఫైఫర్ (అమెరికా): 250 మిలియన్ డాలర్స్
➤నికోల్ కిడ్నాన్ (ఆస్ట్రేలియా): 250 మిలియన్ డాలర్స్
➤సాండ్రా బుల్లక్ (అమెరికా): 250 మిలియన్ డాలర్స్
➤స్కార్లెట్ జోహన్సన్ (అమెరికా): 160 మిలియన్ డాలర్స్
➤ఐశ్వర్య రాయ్ (ఇండియా): 100 మిలియన్ డాలర్స్
➤ఎమ్మా వాట్సాన్ (యూకే): 85 మిలియన్ డాలర్స్
➤మార్గోట్ రాబీ (ఆస్ట్రేలియా): 60 మిలియన్ డాలర్స్
➤దీపికా పదుకొనే (ఇండియా): 40 మిలియన్ డాలర్స్

జామీ గెర్ట్జ్

అమెరికాకు చెందిన ఈమె.. సినీ నటి, వ్యాపారవేత్త కూడా. ఈమె పూర్తిపేరు జామీ బెత్ గెర్ట్జ్. ది లాస్ట్ బాయ్, లెస్ దెన్ జీరో, ట్విస్టర్ వంటి సినిమాల ద్వారా బాగా ఫేమస్ అయిన జామీ.. అమెరికాలో 1965 అక్టోబర్ 28న జన్మించింది. ఆమె సంపద ప్రస్తుతం రూ. 99వేలకోట్ల కంటే ఎక్కువ. ఈమె భర్త టోనీ రెస్లర్ కూడా ఒక బిలినీయర్ వ్యాపారవేత్త కాబట్టి.. వీరిరువురు సంపద ఇంకా ఎక్కువ. ఈమె తరువాత ఓప్రా విన్‌ఫ్రే, సెలీనా గోమెజ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

ఐశ్వర్య రాయ్ బచ్చన్

నటి ఐశ్వర్య రాయ్.. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ నటి. ఇప్పుడు గ్లోబల్ స్టాటిస్టిక్స్ వెల్లడించిన జాబితాలో 17వ స్థానాల్లో ఉన్నారు. ఈమె మొత్తం ఆస్తి రూ. 900కోట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. 1997లో ఇరువరం సినిమాతో.. సినిమా రంగంలోని అడుగుపెట్టిన ఈమె హిందీ, తెలుగు భాషల సినిమాల్లో కూడా నటించింది. ఈమె అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప కూడా ఉంది.

దీపికా పదుకొనే

భారతదేశానికి చెందిన మరో సంపన్న హీరోయిన్ దీపికా పదుకొనే. ఈమె మొత్తం సంపద రూ. 300కోట్ల కంటే ఎక్కువ. ఈమె 2006లో ఐశ్వర్య అనే కన్నడ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తరువాత హిందీ సినిమాల్లో కూడా నటించింది. కల్కి 2898 ఏడీ సినిమాలో కూడా నటించి మరింత పాపులర్ అయింది. 1986 జనవరి 5న జన్మించిన ఈమె.. 2018లో నటుడు రణవీర్ సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఒక సంతానం.