నటి సమంత.. ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరును రెండో పెళ్లి చేసుకుంది. నిజానికి వీరి పెళ్లి భూత శుద్ధి వివాహం అనే సంప్రదాయంలో జరిగింది. దీంతో చాలామందికి ఈ వివాహ పద్దతి గురించి తెలుసుకోవాలనే ఆత్రుత కలిగింది. దీనికి కారణం హిందూ సాంప్రదాయం ఎనిమిది రకాల వివాహాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఈ భూత శుద్ధి వివాహం గురించి ప్రస్తావన లేదు. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలతో పాటు.. ఎనిమిది రకాల వివాహాల గురించి కూడా ఇక్కడ తెలుసుకుందాం.
భూత శుద్ధి వివాహం
ఇది హిందూ సంప్రదాయం ప్రకారం చెప్పనప్పటికీ.. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన వివాహ పద్దతి. రెండో పెళ్లి చేసుకునే వారు మాత్రమే ఈ విధానం ద్వారా వివాహం చేసుకుంటారు. ఈ కారణంగానే.. సమంత ఈ పద్దతిలో పెళ్లి చేసుకుంది.
పెళ్లి చేసుకోబోయే వారు గతంలో అనుభవించిన బాధలు, నెగటివ్ అనుభవాలను చెరిపేసి.. కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలని ఈ భూత శుద్ధి వివాహం పద్దతిలో పెళ్లి చేసుకుంటారు. ఇప్పటివరకు చాలామంది సెలబ్రిటీలు రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ.. ఈ పద్దతిలో ఎవరూ పెళ్లి చేసుకోలేదు.
హిందూ సంప్రదాయం ప్రకారం ఎనిమిది రకాల పెళ్లిళ్లు
బ్రహ్మ వివాహం: అందరూ ఆమోదించిన, అత్యంత శ్రేష్ఠమైన వివాహంగా దీనిని పరిగణిస్తారు. వధువు తండ్రి.. కుమార్తెకు అన్ని విధాలా యోగ్యుడైన వరుడిని వెతికి.. తల్లితండ్రుల అంగీకారంతో అగ్ని సాక్షిగా, వేదమంత్రాల నడుమ, కుటుంబీకుల ఆశీస్సులతో పెళ్లి చేస్తారు. అనాది కాలం నుంచి ఈ పద్దతిలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికీ.. చాలామంది ఈ పద్దతికే పాటిస్తున్నారు.
గంధర్వ వివాహం: ప్రస్తుత కాలంలో చెబుతున్న ప్రేమ వివాహాలే.. అప్పటి గంధర్వ వివాహాలు. యువతీ.. యువకుల మనసులు కలిసి, ఇరువురి పరస్పర అంగీకారంతో జరిగే వివాహం ఇది. దీనికి పెద్దల అంగీకారంతో పనిలేదు. దీనిని కూడా ధర్మబద్ధమైన వివాహమనే చెబుతారు. కానీ దీనివల్ల లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
దైవ వివాహం: ఈ పద్దతిలో ఒకప్పుడు పెళ్లిళ్లు జరిగేవి. యజ్ఞయాగాలు, పండుగలు జరుగుతున్న సమయంలో.. తమ కుమార్తెను పూజారికి బహుమతిగా ఇస్తారు. అమ్మాయిని పూజారికి ఇచ్చే ఒక బహుమతిగా భావించేవారు. దీనిని దైవ వివాహం అని చెబుతారు. ఇది ఒకప్పుడు ఆమోదయోగ్యమైన.. ఇప్పుడు దీనిని ఎవరూ ఆమోదించరు.
ఆర్ష వివాహం: ఇది ఒకరకమైన వస్తుమార్పిడి పద్దతి అనే చెప్పాలి. ఎందుకంటే.. ఈ పద్దతిలో వధువు తండ్రి, వరుడి దగ్గర నుంచి రెండు ఆవులు లేదా రెండు ఎత్తులను తీసుకుంటాడు. దానికి బదులుగా.. తమ కుమార్తెను వరుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇది కూడా ప్రస్తుతం ఆమోదయోగ్యం కాదని చట్టాలు చెబుతున్నాయి.
ప్రజాపత్య వివాహం: ధర్మార్ధ కామ మోక్షములలో భార్యను విడువకుండా.. ధర్మ మార్గాన్ని అనుసరించాలని వధువు తండ్రి.. తన కుమార్తెను పెళ్లి చేస్తూ.. పాటించాల్సిన విషయాలను గుర్తు చేస్తారు. ఇది కూడా శాస్త్ర సమ్మతమైన వివాహం. పెద్దల ఆశీర్వాదంతో కలకాలం వర్ధిల్లాలని ఈ వివాహం జరుపుతారు.
అసుర వివాహం: ఇది ఒకరకమైన కట్న కానుకలు సంబంధించిన వివాహం. ఇందులో డబ్బుకు ప్రాధాన్యత ఉంటుంది. వరుడు.. వధువు కుటుంబానికి కొంత డబ్బు ఇచ్చి.. యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఉదాహరణకు.. ఎక్కువ వయసైపోయిన వరుడు.. యువతులను పెళ్లి చేసుకోవడం వంటివి ఇందులో ఉంటాయి.
రాక్షస వివాహం: పేరుకు తగిన వివాహం ఇది. వరుడు, వధువు తరపు వాళ్లను బెదిరించి.. యువతిని బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాడు. ఇందులో వధువు, వధువు తరపు తల్లిదండ్రుల ఇష్టాలతో సంబంధం ఉండదు. ఇది ఒకప్పటి నుంచి ఆమోదయోగ్యం కాదు. ఇది ఇప్పుడు చట్టరీత్యా నేరం కూడా.
పైశాచిక వివాహం: ఇది కూడా ఒకరకమైన రాక్షస పద్దతి వివాహం. వరుడు.. వధువు కుటుంబ సభ్యుల కళ్లుకప్పి.. యువతిని తీసుకెళ్ళిపోతాడు. పెళ్లి చేసుకుంటాడు. ఇది కూడా ఆమోదయోగ్యం కాదు, చట్టరీత్యా నేరం కూడా. అయితే ప్రస్తుతం ఇలాంటి వివాహాలు అమలులో లేదు.
పెళ్లిపై మా అభిప్రాయం
వివాహం అనేది మనిషి జీవితంలో ఒక మధురమైన ఘట్టం. కాబట్టి పెళ్లి ఎలా జరిగినా.. భర్తకు భార్య, భార్యకు భర్త తోడు నీడగా ఉంటూ.. మరో పదిమందికి ఆదర్శం కావలి. పెళ్లి తరువాత భార్యలు భర్తలను హింసించడం, భర్త భార్యను హింసించడం అనేది సమంజసం కాదు. ఉన్నది ఒకటే జీవితం.. ఆనందగా అనుభవించాలి. ఎప్పుడూ గొడవలు పెడుతుంటే.. సంతోషం ఎక్కడ వస్తుంది? చెప్పండి.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.