Toyota Taisor Limited Edition launched in India: పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి బాలెనో రీగల్ ఎడిషన్ లాంచ్ చేసిన రెండు రోజులకే టయోటా కంపెనీ కూడా ఇదే బాటలో నడిచింది. తాజాగా సరికొత్త ‘టైసర్ లిమిటెడ్ ఎడిషన్’ (Taisor Limited Edition) లాంచ్ చేసింది. ఇది దాని స్టాండర్డ్ వెర్షన్ కంటే కూడా ఆధునిక హంగులను పొందుతుంది.
దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టయోటా టైసర్ లిమిటెడ్ ఎడిషన్ అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది బయట మరియు లోపలి వైపున కాస్మొటిక్ అప్డేట్స్ పొందటమే కాకుండా కాంప్లిమెంటరీ యాక్సెసరీస్ ప్యాకేజీని పొందుతుంది.
టైసర్ లిమిటెడ్ ఎడిషన్ రూ. 20160 విలువైన టయోటా జెన్యూన్ యాక్సెసరీస్ (TGA) పొందుతుంది. ఇందులో గ్రానైట్ గ్రే అండ్ రెడ్ కలర్ స్పాయిలర్, డోర్ సీల్ గార్డ్స్, హెడ్‌ల్యాంప్ చుట్టూ క్రోమ్ గార్నిష్, ఫ్రంట్ గ్రిల్ మరియు సైడ్ మౌల్డింగ్ వంటివి ఉన్నాయి. క్యాబిల్ లోపల డోర్ వైజర్స్, ఆల్ వెదర్ 3డీ మ్యాట్స్ మరియు డోర్ లాంప్స్ ఉన్నాయి.
టయోటా టైసర్ లిమిటెడ్ ఎడిషన్ అన్ని టర్బో వేరియంట్లలో లభిస్తుంది. దీని ధరలు రూ. 10.56 లక్షల నుంచి రూ. 12.88 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ ఇప్పుడు కంపెనీ యొక్క అన్ని అధీకృత డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వాహన ప్రేమికులు ఈ కారును కొనుగోలు చేయవచ్చు.
టైసర్ ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 98.6 Bhp పవర్ మరియు 147.6 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుంది. పండుగ సమయంలో మరింత అమ్మకాలను పొందటానికి టయోటా కంపెనీ ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుందో తెలుసుకోవాలంటే.. కొన్ని రోజులు వేచి చూడాలి.
లిమిటెడ్ ఎడిషన్స్ లాంచ్ చేయడానికి కారణం
నిజానికి కార్లను కొనుగోలు చేసేవారిలో కొంతమంది సాధారణ కార్లకంటే కొంత భిన్నంగా ఉండే కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అలాంటి వాళ్ళ కోసం కొన్ని సంస్థలు కొన్ని కాస్మొటిక్ అప్డేట్లతో కూడా వెర్షన్స్ లాంచ్ చేస్తారు. ఇవి కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉంటాయి. ఇవి వాటి స్టాండర్డ్ మోడల్స్ కంటే కూడా కొంత భిన్నమైన డిజైన్ పొందుతాయి. అయితే ఇంజిన్లో పెద్దగా మార్పులు ఉండవు. కాబట్టి పనితీరులో ఎటువంటి అప్డేట్ ఉండదు.
లిమిటెడ్ ఎడిషన్స్ లేదా స్పెషల్ ఎడిషన్స్ ధరలు వాటి సాధారణ మోడల్స్ కంటే కూడా కొంత ఎక్కువగా ఉంటాయి. అయితే ధరకు తగిన ఫీచర్స్ తప్పకుండా పొందవచ్చు. ఇది సాధారణ కార్లకంటే కూడా చాలా లేటెస్ట్ డిజైన్ కలిగి ఉండటం వల్ల.. చూడగానే ఆకర్శించే విధంగా ఉంటాయి.
ప్రత్యర్థులు
మారుతి సుజుకి ఫ్రాంక్స్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, నిస్సాన్ మాగ్నైట్ మరియు రెనాల్ట్ కైగర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న టయోటా టైసర్ లిమిటెడ్ ఎడిషన్ అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము.
Don’t Miss: అమితాబ్ బచ్చన్ గ్యారేజిలో అద్భుతమైన కొత్త కారు: ధర ఎన్ని కొట్లో తెలుసా..
సేఫ్టీ ఫీచర్స్
స్టాండర్డ్ టైసర్ కారు 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, హెడ్ ఆప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, ప్యాడిల్ షిఫ్టర్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఆధునిక కార్లలో భద్రతకు ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటివి ఉన్నాయి. ఇవన్నీ ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తాయి. కాబట్టి ప్రయాణ సమయంలో ప్రాణాలు రక్షించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి.