ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా మైదాన ప్రాంతాల్లో బ్రతుకుతున్న ఇంచుమించు అందరి దగ్గర కూడా ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి. మనం ఫోన్ కొన్నప్పుడే అందులో కంపెనీ వాల్లే చాలా యాప్స్ ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. ఆటోమెటిక్‌గా యూట్యూబ్, ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ఉపయోగించడం అలవాటు అవుతుంది. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికో లేదా ఏదైనా సమాచారం కోసమో వీడియోలు ఓపెన్ చేస్తే మొదటగా యాడ్స్ దర్శనమిచ్చి విసుగుతెప్పిస్తాయి. అవి కూడా చాలా వరకు స్కిప్ చేయడానికి వీలు లేకుండా.. తప్పనిసరిగా చూడాల్సిన యాడ్సే ఉంటాయి. ఇందువల్ల వ్యూవర్స్ యొక్క సమయం, డేటా వృథా అవుతోందని భావించిన వియత్నాం ప్రభుత్వం మొదటిసారిగా ప్రపంచంలో ఎక్కడా లేని సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.
ఐదు సెకండ్స్ తరువాత స్కిప్ ఆప్షన్!
సోషల్ మీడియా యూజర్స్ అనవసరంగా ఈ యాడ్స్ వల్ల ఇబ్బంది పడుతుండటం కారణంగా వియత్నాం గవర్నమెంట్ ఆ దేశంలో డిక్రి 342/2025 పేరుతో ఒక చట్టం తీసుకొచ్చింది. చాలా అడ్వర్‌టైజ్‌మెంట్స్ దాదాపు 15 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ నిడివితో వస్తుంటాయి. వాటిని స్కిప్ చేసే అవకాశం కూడా ఉండటం లేదు. మనకు కావాల్సిన వీడియో చూడటానికి ముందు అది అవసరం ఉన్నా లేకున్నా కచ్చితంగా ఆ యాడ్ చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిని పరిగణలోకి తీసుకున్న వియత్నాం ప్రభుత్వం ఇకపై 5 సెకండ్స్ తరువాత స్కిప్ చేసుకునే ఆప్షన్ ఇవ్వాలని ఆదేశించింది. దీని వలన యాడ్ చూడడం ఇష్టం లేనివారు స్కిప్ చేయొచ్చు. దీంతో ఇంక నుంచి ముందులాగా తప్పనిసరిగా యాడ్ చూసే పరిస్థితి అయితే ఉండదు.
వేచి ఉండాల్సిన అవసరం లేదు!
అనేక సోషల్ మీడియా యాప్‌లలో వీడియో రూపంలో కాకుండా.. కొన్ని మాత్రం ఫోటోల మాదిరిగా యాడ్ ఇస్తుంటారు, అలాగే ఇంకా బ్యానర్స్ మాదిరిగా కూడా మనకు కనిపిస్తుంటాయి. వాటిని అయితే స్కిప్ చేసే ఆప్షన్ ఉండదు. వాళ్లు ఇచ్చిన ఒక టైమ్ తరువాత క్లోజ్ చేసే బటన్ అనేది ఎక్కడో చిన్నగా కనిపించి కనిపించనట్టు ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికోసం వ్యూవర్స్ వేచి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆ యాడ్ క్లోసింగ్ బటన్స్ కూడా బాగా అందరికీ కనిపించే విధంగా పెద్దగా ఉండాలని చెప్పింది. ప్రేక్షకులను తప్పుదోవ పట్టించేలా కనిపించని ఆప్షన్స్ ఇవ్వకూడదని కఠినంగా చెప్పడం జరిగింది.
ఉద్దేశం ఏమిటంటే..
ఒకవేళ సమాజానికి హానికరం చేసే విధంగా ఉన్నా లేదా చాట్టాలని ధిక్కరించి తీసే ఎలాంటి ప్రకటనలపై అయినా.. కంప్లైంట్ చేసే సెట్టింగ్స్ చాలా ఎక్కువగా, అన్ని వర్గాల ప్రజలకు అర్థం అయ్యే పద్ధతిలో ఇవ్వాలని, వాళ్లు సంఘానికి నష్టం చేసే ఏ యాడ్స్‌కు అయినా రిపోర్ట్ సబ్మిట్ చేసే అన్ని ఆప్షన్స్ కల్పించాలని తెలిపింది. ఈ చట్టం వల్ల యాడ్ చూసే వారిని జాగ్రత్తగా కాపాడుకునే వీలుంటుందని, వ్యూవర్స్ సమయాన్ని వృధా చేయకుండా వారి విలువైన ఆ కాసేపటిని సమయాన్ని వారికి ఇవ్వాలన్నదే చట్టం యొక్క ఉద్దేశం అని గవర్నమెంట్ చెప్పుకొచ్చింది.
ఫిబ్రవరి 15 నుంచి అమలు!
అయితే ఈ చట్టం ఇప్పుడే వర్తించదు . రేపు నెల (2026 ఫిబ్రవరి 15) నుంచి వియత్నాం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలుపరుస్తుంది. ఆ తరువాత కూడా యాడ్స్‌కు సంబంధించిన ఎటువంటి పొరపాట్లు జరిగిన లేదా చట్టం చెప్పిన దాని ప్రకారం నడుచుకోకపోయినా అందుకు తగిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. ఏదైనా నోటీసులు ఇస్తే ఒకరోజు లోపు దానికి స్పందించాలని వెల్లడించింది. అలా కాకుండా.. చట్టాలను అతిక్రమించి ఏది చేసిన సరే శిక్ష అనుభవిస్తారు. ఆ యాప్ లేదా సంస్థకు సంబంధించిన కార్యకలాపాలను శాశ్వతంగా తమ దేశంలో నిలిపివేస్తామని హెచ్చరించింది.
వియత్నాం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అనేక దేశాలలోని ప్రజలు స్వాగతిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ రకమైన చట్టాలు రావాలని అభిప్రాయపడుతున్నారు. అప్పుడు ఈ అవసరం లేని యాడ్స్ స్కిప్ చేయడానికి అవకాశం దొరుకుతుంది అన్నది చాలామంది ఆలోచన.
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.






