బంగారం కంటే ఖరీదైనది.. ఒక గ్రామ్ 200 కేజీల గోల్డ్‌కు సమానం!

ప్రపంచంలో ఖరీదైన మెటల్ ఏమిటి? అని అడిగితే.. డైమండ్ (వజ్రం), గోల్డ్ (బంగారం) అని చెబుతారు. అయితే వీటికంటే ఖరీదైనది.. మీ ఊహకు కూడా అందనిది ఒకరు ఉంది. దీని ఒక గ్రామ్ విలువ.. 200 కేజీల బంగారం ధరకు సమానం. బహుశా ఇది మీకు ఆశ్చర్యంగానే అనిపించినప్పటికీ ఇది నిజమే. ఇంతకీ అంత విలువైన ఆ పదార్థం ఏది?, దాన్ని ఎక్కడ ఉపయోగిస్తారు?, ఎక్కడ లభిస్తుంది? అనే ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో వివరంగా..

కాలిఫొర్నియం 252

కాలిఫోర్నియా అనే పేరు చాలామందే విని ఉంటారు. కానీ ఈ పేరుతో (కాలిపోర్నియం 252) ఒక విలువైన పదార్థం ఉందని బహుశా కొందరికి మాత్రమే తెలిసి ఉండొచ్చు. బంగారం కంటే విలువైన ఈ పదార్థం.. గోల్డ్ మాదిరిగా భూమి పొరల్లో లభించదు. దీనిని మనుషులే తయారు చేస్తారు. అయితే దీనిని తయారు చేయడం అనుకున్నంత ఈజీ అయితే కాదు!.

రూ.200 కోట్ల కంటే ఎక్కువ!

ఒక గ్రామ్ కాలిఫోర్నియం 252 విలువ సుమారు 27 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ. 200 కోట్ల కంటే ఎక్కువే. దీన్ని బట్టి ఈ పదార్థం విలువ ఎంతో సులభంగా అర్థం చేసుకోవచ్చు. దీనిని అను రియాక్టర్ల ద్వారా.. చాలా చిన్న పరిమాణంలో తయారు చేస్తారు. కాబట్టే దీనికి విలువ చాలా ఎక్కువ.

ఆభరణాలుగా పనికిరాదు!

కాలిఫోర్నియం 252 విలువైన పదార్థమే అయినప్పటికీ.. దీనిని ఆభరణాలుగా ఉపయోగించలేరు. ఆభరణాలుగా తయారు చేసుకోలేరు. అయితే దీనిని క్యాన్సర్ చికిత్సలో భాగంగా.. న్యూట్రాన్ థెరఫీ కోసం ఉపయోగిస్తారు. అంతే కాకుండా కణాలను నాశనం చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది.

తయారీ కష్టం!

నిజానికి దీనిని అను రియాక్టర్లలో బరువైన మూలకాల నుంచి వికిరణం చేసి.. తరువాత ఉత్పత్తి చేస్తారు. ఇది న్యూట్రాన్‌లను సంగ్రహిస్తుంది. దీనిని తయారు చేసే ప్రక్రియ కూడా చాలా కఠినం, సమయం కూడా ఎక్కువ తీసుకుంటుంది. అయితే ఈ పదార్థాన్ని ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడం కూడా కష్టమే.

అత్యంత విలువైన కాలిఫోర్నియం 252 పాదార్థాన్ని.. 1950లో అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో బర్కీలీ శాస్త్రవేత్తలు ఉత్పత్తి చేసారు. ఈ కారణంగానే ఆ పదార్థానికి కాలిఫొర్నియం అని పేరు పెట్టారు. ఇప్పటికీ ఇది ఖరీదైన, అరుదైన పదార్థంగా నిలిచిపోయింది.

ధర ఎక్కువగా ఉండటానికి కారణం!

కాలిఫొర్నియం 252తో పోలిస్తే బంగారం ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి దీని ధర కాలిఫొర్నియం 252 కంటే చాలా తక్కువ. ఎప్పుడైతే ఉత్పత్తి తక్కువగా ఉండి, డిమాండ్ కొంత ఎక్కువగా ఉందంటే దాని రేటు పెరుగుతుంది. ఇదే ఫార్ములా ప్రకారం.. కాలిఫొర్నియం ధర చాలా ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి.

బంగారం ధరలు ఇలా

మన దేశంలో గోల్డ్ రేట్లు పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి. ఎంత తగ్గినప్పటికీ.. మధ్యతరగతి ప్రజలు కొనే స్థాయికి ధరలు రాలేదు. అయితే రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గుతాయని, లక్ష రూపాయల కంటే (తులం ధర) తక్కువకు చేరుతుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు ఆలా అనిపించడం లేదు, కనిపించడం కూడా లేదు. బహుశా తగ్గుతే పసిడి ప్రియులకు అనే చెప్పాలి.