ఫలించిన నారా లోకేష్ కృషి: కేంద్రం వందల కోట్లు మంజూరు

విద్యార్థులు భవిష్యత్తు కోసం రాష్ట్ర విద్యాశాఖ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూనే ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో వివిధ శాఖల కేంద్రమంత్రులను కలిసి.. విద్యారంగాన్ని మరింత ప్రోత్సహించడానికి అదనపు నిధులు కావాలని కోరారు. మంత్రి ఢిల్లీ పర్యటనను ముగించుకుని వచ్చే సరికి కేంద్రం భారీ నిధులను మంజూరు చేసింది.

రూ.432.19 కోట్లు మంజూరు

మునుపెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు కేంద్రం ఏకంగా రూ. 432.19 కోట్లు కేటాయించింది. సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాలలు అభివృద్ధి చేయడానికి.. ఐసీటీ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, డిజిటల్ తరగతుల కోసం రూ. 167.46 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. డైట్ కళాశాలల అభివృద్ధికి కూడా నిధులు మంజూరు చేశారు. ఆదివాసీ విద్యార్థులు వసతి గృహాల కోసం రూ. 11 కోట్లు విడుదల చేయడం హర్షించదగ్గ విషయం.

కేంద్రమంత్రులను కలిసిన నారా లోకేష్

మంత్రి లోకేష్ చొరవతో.. రాష్ట్ర విద్యాశాఖను అభివృద్ధి చేయడానికి కేంద్రం కూడా ఆసక్తి చూపుతోంది. ఢిల్లీ పర్యటనలో పీయూష్ గోయల్, అశ్వని వైష్ణవ్, నితిన్ గడ్కరీ, నిర్మల సీతారామన్, సర్బానంద సోనావాల్, హర్దీప్ సింగ్ పూరీ, జేపీ నడ్డా, జైశంకర్ వంటి కేంద్ర మంత్రులను లోకేష్ కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తమ సహకారం అందించాలని కోరారు.

రాష్ట్రంలో విద్యాశాఖ అభివృద్ధి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ అభివృద్ధికి.. నారా లోకేష్ కీలక చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు నాణ్యమైన చదువును అందిస్తూ.. వారి అవసరాలకు కావలసినవన్నీ అందించడానికి కృషిని చేస్తున్నారు. పరీక్షలు, పరీక్ష ఫలితాల విషయంలో కూడా ఏ మాత్రం జాప్యం జరగకుండా ఉండటానికి తగిన ఏర్పాట్లు చేశారు.

సాగర తీరంలో ఏఐ సెంటర్

విశాఖపట్టణంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సిటీ ఏర్పాటు కోసం కూడా.. నారా లోకేష్ ఢిల్లీ పెద్దలతో చర్చించారు. ఉపాధి కోసం యువత విదేశాలకు తరలివెళ్ళిపోతున్నారు. అలాంటి వారి కోసం సాఫ్ట్ స్కిల్స్‌లో ట్రైనింగ్ ఇవ్వడానికి ఏఐ సెంటర్, డేటా సిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనికి తమ సహకారం ఉంటుందని జైశంకర్ పేర్కొన్నారు.

ఐదేళ్ల పాలనలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతకు మాటిచ్చిన నారా లోకేష్.. దీనికి అనుగుణంగానే తగిన చర్యలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)కు ప్రాధాన్యత పెరుగుతుంది. కాబట్టి ఆ రంగంలో మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందాలంటే.. తప్పకుండా ఇందులో యువత నైపుణ్యం సంపాదించాలి. దీనికోసం ప్రత్యేకంగా ఏఐ సెంటర్ ఏర్పాటు చేయడానికి లోకేష్ సంకల్పించారు. మొత్తం మీద చెప్పింది చేయడానికి నారా లోకేష్ అహర్నిశలు కష్టపడుతున్నారు. రాష్ట్రాభివృద్ధికి తనవంతు కృషిచేస్తున్నారు.

ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌ను లోకేష్ శుభాకాంక్షలు

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సీపీ రాధాకృష్ణన్‌ను.. మంత్రి నారా లోకేష్ టీడీపీ ఎంపీలతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎపికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. పలు రాష్ట్రాలకు గవర్నర్ బాధ్యతలు చేపట్టి.. రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేసిన అనుభవం, దేశానికి సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని లోకేష్ ప్రస్తావించారు.

Leave a Comment