Top 5 Best Mileage Cars in India 2025: ఇండియన్ మార్కెట్లో ఖరీదైన కార్లను కొనుగోలు చేసేవారి కంటే తక్కువ ధరలో లభించే కార్లను కొనుగోలు చేసేవారి సంఖ్యే ఎక్కువ. కాబట్టి మనం ఈ కథనంలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధర వద్ద.. కొంత ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు ఏవి?, వాటి వివరాలు ఏమిటి అనేది వివరంగా తెలుసుకుందాం.
మారుతి సెలెరియో (Maruti Celerio)
భారతదేశంలో ప్రస్తుతం ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల జాబితాలో మారుతి సెలెరియో ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్. దీని ప్రారంభ ధర రూ. రూ. 5.64 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని కే10 డ్యూయెల్ జెట్ ఇంజిన్ మంచి పనితీరును అందిస్తుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తుంది. ఇది 26.25 కిమీ/లీ (పెట్రోల్ వెర్షన్), 35.6 కిమీ/కేజీ (CNG వెర్షన్) మైలేజ్ ఇస్తుంది.
మారుతి వ్యాగన్ ఆర్ (Maruti Wagon R)
తక్కువ ధరలో.. మంచి మైలేజ్ అందించే కార్ల జాబితాలో మారుతి సుజుకి కంపెనీకి చెందిన వ్యాగన్ ఆర్ ఒకటి. రూ. 5.64 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు 1.0 లీటర్ మరియు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఎంపికలను పొందుతుంది. చూడటానికి ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఈ కారు అత్యుత్తమ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు యొక్క పెట్రోల్ మోడల్ 25.19 కిమీ/లీ మైలేజ్ అందిస్తే.. CNG కారు 34.05 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది.
మారుతి స్విఫ్ట్ (Maruti Swift)
రూ. 6.49 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న మారుతి స్విఫ్ట్.. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కారు. ఇది కూడా ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల జాబితాలో ఒకటి. ఇది పెట్రోల్ మరియు CNG రూపంలో అందుబాటులో ఉంది. పెట్రోల్ వెర్షన్ 24.80 కిమీ/లీ మైలేజ్ అందిస్తే.. CNG కారు 35.55 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. మంచి లుక్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు కావాలనుకునే వారికి స్విఫ్ట్ ఓ మంచి ఎంపిక అవుతుంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios)
మైలేజ్ పరంగా మాత్రమే కాకుండా.. డిజైన్ మరియు ఉత్తమ ఫీచర్స్ కోరుకుంటే.. హ్యుందాయ్ కంపెనీ యొక్క గ్రాండ్ ఐ 10 నియోస్ మంచి ఎంపిక అవుతుంది. ఇది 1.2 లీ పెట్రోల్ ఇంజిన్ మరియు CNG ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ కారు 20.7 కిమీ/లీ మైలేజ్ అందిస్తే.. CNG మోడల్ 28.5 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 5.98 లక్షలు (ఎక్స్ షోరూమ్).
Also Read: మరోమారు పెరగనున్న కార్ల ధరలు: ఏప్రిల్ నుంచి కొత్త కారు కొనడం సాధ్యమేనా?
టాటా టియాగో (Tata Tiago)
మైలేజ్ మాత్రమే కాకుండా.. ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కారు కావాలనుకునే వారికి టాటా మోటార్స్ యొక్క టియాగో బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఇది గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో 4 స్టార్ రేటింగ్ సాధించింది. కాబట్టి ఇది దేశీయ విఫణిలో అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉంది. ఇది కూడా పెట్రోల్ మరియు CNG రూపంలో అందుబాటులో ఉంది. పెట్రోల్ మోడల్ 20.09 కిమీ/లీ మైలేజ్ అందిస్తే.. CNG మోడల్ 26.49 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 5.00 లక్షలు (ఎక్స్ షోరూమ్).